Sana Satish Commitment: టీడీపీ ఎంపీ సానా సతీష్ చొరవతో ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగం కొత్త ఒరవడిని సంతరించుకుంటోంది. ఆయన అవిశ్రాంత కృషి, కేంద్రంతో సమన్వయం, ఫలితాలను రాబట్టే తీరు ఆకట్టుకుంటోంది. రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టే దిశగా సానా సతీష్ తన వంతు పాత్రను బలంగా నిర్వహిస్తూ, ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధిలో కీలకంగా మారుతున్నారు. అధినేత చంద్రబాబు, యువనేత లోకేష్‌ల నమ్మకాన్ని నిలబెడుతూ.. రాజ్యసభలో ఏపీ వాయిస్‌గా నిలుస్తున్నారు సానా సతీష్. ముఖ్యంగా రాష్ట్రానికి రావాల్సిన నిధులపై ఆయన ఎంతో చురుగ్గా ఢిల్లీలో పనిచేస్తున్నారు. రాష్ట్రానికి సంబంధించి ప్రాజెక్టులు, పరిశ్రమలు, నిధులపై అవిశ్రాంతంగా కృషి చేస్తూ.. కేంద్రం నుండి రాష్ట్రానికి రావాల్సిన వాటిపై నిత్యం రాజ్యసభలో ప్రశ్నిస్తూ, కేంద్ర పెద్దలతో సమన్వయం చేసుకుంటూ, ప్రతి అంశాన్ని ఫాలోఅప్ చేస్తూ, ఫలితాలు రాబట్టడంలో సక్సెస్ అవ్వడమే కాకుండా, అధినేత చంద్రబాబు మెప్పు పొందుతున్నారు.
తాజాగా ఎంపీ సానా సతీష్ చొరవ, కృషితో ఏపీ పర్యాటక రంగానికి భారీగా నిధులు మంజూరయ్యాయి. రాష్ట్రానికి రావాల్సిన నిధులపై రాజ్యసభలో ఎప్పటికప్పుడు ఏపీ వాయిస్ వినిపిస్తున్నారు టీడీపీ ఎంపీ సానా సతీష్. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లోనూ ఆయన తన పంథా కొనసాగించారు. పర్యాటక రంగానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్‌కు రావాల్సిన నిధులపై ప్రశ్నిస్తూ, ఇప్పటికే జరిగిన కేటాయింపులకు సంబంధించి త్వరిత గతిన నిధులు మంజూరు చేయాల్సిన ఆవశ్యకతను గౌరవ సభ దృష్టికి తీసుకొచ్చారు ఎంపీ సానా సతీష్. రాజ్యసభలో సానా సతీష్ బాబు అడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చిన కేంద్ర మంత్రి షెకావత్… ఏపీ పర్యాటక రంగానికి భారీ గుడ్ న్యూస్ చెప్పారు.
Also Read: Srilakshmi: ఓబులాపురం మైనింగ్ కేసు: ఐఏఎస్ శ్రీలక్ష్మికి తెలంగాణ హైకోర్టులో చుక్కెదురు
స్వదేశ్ దర్శన్ 2.0లో భాగంగా బాపట్ల సూర్యలంక బీచ్ అభివృద్ధికి రూ.97.52 కోట్లు మంజూరు చేసింది కేంద్ర ప్రభుత్వం. అహోబిలం, నాగార్జున సాగర్‌లకు చెరో 25 కోట్ల రూపాయలకు సీబీడీపీ పథకం కింద ఆమోదం తెలిపింది. ఇక గండికోట కోట అభివృద్ధికి ఇటీవల కేటాయించిన 80 కోట్ల రూపాయల్లో 77.91 కోట్ల రూపాయలని విడుదల చేసింది. రాజమండ్రిలో ఆధ్యాత్మిక పర్యాటకాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా… ‘అఖండ గోదావరి’ ప్రాజెక్టుకు రూ.94.44 కోట్లు, అన్నవరం పట్టణాభివృద్ధికి ప్రసాద్ పథకంలో 25.33 కోట్లు మంజూరు అయ్యాయి. ఇలా ‘స్వర్ణాంధ్ర 2047’ విజన్‌ను ముందుకు తీసుకెళ్లే కీలక ప్రాజెక్టులకు కేంద్ర ఆమోదం తెలపడంతో ఏపీ పర్యాటకం ఇక దూసుకెళ్లనుంది. పర్యాటక ప్రాజెక్టులకు సంబంధించి దేశంలోనే అత్యధిక నిధులు కేటాయించింది ఆంధ్రప్రదేశ్‌కే కావడం ఇక్కడ మరో విశేషం. అయితే… ఆంధ్రప్రదేశ్ పర్యాటక ప్రగతిలో ఎంపీ సానా సతీష్ పాత్ర చాలా కీలకంగా ఉంటోంది. కేంద్రం ఆమోదించిన ప్రాజెక్టులకు త్వరిత గతిన నిధులు రాబట్టడంలో ఆయన సీఎం చంద్రబాబు మార్గదర్శకంలో ఎప్పటికప్పుడు కేంద్ర పెద్దలను ఫాలో అప్ చేసుకుంటుండటం మంచి ఫలితాలనిస్తోంది.
