Talliki YCP Vandanam: ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అమలు చేసిన ‘తల్లికి వందనం’ పథకం ఇప్పుడు రాజకీయ వేదికపై హాట్ టాపిక్‌గా మారింది. సూపర్-6 హామీల్లో కీలకమైన ఈ పథకాన్ని గత గురువారం సీఎం చంద్రబాబు నాయుడు ఘనంగా ప్రారంభించారు. శుక్ర, శనివారాల్లో లబ్ధిదారుల ఖాతాల్లో రూ.13,000 చొప్పున జమ చేశారు. ఒక తల్లికి ఎంతమంది చదువుకునే పిల్లలున్నా, అందరికీ నిధులు అందించారు. మొత్తంగా 85% మంది తల్లులకు ఇప్పటికే నిధులు అందాయి. ముగ్గురు, నలుగురు, ఆరుగురు… ఇలా ఒక ఇంట్లో ఎంత మంది బడికెళ్లే పిల్లలుంటే అందరికీ ఈ పథకం వర్తించింది. అన్నమయ్య జిల్లా కలకడలో నలుగురు మహిళలు, వారికి 12 మంది సంతానం ఉన్న ఒక ఉమ్మడి కుటుంబంలో.. 12 మంది పిల్లలకు గాను మొత్తం లక్షా 56 వేల నగదు బదిలీ అయ్యింది. అయితే, ఈ విజయవంతమైన పథకాన్ని వైసీపీ తన విష ప్రచారంతో దెబ్బతీసేందుకు యత్నించినా, అది బెడిసికొట్టి, కూటమికి పాజిటివ్ టాక్‌ను తెచ్చిపెట్టింది.
చంద్రబాబు ఆదివారం పార్టీ నాయకులతో ఫోన్లో మాట్లాడి, తల్లికి వందనం పథకంపై ప్రజల నుండి వస్తున్న ఫీడ్ బ్యాక్ గురించి ఆరా తీశారు. తల్లికి వందనం లక్షలాది మంది తల్లుల్లో ఆనందం నింపిందని, వారంతా స్పందిస్తున్న తీరు కూటమి ప్రభుత్వానికి బూస్టింగ్‌లా ఉందని నాయకులు సీఎంకు వివరించారట. అయితే, గ్రామీణ ప్రాంతాల్లో సర్పంచులు, వార్డు మెంబర్ల పిల్లలకు ఈ పథకం అందలేదని, పట్టణాల్లో 300 యూనిట్ల విద్యుత్ వినియోగం, ఫోర్ వీల్ వెహికల్ ఉన్నవారిని తప్పించారని కొందరు నాయకులు సీఎం దృష్టికి తీసుకొచ్చారట. ఈ లోపాలను వీలైనంత త్వరగా సరిచేస్తామని హామీ ఇచ్చారట సీఎం చంద్రబాబు. తెల్ల రేషన్ కార్డు ఉన్నవారిలో కూడా కొందరికి తల్లికి వందనం నిధులు అందలేదన్న విషయాన్ని చంద్రబాబు దృష్టికి తీసుకురాగా, దీనిపై చర్చిస్తామని పేర్కొన్నారట.
Also Read: Trump T1 Mobile: ఐఫోన్ 17 తో ట్రంప్ మొబైల్ పోటీ.. ఇంత తక్కువ దారకేనా..!
Talliki YCP Vandanam: మరోవైపు, వైసీపీ ఈ పథకంపై తలా తోక లేని విమర్శలతో రాద్ధాంతం చేస్తోంది. రూ.15,000 హామీ ఇచ్చి, రూ.13,000 మాత్రమే ఇచ్చారని, మిగిలిన రూ.2,000 లోకేశ్ ట్యాక్స్‌గా నారా లోకేశ్ ఖాతాలకు వెళ్లాయని ఆరోపించింది. దీనికి టీడీపీ స్పందిస్తూ, వైసీపీ హయాంలో ‘అమ్మ ఒడి’లో కూడా రూ.2,000 కోత విధించారని, అప్పుడు జగన్ ఖాతాలకు నిధులు వెళ్లాయా అని ప్రశ్నించింది. లోకేశ్ స్వయంగా రంగంలోకి దిగి, ఆరోపణలను నిరూపించాలని డెడ్‌లైన్ విధించడంతో వైసీపీ సైలెంట్ అయిపోయింది. అసత్య ప్రచారానికి పాల్పడిన వైసీపీ.. సారీ చెప్పాలని, లేని పక్షంలో న్యాయపోరాటానికి సిద్ధం కమ్మని లోకేశ్ హెచ్చరించినా, వైసీపీ మేకపోతు గాంభీర్యంతో మిన్నకుండిపోయింది. అంతటితో ఆపేస్తే వైసీపీకి ఆ మిగిలిన పరువైనా నిలబడేదేమో. కానీ అప్పటికీ ఆగని వైసీపీ.. మరో అడుగు ముందుకేసి, ఒకే తల్లికి 80 మంది, 100 మంది, 360 మంది పిల్లలున్నట్లు చూపిస్తూ… టీడీపీ నేతలు ఇష్టారాజ్యంగా పిల్లల పేర్లు రాసుకొని.. డబ్బులు కాజేశారని ఆరోపించింది. దీనికి సమాధానంగా టీడీపీ, ఆ సంఖ్యలు అనాథ శరణాలయాల పిల్లల జాబితాలకు సంబంధించినవని, ఒక కుటుంబంలో ఆరుగురికి మించి పిల్లలు నమోదైతే క్షేత్రస్థాయి విచారణ జరుపుతామని స్పష్టం చేసింది. ఈ వాస్తవం బయటపడటంతో వైసీపీ నోట్లో పచ్చి వెలక్కాయ పడినట్టయింది.
పథకం దబ్బులు ఖాతాల్లో పడ్డాయి కాబట్టి ప్రజలు వైసీపీ తప్పుడు ప్రచారాలను నమ్మే పరిస్థితి ఎలాగూ ఉండదు. విచిత్రం ఏంటంటే.. వైసీపీ అధికారిక సోషల్‌మీడియా ఖాతాల్లో చేస్తున్న ప్రచారంపై సొంత కార్యకర్తలే పెదవి విరుస్తున్నారట. లోకేష్ సవాల్‌కి తోక ముడిచిన వైసీపీ… విద్యాశాఖా మంత్రి నుండి ఎటాక్ని ఎదుర్కొంటూనే ఉంది. జగన్ కడుపు మంటకు ఈనో ప్యాకెట్లు పంపిస్తా అంటూ లోకేష్ వ్యాఖ్యానించడంతో వైసీపీ టోటల్‌గా అబాసుపాలైంది. తల్లికి వందనం పథకం విజయవంతం అవ్వడాన్ని ఓర్వలేని వైసీపీ, ఎలాగోలా బురద జల్లాలనే తాపత్రయంతో చేస్తున్న ప్రచారం, ఉల్టా పుల్టాగా మారి కూటమికి పాజిటివ్ టాక్ తెచ్చిపెట్టింది. వైసీపీ మైండ్ లెస్ టాక్టిస్ కారణంగా ప్రజల్లోకి ఈ పథకం విస్తృతంగా వెళ్లిపోయింది. అలా జగన్ మోహన్ రెడ్డి, వైఎస్సార్సీపీ పార్టీ తల్లికి వందనం పథకానికి బ్రాండ్ అంబాసిడర్లుగా మారి, పనికట్టుకుని కూటమికి ప్రచారం చేస్తోందని వైసీపీ నేతలే అసహనంతో రగులుతున్నారని నియోజకవర్గాల్లో టాక్ నడుస్తోంది.
