Badrinath Temple: శీతాకాలం ప్రవేశించడడం.. మంచు పెరిగిపోవడంతో శ్రీ బద్రీనాథ్ ధామ్ ఆలయ తలుపులు మూసివేశారు. నిన్న అంటే 17వతేదీ రాత్రి 9 గంటల తరువాత ఆలయం మూసివేసే సమయంలో బద్రీనాధునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. బద్రీనాథ్ ధామ్ తలుపులు మూసివేసిన ఈ సందర్భంలో ఆలయాన్ని 15 క్వింటాళ్ల బంతిపూలతో ఆలయాన్ని సుందరంగా అలంకరించారు.
ఇది కూడా చదవండి: Delhi Air Pollution: ఢిల్లీ వాయు కాలుష్యంపై సుప్రీంకోర్టులో విచారణ
Badrinath Temple: శ్రీ బద్రీనాథ్ ధామ్‌లోని సింగ్ ద్వార్ కాంప్లెక్స్‌లో గర్వాల్ స్కౌట్ బ్యాండ్ రాగాలతో.. బద్రీనాథుని ఆరాధిస్తూ అక్కడి పౌరోహితులు.. ప్రజలు చేస్తున్న ప్రార్ధనల మధ్య ఆలయ తలుపులు మూసివేత జరిగింది. దీంతో ఈ ఏడాది చార్ధామ్ యాత్ర కూడా పూర్తయినట్లయింది. అంతకుముందు, నవంబర్ 2న గంగోత్రి ధామ్ తలుపులు మూసివేశారు. పవిత్ర గురుద్వారా హేమకుండ్ సాహిబ్, లోక్‌పాల్ లక్ష్మణ్ దేవాలయం తలుపులు అక్టోబర్ 10న క్లోజ్ అయ్యాయి.ఇక రెండవ కేదార్ మద్మహేశ్వర్ జీ తలుపులు నవంబర్ 20న మూసివేస్తారు.