Yoga Day Secrets: సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేసారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం నాడు కొత్త రికార్డు దిశగా కార్యాచరణ ఖరారు చేసారు. మే 21 నుంచి మొదలు పెట్టి.. నెల రోజుల పాటు యోగా దినోత్సవం కోసం కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. యోగా మన వారసత్వమని.. యోగా మెరుగైన జీవనానికి దోహద పడుతుందని తెలిపారు. ఇదే సమయంలో రాష్ట్రంలోని ప్రజలకు చంద్రబాబు కీలక పిలుపు ఇచ్చారు. అందరి జీవితాల్లో యోగా అనేది ఒక భాగం కావాలని సీఎం చంద్రబాబు సూచించారు. ప్రపంచానికి భారత్ అందిస్తున్న గొప్ప వరం యోగా అని చెప్పుకొచ్చారు.
రాష్ట్ర వ్యాప్తంగా 2 కోట్ల మంది యోగాలో భాగస్వామ్యమయ్యేలా కార్యాచరణ రూపొందింస్తోంది కూటమి ప్రభుత్వం. 5 లక్షల మందితో వచ్చే నెల 21 తేదీన యోగా డే నిర్వహిస్తోంది. ఉదయం 7 నుంచి 8 గంటల వరకు విశాఖపట్నం రామకృష్ణ బీచ్‌లో ఈ కార్యక్రమం జరగనుంది. శిక్షణ పొందిన 10 లక్షల మందికి యోగా సర్టిఫికెట్ ఇవ్వనున్నారు. 2,500 మందిని మాస్టర్ ట్రైనర్స్‌ను ఏర్పాటు చేయనున్నారు. రాష్ట్రంలో కనీసం రెండు కోట్ల మంది యోగాలో ప్రవేశించేలా అవగాహన, శిక్షణ ఇవ్వనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 100 పర్యాటక ప్రాంతాల్లో ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఇక అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ప్రధాని మోదీ ఈ సారి ఏపీకి వస్తున్నారు.
దశాబ్దాల క్రితమే.. పార్టీలోని ముఖ్య నేతలకు.. అధికార యంత్రాంగానికి యోగా క్లాసులు ఇప్పించారు చంద్రబాబు. ప్రజలకు ఇలాంటివి మేలు చేస్తాయని.. శారీరక ఆరోగ్యం, మానసిక శాంతికి దోహదపడతాయని చంద్రబాబు నమ్ముతారు. అందుకే మోదీ ముఖ్య అధితిగా వస్తున్న కార్యక్రమంతో మరింతగా ప్రజల్లోకి వెళ్లేలా భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో మరో కోణం కూడా లేకపోలేదు. చంద్రబాబు కేవలం రాజకీయం, ఓటు బ్యాంకును దృష్టిలో ఉంచుకుని పరిపాలన చేయరు. ఆయన 1990ల నుంచే విజన్ ఉన్న నేతగా గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎన్ని చెప్పినా, పార్టీ క్యాడర్, లీడర్ల ఆకాంక్ష ఏదైనా.. పాలనలోకి వచ్చాక అన్నీ పక్కన పెట్టి.. విజన్ వెంట పరిగెడుతుంటారు. అదే ఆయనలో ఉన్న మైనస్ అని కొందరు అంటారు. కానీ దాని వల్ల అల్టిమేట్‌గా లాభం చేకూరేది ప్రజలకు, రాష్ట్రానికే అని ఆల్రెడీ విజన్ 2020తో ఫ్రూవ్ అయ్యింది.
Also Read: TDP Mahanadu: ‘మహానాడు’లో చంద్రబాబు ఇవ్వనున్న కీలక సందేశం అదేనా?
Yoga Day Secrets: ఇప్పుడు బాబు చెప్తోంది విజన్ 2047. దాన్ని సాకారం చేయాలంటే ఏపీ బ్రాండ్‌ని అంతర్జాతీయంగా ప్రమోట్ చేయాలి. ప్రపంచ దృష్టి ఏపీ మీదకు మరల్చేందుకు ఈ యోగా డే ను ఉపయోగించుకుంటున్నారు చంద్రబాబు. ఇటీవలే అమరావతి పున:నిర్మాణ పనులను ప్రారంభించిన ప్రధాని మోడీని రెండు నెలలు తిరగకముందే తిరిగి ఏపీకి రప్పిస్తున్నారు. దీంతో దేశం దృష్టి మొత్తం ఏపీపై కేంద్రీకృతమయ్యేలా, గత ప్రపంచ రికార్డులు తుడిచిపెట్టుకుని పోయేలా ఘనంగా యోగా డే ని ప్లాన్ చేస్తున్నారు. నెల రోజుల ముందు నుండే ప్రమోట్ చేయడం మొదలుపెట్టారు. 2 కోట్ల మందిని భాగస్వాములను చేస్తూ.. బాహుబలి కార్యక్రమంగా తీర్చిదిద్దుతున్నారు. ప్రస్తుతం భారీ ఇన్వెస్ట్‌మెంట్ రంగాల్లో ఆరోగ్య రంగం కూడా ఒకటి. హెల్త్, వెల్ నెస్ సెంటర్‌లు పెరిగితే మెడికల్ టూరిజం వృద్ధి చెందుతుంది. తద్వారా రాష్ట్ర ఆదాయమూ పెరుగుతుంది. హెల్త్, వెల్త్ ఉన్న రాష్ట్రంగా ఏపీ సర్వతోముఖాభివృద్ధి చెందుతుంది. ఆరోగ్య, ఐశ్వర్యాంధ్ర ప్రదేశ్‌గా 2047 నాటికి ఏపీని నిలపాలన్న విజన్.. చంద్రబాబు ప్రయత్నాల్లో స్పష్టమౌతోంది అంటున్నారు పరిశీలకులు.

