Vallabhaneni Vamsi: గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి జైలే జాలీ ట్రిప్‌గా మారింది! ఒకప్పుడు టీడీపీలో స్టార్ పొలిటీషియన్‌గా వెలుగొంది, 2019 ఎన్నికల తర్వాత వైసీపీ జెండా పట్టి… జగన్ అజెండా మోస్తూ… చంద్రబాబు కుటుంబంపై విషం చిమ్మిన వంశీ.. ఇప్పుడు కూటమి సర్కార్ రిటర్న్ గిఫ్ట్‌తో ఊచలు లెక్కపెడుతున్నారు. అధికారం పోయినా, చేసిన అరాచకాల కారణంగా కేసులు ముసురుకున్నా వంశీ బిందాస్‌గానే ఉన్నారు. కానీ గన్నవరం టీడీపీ కార్యాలయ కంప్యూటర్ ఆపరేటర్ సత్యవర్థన్ కిడ్నాప్ కేసుతో అరెస్ట్ షాక్ తప్పలేదు. అక్కడి నుంచి పీటీ వారంట్, వరస కేసులతో రెండు నెలలుగా విజయవాడ జైలులో రిమాండ్ ఖైదీగా క్యాలెండర్‌లో రోజులు లెక్కబెడుతున్నారు.
బెయిల్ రాగానే బయటకొస్తాడనుకుంటే, మరో కేసు కొత్త గొలుసులు వేస్తోంది. భూ కబ్జా కేసులో బెయిల్ వచ్చినా, కిడ్నాప్, ఎస్సీ-ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో కోర్టు… “సారీ, ఇంకొన్నాళ్లు లోపలే” అంటోంది. వంశీ పరిస్థితి తలచుకుని ఆయన అనుచరులు పూర్తిగా ఢీలా పడిపోతోంటే… టీడీపీ సోషల్ మీడియా సైన్యాలు విసురుతోన్న చురకత్తుల్లాంటి సెటైర్లు వారిని మరింత ఇబ్బంది పెడుతున్నాయట. వంశీ రిలీజ్ డేట్‌పై.. ఓ స్త్రీ రేపు రా తరహాలో… రేపే విడుదల.. అని గోడలపై రాసుకోవాలంటూ.. సెటైర్లు విసురుతోంది టీడీపీ సోషల్‌మీడియా. ఒకప్పుడు ఇది నా రాజ్యం, నన్నెవడ్రా ఆపేదని విర్రవీగిన వంశీకి, ఇప్పుడు జైలు కిటికీలోంచి ఆకాశం వైపు ధీనంగా చూస్తూ.. కాలం వెళ్లదీయాల్సిన పరిస్థితి.
Vallabhaneni Vamsi: అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు ఫ్యామిలీపై విమర్శలతో వీరంగం చేసిన వంశీ వీడియోలను రీప్లే చేస్తూ… ఏం పంచ్‌లు రా బాబు, ఇప్పుడేమయ్యాయంటూ ట్రోల్ చేస్తున్నారు సోషల్‌మీడియాలో టీడీపీ ఫ్యాన్స్. వంశీ బయటకొస్తే తప్ప.. ఈ ట్రోలింగ్స్ ఆగేలా కనపడట్లేదు. అయితే.. అదేమంత ఈజీ కాదని, అల్టిమేట్‌గా టీడీపీ హైకమాండ్ దయ తలిస్తే తప్ప.. వంశీకి జైలు గడీలు తప్పవన్న టాక్ నడుస్తోంది. అయితే ఇక్కడ కోర్టు దయ పొందేందుకు వంశీకి ఒకే ఒక్క అవకాశం కనబడుతోంది. ఇటీవల ఆయన అనారోగ్యానికి సంబంధించి వార్తలొస్తున్న సంగతి తెలిసింది. దీంతో వంశీ మెడికల్ బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తే సక్సెస్ అయ్యే అవకాశం ఉందంటున్నారు అనలిస్టులు.
Also Read: YS Jagan: మూడేళ్లు కళ్లు మూసుకోవాలి.. అంతేగా
ఇదిలా ఉంటే, వైసీపీ హయాంలో చెలరేగిపోయిన నేతలంతా ఇప్పుడు కూటమి కెరటాల ధాటికి విలవిల్లాడుతున్నారు. పోసాని 26 రోజుల జైలు టూర్ ముగించగా, వంశీకి మాత్రం రిలీజ్ డేట్ దొరకడం లేదు. కాకాణి స్టిల్ మిస్సింగ్. మిథున్ రెడ్డి సుప్రీం కోర్టు దాకా వెళ్లి బెయిల్ తెచ్చుకోవాల్సిన పరిస్థితి. వల్లభనేని వంశీ స్టోరీలో ఒకటి మాత్రం క్లియర్.. నోటికి అడ్డూ అదుపు లేకుండా విసిరే మాటలు, బూతు డైలాగులు అధికారంలో ఉన్నప్పుడు బాగానే ఉంటాయి. కానీ అధికారం కోల్పోయాక.. తిరిగొచ్చే రిజల్ట్ తట్టుకోవడం కష్టం.