YSR Architecture Fake

YSR Architecture Fake: జగనన్న మంచి చేస్తే ఇలాగే ఉంటుంది మరి..!

YSR Architecture Fake: వైఎస్సార్సీపీ ప్రభుత్వ అనాలోచిత నిర్ణయానికి వైఎస్సార్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ వర్సిటీ విద్యార్థుల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. “కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్” అనుమతి లేకుండానే మూడు బ్యాచ్‌లకు అడ్మిషన్లు స్వీకరించింది వర్సిటీ. మొదటి బ్యాచ్‌ మరో నెలరోజుల్లో కోర్సు పూర్తి చేసుకోబోతున్నా గుర్తింపు ధ్రువపత్రాలు దక్కే పరిస్థితి లేకపోవడం ఆందోళన కల్గిస్తోంది. గత ప్రభుత్వంలో యూనివర్సిటీ అనుమతులు తేవడంలో వైసీపీ ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరించింది. ఇప్పుడు ఆర్కిటెక్చర్ విద్యార్థులకు మద్దతుగా నిరసనల్లో కూర్చోవడంలో ఆంతర్యం ఏమిటి?

2020లో కడప కేంద్రంగా అప్పటి వైఎస్సార్సీపీ ప్రభుత్వం వైఎస్ఆర్ పేరుతో ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ వర్సిటీ ఏర్పాటు చేసింది. హైదరాబాద్‌లో ఉన్న ఆర్కిటెక్చర్ విశ్వవిద్యాలయం ఏపీలోనూ ఉండాలనే ఉద్దేశంతోనే దీనిని ఏర్పాటు చేస్తున్నట్లు గొప్పగా చెప్పుకుంది. ఢిల్లీలోని కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అనుమతి తీసుకోకుండానే “నాటా” ప్రవేశ పరీక్ష ద్వారా ఉత్తీర్ణులైన వారిని కోర్సుకు ఎంపిక చేసింది. 2020లో అడ్మిషన్లు ప్రారంభించి 2021, 2022 విద్యా సంవత్సరాల్లోనూ విద్యార్థులను చేర్చుకున్నారు. మొదటి బ్యాచ్ విద్యార్థుల ఐదేళ్ల కోర్సు ఈ నెలాఖరుతో ముగుస్తోంది. ఈనెల 16 నుంచి ఫైనల్ ఇయర్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఐతే ఇంతవరకూ కౌన్సిల్‌ ఆఫ్‌ ఆర్కిటెక్చర్‌ అనుమతి లేకపోవడం వల్ల పరీక్షలు రాసి ప్రయోజం ఏంటని విద్యార్థులు గగ్గోలు పెడుతున్నారు. సర్టిఫికెట్లు లేకుండా బయటికి వెళ్లి ఏం చేయాలని ఆక్రోశిస్తున్నారు.

Also Read: Nara Lokesh: తల్లి మనకి మొదటి గురువు.. ప్రతి విజయం వెనుక గురువు ఉంటారు..

YSR Architecture Fake: జగన్ మోహన్ రెడ్డి బావ మరిది ఈసీ సురేంద్రనాథ్ రెడ్డిని కడప ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ విశ్వవిద్యాలయానికి రిజిస్ట్రార్‌గా నియమించుకుని అనేక అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. విద్యార్థుల జీవితాలతో చలగాటమాడిన వైసీపీ అధినేత… ఆర్కిటెక్చర్ యూనివర్సిటీని అద్దె భవనంలో ఉంచి జగన్ బంధువులకు లబ్ధి చేకూర్చాడన్న ఆరోపణలూ ఉన్నాయ్‌. అప్పట్లో యూనివర్సిటీలో ఉద్యోగాలు హోల్ సేల్‌గా అమ్మేసి సొమ్ము చేసుకున్నారు వైసీపీ నేతలు. మాజీ సీఎం జగన్ రెడ్డి, ఎంపీ అవినాష్‌ రెడ్డిల తప్పుల వల్ల విద్యార్థులకు నేడు ఈ ఇబ్బందులు. అధికారంలో ఉన్న ఐదేళ్లలో ఆర్కిటెక్ యూనివర్సిటీకి అనుమతులు తేవడంలో ఎందుకు అలసత్వం వహించారో సమాధానం చెప్పకుండా.. నేడు మొసలి కన్నీరు కారుస్తూ విద్యార్థులను పరామర్శించి తమ కపటత్వాన్ని బయటపెట్టుకున్నారు వైసీపీ నాయకులు. దాదాపు 8 రోజుల నుంచి నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్నారు విద్యార్థులు. విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడిన అంశం కావడంతో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం అంటున్నారు.. టీడీపీ నేతలు. మరోవైపు షర్మిల సైతం ఈ అంశం స్పందించారు. యూనివర్సిటీకి వైఎస్సార్‌ పేరు మార్చండి.. కానీ వర్సిటీని కడప నుంచి తరలించవద్దు అంటున్నారు షర్మిల.

ఇంతకూ అధికారంలో ఉన్నప్పుడు పట్టుంచుకోని జగన్ సర్కార్ ఇప్పుడు ఎందుకు మొసలి కన్నీరు కారుస్తుంది? ఎంపీగా ఉన్న అవినాష్ అప్పట్లో పార్లమెంట్‌లో ఎందుకు యూనివర్సిటీ అనుమతుల కోసం ప్రయత్నం చేయలేదు? వైసీపీ సర్కార్ ఒంటెద్దు పోకడ, నిర్లక్ష్యం వల్ల విద్యార్థుల జీవితాలు రోడ్డున పడ్డ పరిస్థితి. అయితే కూటమి ప్రభుత్వం తమ సమస్యలు పరిష్కారం చేస్తుందన్న ధీమాతోనే అక్కడి ప్రతి విద్యార్థి ఉన్నారు. మరి ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *