Sana Sensation in ACA

Sana Sensation in ACA: ఆంధ్రా క్రికెట్‌లో సానా సెన్సేషన్‌

Sana Sensation in ACA: మరి కొద్ది రోజుల్లో విశాఖపట్నం క్రికెట్‌ అభిమానులతో సందడి వాతావరణం నెలకొననుంది. మహిళల క్రికెట్‌ ప్రపంచకప్‌-2025 మ్యాచ్‌లకు విశాఖ నగరం ఆతిథ్యం ఇవ్వనుంది. మహిళల ప్రపంచ కప్‌ టోర్నీలో భాగంగా అక్టోబర్‌లో దాదాపు ఐదు మ్యాచ్‌లు విశాఖపట్నంలోనే జరగనున్నాయి. ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా మహిళా క్రికెటర్లు విశాఖపట్నంకు వస్తున్నారు. ఆ మేరకు ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నారు. ఈ మ్యాచ్‌లలో తొలి మ్యాచ్‌కు మంత్రి నారా లోకేష్‌ ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో మహిళా క్రికెటర్లను ప్రోత్సహించాలనే లోకేష్‌ ఆలోచనని, పక్కాగా అమలు చేయడంలో సానా సతీష్‌ సక్సెస్‌ అయ్యారు. ఈ మహిళల వరల్డ్ కప్ కేవలం ఒక టోర్నమెంట్ మాత్రమే కాదు – ఆంధ్రప్రదేశ్ క్రీడా పునరుజ్జీవనానికి సంకేతం కూడా. విశాఖ సాగరతీరన జరిగే ఈ ఈవెంట్…. పర్యాటకం, ఉపాధి, మహిళా క్రీడాకారుల అభివృద్ధికి కొత్త దారులు తెరుస్తుందనడంలో సందేహం లేదు.

టిడిపిలో కీలకంగా ఉన్న సానా సతీష్.. నారా లోకేష్ కు అత్యంత సన్నిహితుడుగా కొనసాగుతున్నారు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత తనదైన నిర్ణయాలతో దూసుకుపోతున్నారు. జట్టును బలోపేతం చేసే క్రమంలో పటిష్టమైన ప్రణాళికలను అమలు చేస్తున్నారు. ఆంధ్ర క్రికెట్ నుంచి హనుమ విహారి తప్పుకుంటున్నట్టు ఇటీవల ప్రకటించాడు. దీంతో వైసిపి రంగంలోకి దిగింది. ఎంత విష ప్రచారం చేయాలో అంత విష ప్రచారం చేసింది. కూటమి ప్రభుత్వాన్ని అడ్డగోలుగా విమర్శించింది. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సానా సతీష్ ను ఇష్టానుసారంగా విమర్శించింది. నీచాతి నీచమైన వ్యాఖ్యలు చేసింది. సానా సతీష్ నాయకత్వంలో ఆంధ్ర క్రికెట్ మొత్తం భ్రష్టు పట్టిపోయిందని.. ఆటగాళ్లు మొత్తం జట్టును వదిలి వెళ్ళిపోతున్నారని.. ఆర్థికంగా అవక తవకలు కూడా జరుగుతున్నాయని.. ఇలా లేనిపోని విమర్శలు చేసింది. వాస్తవానికి ఆంధ్ర క్రికెట్ లో ఏం జరుగుతుందో తెలియని కొంతమంది వైసీపీ ఆరోపణలను నిజమని నమ్మారు. వైసీపీ ఎంత విష ప్రచారం చేస్తున్నప్పటికీ సానా సతీష్ సహనంతోనే ఉన్నారు. తన మౌనమే అన్నిటికి సమాధానం అన్నట్టుగా నిశ్శబ్దాన్ని ఆశ్రయించారు.. ఇప్పుడు తన మదిలో ఉన్న ఒక్కొక్క ప్రణాళికను అమలు చేసుకుంటూ వస్తూ ఉండడంతో నిన్నటిదాకా విమర్శించిన వైసిపి ఒక్కసారిగా సైలెంట్ అయిపోయింది. ఆయన తీసుకుంటున్న నిర్ణయాలను ఏకంగా బీసీసీఐ పెద్దలే ఆశ్చర్యంగా చూస్తున్నారు.

Also Read: Amaravati: చంద్రబాబు ఆమోదంతో అమరావతి ఐకానిక్ కేబుల్ వంతెన డిజైన్ ఖరారు

వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ట్రోఫీ 2021లో న్యూజిలాండ్ జట్టు దక్కించుకునేలా చేసిన కోచ్ స్టీడ్‌ను ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చారు సానా సతీష్. ఆంధ్ర క్రికెట్ జట్టుకు శిక్షకుడిగా నియమించారు. గడిచిన సంవత్సరంలో దేశవాళి క్రికెట్లో ఆంధ్ర క్రికెట్ జట్టు కొంతగా ఆకట్టుకోలేదు. రంజీలలో ఆశించిన స్థాయిలో ప్రదర్శన చేయలేదు. పలు టోర్నీలలో నిరాశ జనకమైన ఆట తీరు ప్రదర్శించింది. ఈ నేపథ్యంలో జట్టును బలోపేతం చేయడానికి సానా సతీష్ బలంగా అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలో విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకొని.. డొమెస్టిక్ విభాగంలో జట్టును ప్రథమ స్థానంలో ఉండేలా చేస్తున్నారు. ఒకవేళ సతీష్ ప్రణాళికలు విజయవంతమైతే డొమెస్టిక్ క్రికెట్లో ఆంధ్ర జట్టు సరికొత్త చరిత్ర సృష్టిస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు.

రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ బాబు స్వయంగా ఒక స్పోర్ట్స్ పర్సన్ కూడా. క్రికెట్‌, క్రికెట్‌ అడ్మినిస్ట్రేషన్‌తో ఆయని ఏళ్ల అనుబంధం ఉంది. ప్రస్తుతం ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీగా ఉన్న సానా సతీష్.. తన ఫౌండేషన్ ద్వారా క్రికెట్‌లో యువ ప్రతిభావంతులను ప్రోత్సహిస్తున్నారు. ఒక స్పోర్ట్స పర్సన్‌ పొలిటీషియన్‌ అయితే ఎలా ఉంటుందో ప్రాక్టికల్‌గా చేసి చూపిస్తున్నారు సానా సతీష్‌ బాబు. ఏ పని తలపెట్టిన హండ్రెడ్‌ పర్సెంట్‌ డెడికేషన్‌తో చేయడమే ఆయన విజయ రహస్యం అని చెబుతుంటారు. క్రీడల అభివృద్ధికి, తద్వారా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కృషి చేస్తున్న డైనమిక్ లీడర్‌గా సానా సతీష్‌ బాబు.. క్రీడాభిమానుల మన్ననలను అందుకుంటున్నారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *