Shakeel Arrest: బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ చుట్టూ ఉత్కంఠ పెరుగుతోంది! హిట్ అండ్ రన్ కేసులో కుమారుడిని రక్షించేందుకు పోలీసులను ప్రలోభపెట్టిన ఆరోపణలు, 80 కోట్ల సీఎంఆర్ వడ్ల కుంభకోణం.. ఇలా షకీల్‌పై కేసులు కుప్పలుగా పేరుకున్నాయి. దుబాయ్‌లో తలదాచుకున్న షకీల్, తన తల్లి అంత్యక్రియల కోసం హైదరాబాద్ చేరగానే అదుపులోకి తీసుకున్నారు. అంత్యక్రియల తర్వాత అరెస్టు తప్పదా? షకీల్ రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది.
హిట్ అండ్ రన్ కేసులో కుమారుడిని రక్షించేందుకు పంజాగుట్ట పోలీసులను ప్రలోభపెట్టినట్లు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్‌పై ఆరోపణలు ఉన్నాయి. గత ఏడాది ప్రజాభవన్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో షకీల్ కుమారుడు మద్యం మత్తులో కారు నడిపి ప్రమాదానికి కారణమయ్యాడు. ఆ నేరాన్ని డ్రైవర్‌పై నెట్టారని, జూబ్లీహిల్స్‌లో బాలుడి మరణానికి కూడా షకీల్ కుమారుడే కారణమని పోలీసులు తేల్చారు. పోలీసులపై ఒత్తిడి చేసి కేసును మాఫీ చేయించారనే ఆరోపణలతో షకీల్‌పై కేసు నమోదైంది. దీంతో ఆయన దుబాయ్‌కు పారిపోయారు.
Also Read: america: చైనాకు భారీ షాకిచ్చిన ట్రంప్..
Shakeel Arrest: గత కొన్ని నెలలుగా దుబాయ్‌లో ఉన్న షకీల్…. తల్లి మరణంతో గురువారం హైదరాబాద్ చేరుకోగా, ఎయిర్‌పోర్ట్‌లో పాస్‌పోర్ట్ స్వాధీనం చేసుకున్న అధికారులు అంత్యక్రియలకు షరతులతో అనుమతించారు. తల్లి అంత్యక్రియలు ముగియగానే షకీల్‌ను పోలీసులు విచారించే అవకాశం ఉంది. ఈ కేసులో పంజాగుట్ట పోలీస్ స్టేషన్ సిబ్బందిపై వేటు పడగా, మొత్తం సిబ్బందిని ఇతర స్టేషన్లకు బదిలీ చేశారు. అదనంగా, నిజామాబాద్‌లో సీఎంఆర్ వడ్ల కుంభకోణంలో షకీల్ సుమారు 80 కోట్ల ఆర్థిక మోసానికి పాల్పడినట్లు అధికారులు గుర్తించారు. ఈ కేసులో నిజామాబాద్ అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, డీఎస్వో చంద్రప్రకాశ్, డీటీ నిఖిల్ రాజ్‌లపై కేసు నమోదైంది. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు షకీల్ తన రైస్ మిల్‌కు నిబంధనలకు విరుద్ధంగా సహకరించిన అధికారులు ఇప్పుడు కేసుల్లో ఇరుక్కున్నారు. షకీల్‌పై ఇతర కేసులను కూడా విచారించే అవకాశం ఉంది.