YCP Silly Games: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తన ప్రత్యేకమైన ప్రచార శైలితో మరోసారి వార్తల్లో నిలిచింది. 2024 ఎన్నికల సమయంలోనూ, ఆ తర్వాత కూడా వీధి నాటకాలు, హైడ్రామాలతో ప్రజలను ఆకర్షించే ప్రయత్నం చేసిన వైసీపీ, ఈ వ్యూహాలతో ఎంతమేరకు సఫలమవుతోందన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఈ నాటకాలు పార్టీకి ఊహించని విధంగా కౌంటర్లుగా మారుతున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
2024 ఎన్నికల సమయంలోనే వైసీపీ ప్రచారం చాలా విచిత్రంగా సాగింది. చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్, నారా లోకేష్ బొమ్మలను తయారు చేయించి, వాటిని వైకాపా కార్యకర్తలతో కొట్టించే కార్యక్రమాలు చేపట్టారు. ఇలాంటి జిమ్మిక్కులు ప్రజలను ఆకర్షించినా, ఫలితం ఓట్ల రూపంలో రాలేదు. అలా ఎన్నికలల్లో వైసీపీ ఘోర పరాజయం చవిచూసినా, ఆ పార్టీలో ఎలాంటి మార్పు కనిపించడం లేదు. ఇటీవల ఏప్రిల్ 1న చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్‌ల ఏఐ ఫొటోలతో.. డైపర్, స్కామ్ కిట్టు, రిమోటు అంటూ ఓ వెకిలి పోస్టు పెట్టారు. ఆ పోస్టు చూసి విశ్లేషకులు సైతం అవాక్కయ్యారు. అసలు వైసీపీ అఫీషియల్ ఎక్స్ ఖాతాను ఆ పార్టీ విభాగమే నడుపుతోందా? లేక ఎవడు పడితే వాడు వైసీపీ ఎక్స్ హ్యాండిల్‌ని నడుపుతుంటారా? అన్న సందేహాలు కలిగాయి. ఐదేళ్లు ప్రతిపక్షంలో, ఐదేళ్లు అధికారంలో ఉన్న పార్టీ అఫీషియల్ ఖాతా నుండి ఇలాంటి సిల్లీ పోస్టులు ఎవ్వరూ ఊహించరు. కానీ అదే వైసీపీ ప్రత్యేకత.
YCP Silly Games: తాజాగా, తిరుపతిలో వైసీపీ యువనేత భూమన అభినయ్ రెడ్డి నేతృత్వంలో వీధి నాటకం ఒకటి ప్రదర్శించారు. పెరిగిన విద్యుత్ చార్జీలకు నిరసనగా ఈ ప్రదర్శన చేపట్టారు. చంద్రబాబు, పవన్, లోకేష్ పాత్రలతో జూనియర్ ఆర్టిస్టులను రంగంలోకి దించి, ఫేస్ మాస్క్‌లు పెట్టి డ్రామా చేయించారు. “విద్యుత్ దోపిడీకి గుణపాఠం” అంటూ ఈ వీధి నాటకానికి టైటిల్ కూడా పెట్టారు. చివర్లో 2029లో వైసీపీ గెలిచి, జగన్ మళ్లీ సీఎం అవుతారని ప్రకటించడం విశేషం. సోషల్ మీడియాలో ఈ నాటకానికి విపరీత ప్రచారం కల్పించినా, దీనివల్ల పార్టీకి ఎంత ప్రయోజనం కలుగుతుందన్నది సందేహాస్పదంగా మారింది. గతంలోనూ వైసీపీ నేతలు ఇలాంటి వింత డ్రామాలాడిన సందర్భాలున్నాయి. ఉదాహరణకు, ఉచిత బస్సు సౌకర్యం కోసం ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించి ఎన్ని డ్రామాలు చేయాలో అన్నీ చేశారు. అలా జనాలను ఎంటర్‌టైన్ చేయగలిగారు కానీ.. రాజకీయ మైలేజ్ మాత్రం పొందలేక పోయింది వైసీపీ.
Also Read: Pawan Kalyan: గిరిజన గూడేలకు రియల్ భీమ్లా నాయక్
YCP Silly Games: వైసీపీ సెటైరికల్ పాలిటిక్స్, ఆ పార్టీ క్యాడర్‌కి బాగానే ఉంటుంది కానీ, ప్రజల్లో ఆ పార్టీ పట్ల సీరియస్‌నెస్‌ని కోల్పోయేలా చేస్తుందని అనలిస్టులు విశ్లేషిస్తున్నారు. 2024లో సిద్ధం సభల్లో జనం జగన్‌ను కలవాలని ఆరాటపడటం, బస్సు ఆపి డ్రామా చేయడం వంటి రోడ్ షోలను ప్రజలు నమ్మలేదు. ఎన్నికల్లో 11 సీట్లకే పరిమితమైన వైసీపీ, ఇప్పటికీ అదే తరహా వ్యూహాలపై ఆధారపడటం ఆశ్చర్యకరమే. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది కూడా పూర్తి కాకముందే ఇలాంటి హైడ్రామాలు చేయడం ద్వారా ప్రజల మద్దతు కోల్పోయే ప్రమాదం ఉందంటున్నారు అనలిస్టులు. ఇవన్నీ చూస్తుంటే వైసీపీ.. ఇక మారే అవకాశాలు లేవని, పద్దతి మార్చుకునే ప్రసక్తే లేదని ప్రజలు చర్చించుకుంటున్నారు.
