Bakasura Restaurant: హంగర్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ‘బకాసుర రెస్టారెంట్’ సినిమా విడుదలకు సిద్ధమైంది. దర్శకుడు హరీష్ శంకర్ ఈ చిత్రంలోని ‘అయ్యో ఏమీరా ఈ జీవితం’ అనే యూత్‌ఫుల్ లిరికల్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. రాహుల్ సిప్లిగంజ్ ఆలపించిన ఈ పాటకు వికాస్ బడిస సంగీతం అందించగా, యువతను ఆకట్టుకుంటోంది. ఈ సినిమాతో ఎస్‌జే శివ దర్శకుడిగా పరిచయమవుతున్నారు.
ప్రముఖ నటుడు, కమెడియన్ ప్రవీణ్ హీరోగా, వైవా హర్ష టైటిల్ రోల్‌లో నటిస్తుండగా, కృష్ణభగవాన్, షైనింగ్ ఫణి, కేజీఎఫ్ గరుడరామ్, శ్రీకాంత్ అయ్యంగార్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఎస్‌జే మూవీస్ బ్యానర్‌పై లక్ష్మయ్య ఆచారి, జనార్థన్ ఆచారి నిర్మించిన ఈ చిత్రం ఇటీవల విడుదలైన ట్రైలర్‌తో మంచి బజ్ క్రియేట్ చేసింది.
సినిమా చిత్రీకరణ పూర్తయ్యింది. ఇన్నోవేటివ్ కాన్సెప్ట్‌తో రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకులకు వినోదాన్ని, థ్రిల్‌ను అందిస్తుందని దర్శకుడు ఎస్‌జే శివ ధీమా వ్యక్తం చేశారు. త్వరలో విడుదల తేదీని ప్రకటించనున్నారు.