Tamil Janasena

Tamil Janasena: పవన్‌ హామీ: ఏపీ, మహారాష్ట్ర రిజల్ట్స్‌.. తమిళనాడులో రిపీట్‌!

Tamil Janasena: జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రస్థానం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. 2014లో స్థాపించిన జనసేన, 2024 ఎన్నికల్లో తెలుగుదేశం, బీజేపీతో కూటమిగా పోటీ చేసి, పోటీ చేసిన 21 అసెంబ్లీ, రెండు లోక్‌సభ స్థానాల్లో 100% స్ట్రయిక్‌ రేట్‌తో విజయం సాధించింది. ఈ విజయంతో ఏపీలో డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన పవన్, ఇప్పుడు రాజకీయ విస్తరణపై దృష్టి సారించారు. తాజాగా తమిళనాడులో జనసేన పార్టీ స్థాపనకు సంబంధించి ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఇటీవల పవన్, తమిళనాడుకు చెందిన పలువురు రాజకీయ నాయకులు, ప్రముఖులతో సుదీర్ఘ చర్చలు జరిపారు. 2026లో జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో, తమిళ నేతలు తమిళనాట జనసేనను స్థాపించాలని కోరినట్లు తెలుస్తోంది. అయితే, పవన్ ఈ ప్రతిపాదనను సున్నితంగా తిరస్కరించారట. ప్రస్తుతం తన పూర్తి దృష్టి ఆంధ్రప్రదేశ్‌పైనే ఉందని, గత ప్రభుత్వం ప్రజలను గాలికొదిలేసిందనీ, రోడ్లు, మౌలిక వసతులు లేక ప్రజలు ఇబ్బందులు పడ్డారనీ పవన్ వారితో ప్రస్తావించి, వారి ప్రతిపాదనను సున్నితంగా తిరస్కరించారట.

అయినప్పటికీ, 2026 తమిళనాడు ఎన్నికల్లో పవన్ కీలక పాత్ర పోషించనున్నారనే అంచనాలు బలంగా ఉన్నాయి. బీజేపీ-ఏఐఏడీఎంకే కూటమికి మద్దతుగా పవన్ ప్రచారం చేస్తే, ఎన్డీఏ గెలుపుకు గణనీయంగా తోడ్పడుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. దీనికి పవన్‌కు ఉన్న స్టార్ ఇమేజ్ ఒక కారణం. తమిళ సినిమా అభిమానుల్లో పవన్‌కు గణనీయమైన ఫాలోయింగ్ ఉంది. ఇది యువ ఓటర్లను ఆకర్షిస్తోంది. పవన్‌ విజయవంతమైన ట్రాక్ రికార్డ్‌ మరింత పాజిటివ్ వైబ్స్‌ని క్రియేట్‌ చేస్తోంది. ఏపీ, మహారాష్ట్రలో ఎన్డీఏ విజయాల్లో పవన్ ప్రచారం కీలక పాత్ర పోషించింది.

Also Read: bhatti vikramarka: ఆదాయం లేకున్న అప్పులకు వడ్డీలు కడుతున్నం

Tamil Janasena: కూటమి ప్రభుత్వాల ద్వారా అభివృద్ధి, జవాబుదారీతనం పెరుగుతుందన్న పవన్ నమ్మకం ఓటర్లను ప్రభావితం చేసే అవకాశం ఉంది. తమిళనాడులో సామాజిక సమస్యలపై పవన్‌కు విస్తృతమైన అవగాహన ఉంది. మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌లలో ప్రజలు కూటమి పార్టీలకు పట్టం కట్టడం వల్లే… అభివృద్ధి సాధ్యమౌతోందని.. పవన్‌ తరచూ వ్యాఖ్యానిస్తున్నారు. అంటే మోడీ చెప్తున్న డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌కు పవన్‌ అనధికార బ్రాండ్‌ అంబాసిడర్‌గా మారారు. తమిళనాడులో జనసేన స్థాపనకు పవన్ సుముఖంగా లేనప్పటికీ, ఎన్డీఏ కూటమికి మద్దతుగా ప్రచారం నిర్వహిస్తే… ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేయగలరని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. పవన్ రాజకీయ వ్యూహం, స్టార్ ఇమేజ్, సామాజిక సమస్యలపై దృష్టి తమిళ ఓటర్లను ఆకర్షించే అవకాశాలు ఉన్నాయంటున్నారు.

ALSO READ  Mahaa Vamsi: ఏసీబీ విచారణలో KTR ఆవేశం..అరెస్ట్ కోసం ఆరాటం..

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *