TDP Mahanadu: చంద్రబాబు లాంటి విజన్ ఉన్న నాయకుడు వరుసగా ఓ పదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా అధికారంలో కొనసాగితే… రాష్ట్రం బాగుపడుతుంది. 20, 30 ఏళ్లు రాష్ట్రం అభివృద్ధిలోనూ, అన్ని విధాలుగానూ ముందుకెళ్తుంది అన్నది మేధావుల అభిప్రాయం. అందుకు ఉదాహరణ చంద్రబాబు సాధించిన ‘విజన్-2020’ ఘనత. 1995 నుండి 2004 వరకు వరుసగా తొమ్మిదేళ్ల పాటు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ సమయంలో అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్, యునైటెడ్ కింగ్‌డమ్ ప్రధానమంత్రి టోనీ బ్లెయిర్‌లు హైదరాబాదు వచ్చి ముఖ్యమంత్రిగా ఉన్న నాయుడును కలిసారు. కేవలం ఐదు సంవత్సరాలలో, అతను గ్రామీణ వెనుకబడినతనం, పేదరికం ఉన్న ప్రాంతాన్ని, భారత దేశ కొత్త సమాచార-సాంకేతిక కేంద్రంగా మార్చాడంటూ “టైమ్”కు చెందిన అమెరికన్ మ్యాగజైన్‌లు రాశాయి.
“సౌత్ ఆసియన్ ఆఫ్ ద యియర్”గా అభివర్ణించాయి. ఈ ఘనత దేశంలో మరే ముఖ్యమంత్రికి సాధ్యం కాలేదని పరిశీలకులు చెబుతుంటారు. చంద్రబాబు సామర్థ్యం తెలుగు రాష్ట్రాల్లోని వారికన్నా.. ఉత్తరాధి రాష్ట్రాల వారికి బాగా తెలుసంటారు. ఉత్తరాధి వారు చంద్రబాబును విజనరీ లీడర్‌గా, మ్యాన్ ఆఫ్ టెక్నాలజీస్‌గా పిలుచుకుంటూ ఉంటారు. అలాంటి సీఎంని ఇతర రాష్ట్రాలలో అయితే వదులుకోరు. కానీ ఏపీకి ఉన్న కొన్ని ప్రత్యేకతల కారణంగా, చంద్రబాబు గెలుపు-ఓటములు ఒకదాని తర్వాత ఒకటి ఎదుర్కొంటూ వస్తున్నారు. ఒకవైపు అమరావతి, పోలవరం లాంటి ప్రతిష్టాత్మకమైన, ఏపీ భవిష్యత్ ముఖచిత్రాన్ని సమూలంగా మార్చే ప్రాజెక్టులు పూర్తి చేయాల్సి ఉంది. దీనికి తోడు బనకచర్లకు గోదావరి జలాలు తీసుకురావాలన్న సంకల్పాన్ని చంద్రబాబు తీసుకున్నారు. పీ4తో పేదరికం లేకుండా చేయాలని సంకల్పించారు. విజన్ 2047కి పిలుపునిచ్చారు.
Also Read: Jagan Arrest Saval: విజయవాడ కాదు.. బెంగళూరులోనే అరెస్ట్ అవుతారట!
TDP Mahanadu: ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం కనీసం పదేళ్లు అయినా కొనసాగాలని చదువుకున్న వారు, మేధావులైన పరిశీలకుల్లో ఆంకాక్ష ఉన్న మాట నిజం. అయితే దీన్ని ప్రజలందరికీ అర్థమయ్యేలా, చదువురాని వారికి, సామాన్యులకు సైతం చేరవేయడం ముఖ్యం. అది చేసేందుకే.. టీడీపీ మహానాడును వేదికగా చేసుకుంటోంది. రాష్ట్రంలో ఒకే ప్రభుత్వం నిరంతరాయంగా అధికారంలో కొనసాగడం వల్ల రాష్ట్రంలో జరిగే అభివృద్ధి, ప్రజలకు కలిగే ప్రయోజనాలను మహానాడు వేదికగా నేతలు ప్రజలకు వివరించనున్నారు. గుజరాత్‌లో గత మూడు దశాబ్దాలుగా బీజేపీ అధికారంలో ఉండటం వల్ల ఆ రాష్ట్రంలో సుస్థిర అభివృద్ధి సాధ్యమైంది. గుజరాత్ రాష్ట్రంలో బీజేపీ వరుసగా 7 సార్లు విజయం సాధించింది. దీంతో గుజరాత్ మనదేశంలో అత్యంత ప్రగతిశీల, అభివృద్ధి చెందిన రాష్ట్రాల్లో ఒకటిగా ఉంది. సరైన సమయంలో సరైన నాయకత్వంతో పాటు ప్రభుత్వ కొనసాగింపు వల్లే ఇది సాధ్యమైంది. అదేవిధంగా ఒడిశాలో బిజూ జనతాదళ్ ఐదు సార్లు వరుసగా విజయం సాధించింది. ఒడిశా ముఖ్యమంత్రిగా నవీన్ పట్నాయక్ 24 ఏళ్లు పదవి కాలంలో ఒడిశా రాష్ట్రం అనేక రంగాల్లో విప్లవాత్మకమైన వృద్ధిని సాధించింది. మన రాష్ట్రంలోనూ ప్రభుత్వ కొనసాగింపు వల్ల స్వర్ణాంధ్ర కల సాకరానికి మార్గం సుగమం అవుతుందని నేతలు వివరించనున్నారు.

