Karedu

Karedu: కరేడు ఉద్యమంలో ఎర్ర చందనం దొంగలు ఎంటరయ్యారా?

Karedu: కరేడులో ఇండోసోల్‌ పరిశ్రమ కోసం చేపడుతున్న భూసేకరణ ఎంతటి వివాదానికి దారి తీసిందో చూస్తూనే ఉన్నాం. ఈ వివాదంలో కరేడు రైతుల పక్షానే అందరూ నిలబడ్డారు. పచ్చని పొలాలతో కళకళలాడే కరేడు ఖాళీ అయిపోతోందంటూ, రైతులకు గిట్టుబాటు కాని ధరకు భూములు లాగేసుకుంటున్నారంటూ రకరకాల ప్రచారాలు జరుగుతూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అలర్ట్‌ అయ్యింది. జరుగుతున్న ప్రచారాలకు అడ్డుకట్ట వేస్తూ.. అనుమానాలను నివృత్తి చేస్తూ.. రైతులకు అండగా నిలబడింది. రైతుల భూములకు మార్కెట్ ధర కన్నా డబుల్‌ ప్రైజ్‌ పరిహారంగా చెల్లించేందుకు కూడా ఇండోసోల్‌ని ఒప్పించింది. అయినా కరేడులో అర్లర్లు ఆగడం లేదు. నిత్యం ఏదో ఒక అలజడి. రైతులు చేస్తున్న భూ ఉద్యమంలో జొరబడిన అసాంఘిక శక్తులే ఇందుకు కారణమా? మంచి ధరకు భూములు అమ్ముకునేందుకు ఒక వైపు రైతులు ముందుకొస్తున్నా… అడ్డుపడుతోంది ఎవరు? వారిని భయపెడుతోంది ఎవరు? రైతుల్ని రెచ్చగొడుతోంది ఎవరు? ఏ ప్రయోజనం ఆశించి ఇదంతా చేస్తున్నారు?

అజిత్‌ రెడ్డి అండ్‌ కో. ఈ సమూహంలోని వ్యక్తే వినోద్‌ రెడ్డి. ఇటీవల రెడ్‌ శాండర్‌ స్మగ్లింగ్‌ చేస్తూ పట్టుపడ్డాడు ఈ వినోద్‌ రెడ్డి. ఇతనిది కరేడు గ్రామమే. అజిత్‌ రెడ్డికి అంగరక్షకుడిగా ఉంటూ కరేడు ఉద్యమంలో యాక్టివ్‌గా కనిపిస్తున్నాడీ వినోద్‌ రెడ్డి. నిజానికి వినోద్‌ రెడ్డికి ఎర్రచందనం స్మగ్లింగ్‌ చేసేంత సీన్‌ లేదని, అతని వెనుక ఎవరో ఉండి రెడ్‌ శాండల్‌ స్మగ్లింగ్‌ కార్యకలాపాలకు అతన్ని వాడుకుంటున్నారని కరేడు గ్రామాల్లో ప్రచారం నడుస్తోంది. ఆ వ్యక్తి మరెవరో కాదు… కరేడు రైతు భూ ఉద్యమాన్ని అంతా తన భుజాలపైనే నడిపిస్తున్నట్లుగా ఓవర్‌ యాక్టింగ్‌ చేస్తున్ననల్లపురెడ్డి అజిత్‌ రెడ్డే అన్నది అంతా గుసగుసలాడుకుంటున్న సంగతి. అంటే తెర ముందు రైతుల్ని రెచ్చగొడుతూ, తెరవెనుక చేస్తున్నది స్మగ్లింగా అన్న చర్చ నడుస్తోంది. కొమ్మిలోని అగ్రిగోల్డ్‌ ల్యాండ్స్‌లోనూ, దాని సమీపంలో ఉండే రిజర్వ్‌ ఫారెస్ట్‌లోనూ విలువైన రెడ్‌ శాండల్‌ చెట్లపై కన్నేశారని ప్రచారం జరుగుతోంది. గతంలో ఓ వైసీపీ నేతకి ప్రధాన అనుచరుడిగా ఉన్న అజిత్‌ రెడ్డి, వైసీపీ హయాంలో కరేడు పంచాయతీలో అంతా తానై చక్రం తిప్పారు. నేడు పలుకుబడి కోసం నెల్లూరు టీడీపీ నేతలతోనూ సంబంధాలు పెట్టుకున్నారట.

Also Read: Donald Trump: భారత్-రష్యా సంబంధాలపై ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు: ఆర్థిక యుద్ధ వాతావరణం!

ఈ రెడ్‌ శాండల్‌ స్మగ్లింగ్‌లో వినోద్‌ రెడ్డి కేవలం పాత్రధారే అన్న బలంగా అనుమానాలున్నాయి. మరి వినోద్‌ కుమార్‌ రెడ్డి వెనక ఉండి వ్యవహారం నడిపింది ఎవరు? ఇదే ఇప్పుడు కరేడు గ్రామాల్లో హాట్‌ టాపిక్‌. వినోద్‌ రెడ్డిపై గతంలోనూ బియ్యం స్మగ్లింగ్‌తో పాటూ అనేక కేసులున్నాయి. తాజాగా ఎర్రచందనం స్మగ్లింగ్‌ కేసు. ఇలా స్మగ్లింగ్‌ కార్యకలాపాలు చేసుకునే వారికి కరేడు ఉద్యమంలో ఏమిటి పని? ఇలాంటి వారి జోక్యం వల్ల కరేడు రైతులకు న్యాయం జరుగుతుందా? కరేడు ఉద్యమం నుండి అజిత్‌ రెడ్డి, వినోద్‌ రెడ్డిలు ఆశిస్తున్నది ఏమిటి? తమ వెనుక కరేడు రైతులున్నారని చూపిస్తూ ఎవర్ని బెదిరిస్తున్నట్లు? అజిత్‌ రెడ్డి ఆరాటం కరేడు రైతుల కోసమా? లేక స్మగ్లింగ్‌ కేసులో తన పేరు బయటకు రాకుండా చూసుకునే ప్రయత్నమా? ఏది ఏమైనా ఉద్యమంలోకి అసాంఘిక శక్తులు చొరబడకుండా కరేడు రైతులు జాగ్రత్త పడాల్సి ఉందంటున్నారు పరిశీలకులు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *