YCP Target BC Minister: రాజకీయ కుట్రల్లో వైసీపీ నేత భూమన తగ్గేదేలే అంటున్నారు. టీడీపీ నేతలు సైతం ఆయన ట్రాప్‌లో పడుతున్నారా అన్న సందేహం కలుగుతోంది తాజా పరిణామాలను చూస్తుంటే. తాజాగా కూటమికి చెందిన ఓ బీసీ మంత్రిని టార్గెట్ చేసుకున్నారు భూమన కరుణాకర్ రెడ్డి. ఇటీవల ఓ మీడియా చానల్లో ఓ టీడీపీ నేత మంత్రిగా ఉన్న సొంత పార్టీ నేతపై ఆరోపణలు చేశాడు. ఆయన చేసిన ఆరోపణలు వైసీపీ స్క్రిప్టేనని ఎవరికైనా అర్థమౌతుంది. ఇక ఆ టీడీపీ నేత పదనిసలకు పల్లవి అందుకున్న భూమన మీడియా ముందుకొచ్చి ఆ బీసీ మంత్రిపై ఇష్టానుసారం మాట్లాడేశారు. అప్పుడే అర్థమైంది ఈ ఆరోపణల వెనుక వైసీపీ హస్తం ఉందని. కథ, స్కీన్ ప్లే, డైరెక్షన్ అంతా భూమన కరుణాకర్ రెడ్డే నడిపిస్తున్నారని. మంత్రిపై ఆరోపణలు చేసిన ఆ టీడీపీ నేత భూమన ట్రాప్‌లో ఎందుకు పడ్డారో తేల్చే పనిలో ఉంది ఇప్పుడు తెలుగుదేశం పార్టీ.
ఆ బీసీ మంత్రిని వైసీపీ నేతలు టార్గెట్ చేయడం వెనుక రీజన్ వెరీ సింపుల్. ఆ మంత్రి రాకతో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వైసీపీ ఖాళీ అయింది. దీంతో పార్టీని కాపాడుకునేందుకు మంత్రిపై బురదజల్లే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఒక మీడియా చానల్లో టీడీపీ అనలిస్టు చేసిన చిన్న కామెంట్‌ని పట్టుకుని… మంత్రిపై రాసలీలల ఆరోపణల్ని గుప్పిస్తున్నారు ఉమ్మడి చిత్తూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డి. 2019లో రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ గాలి వీచినప్పుడు కూడా ఆ టీడీపీ బీసీ నేత గెలిచారు. అదీ ఆయనకున్న ప్రజాధరణకు నిదర్శనం. అందరితో కలివిడిగా ఉంటూ మంత్రి హోదాను మరిచి కార్యకర్తల శ్రేయోభిలాషిగా ఉంటారన్న పేరుంది. ఆయన రాకతో తిరుపతిలోని దాదాపు 25 మంది కార్పొరేటర్లు వైసీపీకి రాం రాం పలికి.. కూటమిలో చేరిన పరిస్థితి.
Also Read: Jd vance: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నిలిపేందుకు భారత్‌పై భారీ సుంకాలు
అటువంటి నేతని టార్గెట్ చేయడం వెనుక భూమన మైండ్ గేమ్ ఈజీగానే అర్థమౌతోంది. వైసీపీ హయాంలో టీటీడీ చైర్మన్‌గా పనిచేసిన భూమనపై లెక్కలేనన్ని ఆరోపణలున్నాయి. ప్రస్తుతం టీటీడీ ఇష్యూ రాష్ట్రంలో హాట్ టాపిక్‌గా నడుస్తోంది. ఈ నేపథ్యంలో తనపై ఉన్న అవినీతి, అక్రమాల ఆరోపణల్ని సైడ్ ట్రాక్ పట్టిస్తూ భూమన డైవర్షన్ పాలిటిక్స్‌కి తెరతీశాడని టీడీపీ ఆరోపిస్తోంది. మొన్నటి వరకూ టీటీడీ చైర్మన్‌ని టార్గెట్ చేసిన భూమన, ఇప్పుడు బీసీ మంత్రిని టార్గెట్ చేసుకున్నారు. ఆడియోలు కానీ, వీడియోలు కానీ, ఎలాంటి సాక్షాధారాలు కానీ లేని ఆరోపణలపై సాక్షాత్తూ తన కళ్లతో చూసినట్లు కామెంట్ చేస్తున్నారు. ఇటువంటి పొలిటికల్ హైడ్రామాలు పండించడంలో తాను ఎంతగా ఆరితేరిపోయారో మరోసారి గుర్తు చేస్తున్నారు భూమన.
మొన్నటి వరకూ వైసీపీ నేతల రాసలీలలు ఆడియో, వీడియో ఆధారాలతో సహా దొరికిపోయినా అప్పట్లో జగన్ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇప్పుడు టీడీపీ నేతలపై అదే బురదజల్లాలని చూస్తే ప్రజలు నమ్ముతారా? అని కూడా భూమన ఆలోచించడం లేదు. తిరుపతిలో చాలా మంది మహిళా కార్పొరేటర్లు కూడా వైసీపీ వీడి టీడీపీ, జనసేన గూటికి చేరిన పరిస్థితి ఉంది. వారందరు కూడా మున్సిపల్ కార్పొరేషన్‌కు సంబంధించిన సమస్యలపై సదరు మంత్రితో తరచూ మాట్లాడుతూనే ఉంటారు. అలా సమస్యను చెప్పుకునేందుకు వచ్చిన మహిళల్ని ఉద్దేశించి భూమన ఇలా మాట్లాడటం ఏ మాత్రం సబబు కాదని పరిశీలకులు సైతం అభిప్రాయపడుతున్నారు. ఇది మహిళా నేతల గౌరవ మర్యాదలను కించపరచడమే అంటున్నారు. ఒక ఆడియో ఫ్రూఫ్ లేదు, వీడియో ఫ్రూఫ్ లేదు. ఏ మహిళా ముందుకొచ్చి ఫిర్యాదు చేసింది లేదు. కేవలం బురద జల్లే కార్యక్రమం మాత్రమే చేస్తున్నారు భూమన కరణాకర్ రెడ్డి. అయినా సొంత తల్లిని, చెల్లిని ట్రోల్ చేసినా, నీచంగా కామెంట్ చేసినా పట్టించుకోని జగన్ పార్టీలోని నేతలు.. రాష్ట్రంలో ఇతర మహిళల్ని గౌరవ మర్యాదలతో చూస్తారనుకోవడం అత్యాశే అనుకోవాలేమో.
