VSR Social Media Damal

VSR Social Media Damal: ఫ్యాన్స్‌ లేరు, ఫాలోవర్లు లేరు, మునుపటి ఊపూ లేదు..!!

VSR Social Media Damal: ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్‌సీపీ అధికారంలో ఉన్న సమయంలో విజయసాయిరెడ్డి పార్టీలో రెండో స్థానంలో ఉండేవారు. రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన ఆయన, వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి దగ్గర అత్యంత సన్నిహితుడిగా ఉండేవారు. ఆయన మాటలు, నిర్ణయాలు జగన్‌కు బాగా కలిసొచ్చేవి. వైసిపి అనుకూల మీడియా ఆయన్ను నిత్యం కీర్తిస్తూ, ఆకాశానికి ఎత్తేసేది. విజయసాయిరెడ్డి ఒక్క ట్వీట్ వేస్తే, అది ఆంధ్ర రాజకీయాల్లో సునామీలా మారేది. ఆయన ట్వీట్లు కొన్నిసార్లు వార్తలుగా మారి, ప్రత్యర్థి పార్టీల నాయకులకు చుక్కలు చూపించేవి. ఆయన సోషల్ మీడియా పోస్టులు అగ్గిపుల్లల్లా కస్సుబుస్సుమని మండేవి. వ్యంగ్యం, విమర్శలు, పరిహాసంతో ప్రత్యర్థులను గడగడలాడించేవి. కానీ, రాజకీయాలు ఎప్పుడూ ఒకేలా ఉండవు. కాలం గిర్రున తిరిగింది. వైసిపి అధికారం కోల్పోయింది, విజయసాయిరెడ్డి ప్రాభవం కూడా క్షీణించడం మొదలైంది. జగన్‌ రెడ్డికి కూడా ఆయనతో దూరం పెరిగింది. రాజకీయంగా ఒంటరిగా మారిన విజయసాయిరెడ్డి, చివరకు రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. అంతేకాదు, వైసిపి ప్రాథమిక సభ్యత్వం నుంచి కూడా తప్పుకున్నారు. ఒకప్పుడు రాజకీయ రంగంలో రాజ్యమేలిన ఆయన, ఇప్పుడు పూర్తిగా రాజకీయాల నుంచి వైదొలిగారు.

Also Read: KTR: కాంగ్రెస్ సర్కార్‌పై కేటీఆర్ సీరియస్.. మేము ఉంటే ఇంత వరకు వచ్చేది కాదు

గతంలో ఆయన సోషల్ మీడియా ఖాతా వైసిపి మద్దతుదారులతో సందడిగా ఉండేది. ప్రత్యర్థులపై ఆయన చేసే విమర్శలు, వ్యంగ్యాస్త్రాలు ఆన్‌లైన్‌లో తుఫానులా మారేవి. కానీ ఇప్పుడు, రాజకీయాలకు వీడ్కోలు పలికిన ఆయన, సోషల్ మీడియాలోనూ నిశ్శబ్దంగా మారారు. ఒకప్పుడు సంచలనంగా ఉండే ఆయన పోస్టులు ఇప్పుడు రుచిలేని, రసహీనమైనవిగా మారాయి. ఫలితంగా, ఆయన సోషల్ మీడియా రీచ్ కూడా బాగా తగ్గిపోయింది. ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లో చెలరేగిన మద్యం కుంభకోణం విషయంలో విజయసాయిరెడ్డి పలుమార్లు దర్యాప్తు సంస్థల ముందు వాంగ్మూలం ఇచ్చారు. ఈ క్రమంలో ఆయన బీజేపీలో చేరతారని, ఆయన కుమార్తెకు రాజ్యసభ సీటు దక్కుతుందని పుకార్లు షికారు చేశాయి. అయితే, చంద్రబాబు రాజకీయ వ్యూహం మార్చి, జగన్ ఆస్తుల విషయంలో అప్రూవర్‌గా మారితేనే ఇవన్నీ సాధ్యమని షరతు విధించినట్లు గుసగుసలు వినిపించాయి. ఈ పరిణామాలతో విజయసాయిరెడ్డి ఆలోచనలో పడ్డారు. ఒకానొక సమయంలో వ్యవసాయం చేస్తానని ట్వీట్ కూడా చేశారు. కానీ, ప్రస్తుతం ఆయన ఏం చేస్తున్నారు, ఎక్కడున్నారు అనే దానిపై స్పష్టత లేదు.

ఒకప్పుడు ఆయన ట్వీట్లు ప్రత్యర్థులపైకి ఎక్కుపెట్టిన మిస్సైల్స్‌లా ఉండేవి. ఇప్పుడు మాత్రం అవి గాలిలో గల్లంతైన బాణాసంచాల్లా మారాయి. ఒకప్పటి హవా నుంచి ఈ రోజు నిశ్శబ్దత వరకూ.. సాయిరెడ్డి రాజకీయ పతనం… అధికారం శాశ్వతం కాదని మరోసారి నిరూపించింది.

ALSO READ  Supreme Court: సంజయ్‌కు 49 పేజీలతో ముందస్తు బెయిల్‌ తీర్పా? సుప్రీంకోర్టు షాక్

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *