ఇటీవల నాలుగో పెళ్లి చేసుకున్న మలయాళ నటుడు బాలా చేసిన కామెంట్స్ వైరల్‌గా మారాయి. తన పెళ్లి గురించే ఎవరైనా అసూయ పడితే అది వారి తప్పని అన్నారు. అమ్మాయిలు దొరక్క ఇబ్బందిపడే వారు తమను చూసి అసూయ పడుతున్నారని చెప్పారు. అయితే వాళ్ల దగ్గర డబ్బు లేకనే అమ్మాయిలు దొరకడం లేదన్నారు. ప్రతి దానిలో తప్పులు వెతకడమే అలాంటి వారి పని అని చెప్పారు. లూసిఫర్, హిట్ లిస్ట్ వంటి చిత్రాల్లో బాలా నటించారు.
బాలా నాలుగో భార్య పేరు కోకిల తమిళనాడులోని చెన్నైలో పుట్టి పెరిగింది. చిన్నప్పటి నుంచి నటుడు బాలా ని ప్రేమిస్తున్నట్లు సమాచారం. ఈ కారణంగానే గతంలో నటుడు బాలా కి 3 పెళ్ళిళ్ళయ్యి విడాకులైనప్పటికీ కోకిల బాలా ని పెళ్లి చేసుకునేందుకు అంగీకరించినట్లు సమాచారం.
బాలాకు గతంలో మూడు పెళ్లిళ్లు అయ్యాయి. మలయాళ గాయని అమృతా సురేశ్‌ను ఆయన మూడో వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు ఒక పాప ఉంది. అనుకోని కారణాలతో విడిపోయారు. ఆయన తమని మానసిక వేధింపులకు గురి చేస్తున్నాడని.. ఇబ్బందులు పెడుతున్నాడంటూ కొంతకాలం క్రితం ఆమె పోలీసులను సంప్రదించారు. ఈ కేసులో అరెస్టు అయిన ఆయన ఇటీవల బెయిల్‌పై బయటకు వచ్చారు. కొన్నిరోజులకే బంధువుల అమ్మాయిని నాలుగో వివాహం చేసుకున్నారు. వయసులో తనకెంటే 18 ఏళ్లు చిన్నదైన అమ్మాయిని నాలుగో పెళ్లి చేసుకోవడం నెట్టింట చర్చనీయాంశమైన విషయం తెలిసిందే.