RK Roja Arrest: నగరి మాజీ ఎమ్మెల్యే, వైసీపీ ఫైర్‌బ్రాండ్ ఆర్కే రోజా మళ్లీ రెచ్చిపోయారు. “దమ్ముంటే నన్ను అరెస్ట్ చేయండి చూద్దాం” అంటూ కూటమి ప్రభుత్వానికి సవాల్ విసిరారు. ఈ నేపథ్యంలోనే శాప్ చైర్మన్ రవి నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆడుదాం ఆంధ్రాలో రూ.119 కోట్ల అవినీతికి సంబంధించి “రోజా అరెస్ట్ తప్పదు” అని రవినాయుడు జోస్యం చెప్పారు. తనపై వస్తోన్న ఆరోపణలపై రోజా రియాక్షన్ తర్వాతి రోజే రవినాయుడు ఈ వ్యాఖ్యలు చేయడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు, లోకేష్‌లపై ఎడాపెడా బూతులు పేల్చిన రోజా.. ఇప్పుడు అధికారం కోల్పోయినా నోరు చేసుకోవడం మాత్రం ఆపలేదు. బుధవారం తాడేపల్లిలో వైఎస్ జగన్‌తో భేటీ అనంతరం రోజా మీడియా ముందుకొచ్చారు. ఆడుదాం ఆంధ్రాలో అవినీతి జరగలేదనీ, పక్కా ప్రణాళికతో నిర్వహించామని క్లీన్ చిట్ ఇచ్చుకున్నారు. అయితే రవినాయుడు మాత్రం.. విచారణ జరుగుతోందనీ, భయంతోనే రోజా నెల రోజులు దాక్కున్నారనీ… జగన్, సజ్జల సూచనతోనే మళ్లీ బయటకొచ్చారనీ, రోజా ముఖంలో భయం స్పష్టంగా కనిపిస్తోందని, అరెస్ట్ ఖాయమని పంచ్ విసిరారు. రోజా అరెస్ట్ గురించి సవాల్ విసరడంతోనే.. రవినాయుడు అరెస్ట్ తప్పదనీ కౌంటర్ విసరాల్సి వచ్చింది. అసలు రోజా ఈ గేమ్ ఎందుకు ఆడుతున్నారనేది ఎవ్వరికీ అంతుబట్టని విషయంగా ఉంది. కూటమి ప్రభుత్వం తనను ఏమీ చేయలేదన్న అతి ఆత్మవిశ్వాసంతో ఉన్నారు. లేక కేసుల నుంచి తప్పించుకునేందుకు జగన్ బ్యాకప్‌పై ఆధారపడుతున్నారా? అనే అనుమానాలొస్తున్నాయ్.
RK Roja Arrest: రాజకీయ విశ్లేషకులు మాత్రం రోజా వ్యూహంలో మరో కోణం చూస్తున్నారు. అరెస్ట్ అయితే పొలిటికల్ సానుభూతి వస్తుందని, మళ్లీ ట్రెండింగ్‌లోకి వచ్చే అవకాశం ఉందని ఆమె లెక్కలు వేస్తున్నారని అంటున్నారు. ఆడుదాం ఆంధ్రాలో తాను తినిందేమీ లేదనీ.. మూటలన్నీ తాడేపల్లి ప్యాలెస్‌కే వెళ్లాయనీ… రోజా ఇండైరెక్ట్‌గా సిగ్నల్ ఇస్తుండటం చూస్తుంటే.. తాను ఇరుక్కుంటే జగన్‌తో పాటు వైసీపీ పెద్దలంతా ఇరుక్కుంటారని పరోక్షంగా హింట్ ఇస్తూ.. పార్టీ హైకమాండ్‌ను బ్లాక్‌మెయిల్ చేసే ఆట ఆడుతున్నారేమో అన్న సందేహాలూ కలుగుతున్నాయ్.
Also Read: Kodali America Tour: ‘మెరుగైన వైద్యం’ కోసం అమెరికాకు కొడాలి నాని!
ఆడుదాం ఆంధ్రా స్కామ్‌లో రోజా పాత్ర ఉందా? లేదా? అన్నది విచారణలో తేలాలి. అందులో ఆమె పాత్ర లేదనీ ఒకవేళ విచారణలో తేలినా సరే… రోజా అరెస్ట్ నుంచి తప్పించుకోగలరా అన్నదే ఇక్కడ ప్రశ్న. ఎందుకంటే రోజాపై.. తిరుమల బ్లాక్ టికెట్ల దందా, నగరిలో అక్రమాలు.. ఇలా చాలానే ఆరోపణలున్నాయి. మరి అరెస్ట్ అయితే… రోజా కోరుకుంటున్నట్లుగా ఆమె రాజకీయ జీవితం మళ్లీ లైమ్‌లైట్‌లోకి వస్తుందా? ఇతర వైసీపీ నేతల్లా ఆమె కూడా కంప్లీట్‌గా కనుమరుగవుతారా? అల్టిమేట్‌గా… ఈ డ్రామా ఎటు నుండి ఎటు తిరుగుతుందో చూడాలి!
