Sensation In TTD Laddu Scam

Sensation In TTD Laddu Scam: పాతిక రూపాయల కమీషన్‌ కోసం మహా పాపం!

Sensation In TTD Laddu Scam: తిరుమల లడ్డూ నెయ్యి కల్తీ కేసు కీలక మలుపు తిరిగింది. కల్తీ నెయ్యి సరఫరా వెనుక భారీ కుట్ర ఉన్నట్లు సిట్ అధికారులు గుర్తించారు. మాజీ టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సన్నిహితుడు చిన్న అప్పన్న అరెస్ట్ తో ఈ కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. కల్తీ నెయ్యి కేసులో అప్పన్నను 24వ నిందితుడిగా చేర్చిన సిట్… అప్పన్న రిమాండ్ రిపోర్టులో కుట్ర కోణాలను ప్రస్తావించింది. సిట్‌ ప్రస్తావించిన వివరాల ప్రకారం… టీటీడీ కొనుగోళ్ల విభాగం జనరల్ మేనేజర్‌ను 2022లో సంప్రదించాడు అప్పన్న. టీటీడీకి నెయ్యి సరఫరా చేసే అన్ని కంపెనీల వివరాలను తీసుకున్న అప్పన్న… ఆ వివరాల ఆధారంగా భోలే బాబా డైరీ యాజమాన్యానికి ఫోన్ చేశాడు. బోలే బాబా కంపెనీ ప్రతినిధి పీపీ శ్రీనివాస్‌కు ఫోన్ చేసిన అప్పన్న.. టీటీడీకి సరఫరా చేసే ప్రతి కిలో నెయ్యిపై రూ.25 కమీషన్ ఇవ్వాలని డిమాండ్ చేశాడు. కమీషన్ ఇవ్వడానికి భోలే బాబా డైరీ యాజమాన్యం నిరాకరించడంతో… బోలేబాబా డైరీని అనర్హులుగా ప్రకటించేలా చేయడానికి అప్పన్న కుట్ర పన్నాడు. బోలేబాబా డైరీలో తనిఖీలు చేయాలంటూ టీటీడీ ప్రొక్యూర్మెంట్ జీఎమ్‌పై ఒత్తిడి చేశాడు. భోలే బాబా డైరీని అనర్హులుగా ప్రకటించే ప్రయత్నంలో డైరీకి వ్యతిరేకంగా అజ్ఞాత వ్యక్తులతో పిటిషన్లు వేయించారు. అప్పన్న ఒత్తిళ్లు, కుట్రలతో బోలేబాబా డైరీ నుంచి నెయ్యి సేకరణ నిలిపివేసింది టీటీడీ. భోలే బాబా డైరీ టెండర్ల నుంచి తొలగిపోవడంతో ఆ స్థానంలో ప్రీమియర్ అగ్రి ఫుడ్స్ అనే సంస్థ ప్రవేశించింది. బోలేబాబా డైరీ కంటే కిలోకు రూ.138 ఎక్కువ కోట్ చేసింది ప్రీమియర్ అగ్రిఫుడ్స్. పోటీ లేకపోవడంతో టీటీడీ నుంచి నెయ్యి సరఫరా కాంట్రాక్టును దక్కించుకున్న అగ్పిఫుడ్స్… చిన్న అప్పన్నకు రూ.50 లక్షల వరకు ముడుపులు చెల్లించినట్లు సిట్ విచారణలో గుర్తించింది. ‌ఓ హవాలా ఏజెంట్ ద్వారా అప్పన్నకు ఈ ముడుపులు చేరినట్లు కనుక్కొంది. ప్రీమియర్ అగ్రి ఫుడ్స్ ప్రమోటర్లతో అప్పన్న నిరంతరం సంప్రదించినట్లుగా ఆధారాలు సైతం సిట్‌ సేకరించింది. అప్పన్న బ్యాంకు లావాదేవీలను పరిశీలించి అక్రమాల నిగ్గు తేల్చింది.

Also Read: Brahmam Gari House Collapse: కూలిన బ్రహ్మంగారి గృహం.. అసలు నిజాలు

తిరుమల లడ్డూ నెయ్యి కల్తీ కేసులో కుట్రను ఛేదించేందుకు అప్పన్నను కస్టడీకి కోరనుంది సిట్. మాజీ ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి అక్రమాలను సైతం సిట్ కనిపెట్టినట్లు సమాచారం. భోలే బాబా, ప్రీమియర్ అగ్రి ఫుడ్స్, వైష్ణవి డైరీ నెయ్యి నమూనాలను పరీక్షించాలని 2022లో టీటీడీ ఆదేశాలు జారీ చేసింది. అప్పటి టీటీడీ ఛైర్మన్ ఆదేశాలతోనే నెయ్యి నమూనాలను సీఎఫ్‌టీఆర్ఐ – మైసూరుకు పంపింది తిరుమల తిరుపతి దేవస్థానం. ల్యాబ్ నివేదికల్లో నెయ్యిలో వనస్పతి కల్తీ చేస్తున్నట్లు నిర్ధారణ అయింది. ల్యాబ్ నివేదికలు నెయ్యి కల్తీని ధృవీకరించినా చర్యలు తీసుకోలేదు అప్పటి అధికారులు. కల్తీ గుర్తించినా 2022-2024 మధ్య నెయ్యి సరఫరా కొనసాగింది. రెండేళ్ల పాటు రూ.250 కోట్ల విలువైన 68 లక్షల కిలోల కల్తీ నెయ్యి టీటీడీ కొనుగోలు చేసింది. గుత్తేదారు కల్తీ నెయ్యి సరఫరా ద్వారా ఒక్కో కిలోకు సుమారు రూ.250 చొప్పున అధిక లాభాలు ఆర్జించినట్లు సిట్ గుర్తించింది. అప్పన్న విచారణతో వెలుగుచూసిన ఈ అంశాలతో మరికొందరిని నిందితులుగా చేర్చింది సిట్. మాజీ టీటీడీ ఛైర్మన్ పీఏ చిన్న అప్పన్నతో సహా తొమ్మిది మందిని కొత్తగా నిందితులుగా చేర్చింది.

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *