Bala Krishna: 71వ జాతీయ చలనచిత్ర అవార్డులు తాజాగా కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. 2023లో విడుదలైన సినిమాల మధ్య ఈ అవార్డుల ఎంపిక జరగగా.. తెలుగు చిత్రాలు ఈసారి నిజంగా సత్తా చాటాయి. వివిధ విభాగాల్లో మన సినిమాలు దేశవ్యాప్తంగా గుర్తింపు పొందడం తెలుగు సినీ ప్రియులకు గర్వకారణం.
ఉత్తమ తెలుగు చిత్రం ‘భగవంత్ కేసరి’
నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన ‘భగవంత్ కేసరి‘ ఉత్తమ తెలుగు ప్రాంతీయ చిత్రంగా ఎంపికై జాతీయ అవార్డును గెలుచుకుంది. ఈ చిత్రం రూపొందించిన దర్శకుడు అనిల్ రావిపూడి, నిర్మాతలు సాహు గారపాటి, హరీష్ పెద్ది లు, అలాగే నటీనటులు, సాంకేతిక బృందం అందరి కృషికి ఇది ప్రతిఫలం అని బాలయ్య తెలిపారు. తెలంగాణ యాసలో బాలయ్య నటన, శ్రీలీల పాత్ర ప్రదర్శనకు మంచి ప్రశంసలు దక్కాయి.
బాలకృష్ణ ఈ అవార్డుపై స్పందిస్తూ,
“ఈ గౌరవం మా బృందానికి చేంజింది. జాతీయ స్థాయిలో గుర్తింపు రావడం ఎంతో గర్వకారణం. ఇది మమ్మల్ని మరింత ఉత్తమమైన కథలను అందించేందుకు ప్రేరణ ఇస్తోంది,” అని పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: Delhi: జాతీయ ఉత్తమ నటులు వీళ్ళే
ఇతర తెలుగు చిత్రాల విజయాలు
👉 హనుమాన్:
విజువల్ ఎఫెక్ట్స్, యాక్షన్ డైరెక్షన్ విభాగాల్లో రెండు జాతీయ అవార్డులు గెలుచుకుంది. టెక్నికల్ గా తెలుగు సినిమా ఎదుగుతున్న స్థాయికి ఇది నిదర్శనం.
👉 బేబి:
ఈ చిత్రానికి ఉత్తమ స్క్రీన్ ప్లే రచయిత అవార్డు దక్కింది. అలాగే ‘ప్రేమిస్తున్నా’ అనే పాటకి గాయకుడిగా పీవీఎన్ఎస్ రోహిత్ జాతీయ అవార్డును గెలుచుకున్నారు.
👉 బలగం:
ఈ సినిమాకు ఉత్తమ గేయ రచయిత అవార్డు లభించింది. గ్రామీణ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా దేశవ్యాప్తంగా ఆకట్టుకుంది.
👉 సుకృతివేణి:
దర్శకుడు సుకుమార్ కుమార్తె సుకృతివేణి, ఉత్తమ బాలనటిగా ఎంపికై గౌరవాన్ని పొందింది.
మొత్తం దేశవ్యాప్తంగా గుర్తింపు
ఈసారి 22 భాషల్లో 115 సినిమాలను జ్యూరీ పరిశీలించింది. వాటిలో తెలుగు సినిమాలకు పెద్దపాటి గౌరవం దక్కడం సినీ రంగానికి కొత్త ఉత్సాహాన్ని ఇస్తోంది. భవిష్యత్తులో మరిన్ని మంచి కథలు, గొప్ప సినిమా అనుభవాలు రావాలని ప్రేక్షకులు ఆశిస్తున్నారు.