Gorantla Madhav

Gorantla Madhav: మరో 2 వారాలు జైల్లో పడేయండి: కోర్టు

Gorantla Madhav: రాజకీయాల్లో కూడా కొందరు హాస్య నటులు కనిపిస్తూ ఉంటారు. వారి మాటలకు, చేష్టలకు జనాల్లో పిచ్చ క్రేజ్‌ ఉంటుంది. ఉదాహరణకు తెలంగాణలో మల్లారెడ్డి, ఏపీలో ఆనం లాంటి వారు. అయితే అది.. వారు ఫేమ్‌ కోసమో, ఫేమస్‌ అవడానికో, చెప్పాలనుకున్న సబ్జెక్ట్‌ను సమర్థవంతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకో ఎంచుకునే శైలి మాత్రమే. పాలిటిక్స్ మాత్రం వెరీ సీరియస్‌గా చేస్తుంటారు. కానీ కొందరు రాజకీయ నేతలు చాలా సీరియస్‌గా పాలిటిక్స్‌ చేయాలనుకుంటారు కానీ.. ప్రతి సందర్భంలోనూ ప్రజల్లో ఫూల్సే అవుతుంటారు. వారి ఓవర్‌ యాక్షన్‌ కారణంగానో, మానసిక స్థితి సరిగా లేకనో, ట్రోలింగ్‌ కంటెంట్‌గా మారుతుంటారు. అలాంటి పొలిటీషియనే ఏపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌.

ఈ స్టోరీలో గోరంట్ల మాధవ్‌ కామెడీ ఎపిసోడ్‌.. ఎస్పీ ఆఫీస్‌ నుంచి జైలు వరకు సాగింది. గోరంట్ల అరెస్ట్‌ ఎపిసోడ్‌కి ముందు ఆయన నేరుగా గుంటూరు ఎస్పీ ఆఫీస్‌కి వెళ్లాడు. అక్కడ ఈయన సర్కస్‌ ఫీట్లు చూసి.. ‘గోరంట్లా.. రా కూర్చుని మాట్లాడుకుందాం’ అని పోలీసులు చాలా మర్యాదగా ఆఫర్‌ చేశారు. ఆ మర్యాద చూసి మరింత రెచ్చిపోయిన గోరంట్ల… ‘మీ ఎస్పీనే ఇక్కడికి రమ్మని చెప్పు’ అంటూ రివర్స్‌లో ఆఫర్‌ ఇచ్చేసరికి.. పోలీసులు అరెస్ట్‌ చేయాల్సి వచ్చింది. అంతకు ముందు మాజీ సీఎం జగన్ సతీమణిపై అసభ్యకర వ్యాఖ్యలు చేసి అరెస్ట్‌ అయిన చేబ్రోలు కిరణ్‌ని పోలీసులు అరెస్ట్‌ చేసి తమ వాహనంలో తరలిస్తుండగా.. సింగం సినిమాలో సూర్య లాగా.. మాజీ పోలీసు ఆఫీసర్‌ అయిన మన గోరంట్ల.. తన వెహికల్‌తో వెంబడించి, ఛేజ్‌ చేసి, పోలీసు వాహనానికి తన వాహనాన్ని అడ్డు పెట్టి హైవే మీద నానా హంగామా క్రియేట్‌ చేశాడు. అక్కడి నుండి పోలీసులు నచ్చజెప్పి పంపిస్తే.. మళ్లీ ఎస్పీ ఆఫీసుకు వచ్చి గొడవ పెట్టుకున్నాడు. ఇదీ క్లుప్తంగా జరిగిన స్టోరీ.

ఇక తాజా ఎపిసోడ్‌లో గోరంట్ల చేసిన క్యామెడీ ఏంటో తెలుసా… పోలీసు కస్టడీలో అధికారులు అడిగిన సమాధానాలకు తలతిక్కగా సమాధానం చెప్తూ.. వెకిలి నవ్వులు నవ్వడం. అసలు గుంటూరు ఎస్పీ ఆఫీసుకు ఎందుకొచ్చావ్‌ అంటే… ఫిర్యాదు చేయడానికి వచ్చాడట. మరి పోలీసు వాహనాన్ని ఎందుకు వెంబడించావ్‌ అంటే.. తాను, తన అనుచరులతో కలిసి సరదాగా లాంగ్‌ డ్రైవ్‌కి వెళ్తుంటే.. పోలీసు వాహనం అడ్డొచ్చిందంటూ చెప్పుకొచ్చారట. మరి పోలీసు వాహనంలో అటు ఇటు ఉన్న పోలీసుల సిబ్బంది మధ్యలో కూర్చున్న చేబ్రోలు కిరణ్‌ని అంత కరెక్ట్‌గా ఎలా గుర్తించావ్‌? ఈ వెహికలోనే కిరణ్‌ని తరలిస్తున్నట్లు నీకు ముందుగానే తెలుసా? అని ప్రశ్నించే సరికి… తన అనుచరులు వాహనంలో చేబ్రోలు కిరణ్‌ ఉన్న విషయాన్ని గుర్తించి, తనకు చెప్పారంటూ మరో జోక్‌ పేల్చారట గోరంట్ల మాధవ్‌. తిక్కరేగిన పోలీసులు.. ముందుగా ఒక్కటిచ్చి, ఆ తర్వాత వీడియో పుటేజీలన్నీ గోరంట్ల ముందు ఉంచినట్లు సమాచారం. పోలీస్‌ కాన్వాయ్‌ వెంటపడటం, కిరణ్‌ని కిందకి లాగి కొట్టడానికి ప్రయత్నించడం… అన్నీ రికార్డెడ్‌ అని గోరంట్లకు కూడా తెలుసు. కానీ గోరంట్ల కామెడీకీ అంతే ఉండదు.

ALSO READ  Fire Accident: బాలాన‌గ‌ర్ అగ్నిప్ర‌మాద ఘ‌ట‌న‌లో ట్విస్ట్‌

Also Read: Karregutta Kagar: మావోయిస్టు ‘విప్లవం’ సమాధి కానుందా?

Gorantla Madhav: ఇక మాధవ్‌తో సహా అతని వెంట వచ్చిన ఐదుగురు అనుచరులను కూడా పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. మాధవ్‌ అనుచరులు మరీ క్లాసిక్‌. “మా సార్‌ ఇంటి దగ్గర బండెక్కమన్నారు. ఎక్కాం. గుంటూరుకు తీసుకొచ్చారు. మాట్లాడకుండా బండిలోనే కూర్చున్నాం. హైవేపై పోలీసు వెహికల్‌ని ఫాలో చేయమన్నారు, మేం అలాగే చేశాం. చుట్టుగుంట జంక్షన్‌లో ట్రాఫిక్‌ జామ్‌ అవగానే మమ్మల్ని బండి దిగమన్నారు, సార్‌తో పాటే బండి దిగాం. కిరణ్‌ని బండి నుండి కిందకి లాగి కొట్టమన్నారు, సార్‌తో పాటే మేమూ తలో చెయ్యి వేశాం. పోలీసులు అడ్డుకోవడంతో ఆ యాక్షన్‌ సీన్‌ ఫ్లాప్ అయ్యింది‌! అంతే.. అంతకు మించి మాకేమీ తెలీదు.. మా గ్యాంగ్ లీడర్‌ గోరంట్ల సారే..” అంటూ అమాయకత్వంతో కూడిన ఆవేదన వెలిబుచ్చారు గోరంట్ల అనుచరులు.

విచారణలో మాధవ్‌ సహకరించకుండా.. కమెడియన్‌ వేషాలేస్తుండటంతో పోలీసులు మళ్లీ కస్టడీ కోరే ఆలోచనలో ఉన్నారట. ప్రస్తుతానికి కస్టడీ ముగియడంతో మాధవ్‌ అండ్‌ టీమ్‌ని గుంటూరు జీజీహెచ్‌లో మెడికల్‌ టెస్ట్‌ చేయించి, కోర్టులో ప్రెజెంట్‌ చేశారు. మేజిస్ట్రేట్‌ మే 7 వరకు రిమాండ్‌ ఆర్డర్‌ ఇచ్చారు. దీంతో మాధవ్‌ ఎపిసోడ్‌ మళ్లీ రాజమహేంద్రవరం జైలుకి చేరింది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *