YCP Dramalu: వక్ఫ్ సవరణ బిల్లు-2025 పార్లమెంట్లో ఆమోదం పొందడంతో దేశవ్యాప్తంగా చర్చలు ఊపందుకున్నాయి. ఈ బిల్లు త్వరలో రాష్ట్రపతి ఆమోదంతో చట్టంగా మారనుంది. ఈ నేపథ్యంలో వైసీపీ తన పొలిటికల్ గేమ్ మొదలుపెట్టింది. పార్లమెంట్లో బిల్లును వ్యతిరేకించిన వైసీపీ, తాము ముస్లిమ్ సమాజానికి అండగా నిలిచామని, టీడీపీ-జనసేనలు ఈ బిల్లుకు మద్దతిచ్చి ముస్లిమ్ ప్రయోజనాలను దెబ్బతీశాయని ప్రచారం చేస్తోంది. కానీ వైసీపీ ఈ బిల్లును వ్యతిరేకించడం వెనుక నిజాయితీ ఉందా లేక రాజకీయ డ్రామా ఉందా అనేది ప్రశ్న.
జగన్ ఆదేశాలతో వైసీపీ ఎంపీలు బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేశారు. ఇది మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయంగా కనిపించినా, దీని వెనుక ఉద్దేశ్యం మాత్రం స్పష్టం. గుంటూరు ఈస్ట్ వైసీపీ ఇన్ఛార్జ్ షేక్ నూరి ఫాతిమా ఆధ్వర్యంలో బ్రహ్మానంద స్టేడియం వద్ద నిరసనలు చేపట్టారు. కులమతాలకు అతీతంగా అందరూ కలిసి రావాలని కూడా పిలుపునిచ్చారు. కానీ ఈ నిరసనల్లో బిల్లు ప్రవేశపెట్టిన మోడీ ప్రభుత్వంపై తక్కువ విమర్శలు.. బిల్లుకు మద్దతిచ్చిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లపై ఎక్కువ విమర్శలు వినిపించాయి.
బిల్లును ప్రవేశపెట్టిన బీజేపీని పెద్దగా టచ్ చేయని వైసీపీ… మద్దతిచ్చిన టీడీపీ, జనసేనలపై మాత్రం విరుచుకుపడటం వైసీపీ డబుల్ గేమ్‌ను బయటపెడుతోంది అంటున్నారు అనలిస్టులు. వక్ఫ్ బిల్లు దేశవ్యాప్త సమస్య. దీనిని వ్యతిరేకిస్తే రాష్ట్రమంతా ధర్నాలు, దీక్షలు చేయాలి. కానీ వైసీపీ గుంటూరుకే పరిమితమైంది. ఎందుకంటే గుంటూరు ప్రాంతంలో ముస్లిమ్ జనాభా ఎక్కువ. అంటే, ఈ బిల్లును వ్యతిరేకించడం కంటే, ముస్లిమ్ ఓట్లను ఆకర్షించడమే వైసీపీ లక్ష్యంగా కనిపిస్తోంది. గతంలో సంక్షేమ పథకాలు, విశాఖ రాజధాని, మద్యపాన నిషేధం పేరుతో రాజకీయ లబ్ధి పొందినట్టే, ఇప్పుడు వక్ఫ్ బిల్లును ఉపయోగించుకుంటోంది వైఎస్ఆర్సీపీ పార్టీ. కానీ ఈ డ్రామాల్లో నిజాయితీ, నిబద్ధత లేవని విమర్శలు వస్తున్నాయి.
Also Read: Pawan Kalyan: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పవన్!
YCP Dramalu: ఇన్నాళ్లూ బీజేపీని పార్లమెంట్లో ఏ సందర్భంలోనూ వ్యతిరేకించని వైసీపీ, వక్ఫ్ బిల్లు విషయంలో మాత్రం విప్ జారీ చేసి వ్యతిరేకించింది. కానీ ఈ వ్యతిరేకతలోనూ ఒక తిరకాసు కనిపిస్తోంది. టీడీపీ, జనసేనలను టార్గెట్ చేస్తూ ముస్లిమ్ సానుభూతి పొందాలని చూస్తున్న వైసీపీ…. బీజేపీని మాత్రం విమర్శించే సాహసం చేయడం లేదు. దీంతో ముస్లిమ్ సమాజంలోనూ వైసీపీపై అనుమానాలు మొదలయ్యాయి.
జగన్ బీజేపీని ధైర్యంగా ఎదిరించాలని మైనార్టీలు ఎదురుచూస్తున్నా, ఆయన తన కేసులు, ఆస్తుల కోసం బీజేపీతో తెరవెనుక రాజీపడుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఫలితంగా, వైసీపీ నిరసనలకు మైనార్టీల నుంచి స్పందన రావడం లేదు. ఈ డ్రామాలు వైసీపీకి ఎంతవరకు లబ్ధి చేకూరుస్తాయో చూడాలి. కానీ వైసీపీ పాలిటిక్స్‌లో వరస్ట్నెస్ మాత్రం స్పష్టంగా కనిపిస్తోందంటున్నారు పొలిటికల్ అనలిస్టులు.

