Revanth and Rahul in Delhi

Revanth and Rahul in Delhi: ప్రతిపక్షాల విమర్శలకు చెక్‌ పెట్టినట్లేనా?

Revanth and Rahul in Delhi: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ప్రతినిధిగా రాష్ట్రానికి రావాల్సిన నిధుల కోసం ఢిల్లీ వెళ్తున్నారు.. కేంద్ర పెద్దలను కలుస్తున్నారు. అదే సమయంలో కాంగ్రెస్‌ జాతీయ పార్టీ కాబట్టి రాష్ట్రంలో జరుగుతున్న ప్రభుత్వ పని తీరును పార్టీ పెద్దలకు వివరించేవారు. అలాంటి సందర్భాల్లో రాహుల్ గాంధీని రేవంత్ రెడ్డి కలవకపోతే రాహుల్ గాంధీ, రేవంత్‌కి మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నాయనీ, అందుకే రేవంత్‌కి రాహుల్ అపాయిట్మెంట్ కూడా దొరకడం లేదని బిఆర్ఎస్, బిజెపి వారు విమర్శలు చేస్తూ వచ్చారు. తాజాగా రేవంత్ రెడ్డి చేసిన పర్యటన ప్రతిపక్షాల విమర్శలకు, ఊహాగానాలకు చెక్ పెట్టిందని గాంధీ భవన్ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది.

Also Read: Avinash Reddy in liquor scam: లిక్కర్‌ పార్టీ ప్రొడక్షన్‌లో బయటపడ్డ మరో 3 సినిమాలు

పరిపాలన విభాగంలో తన మార్కు చూపిస్తూనే, ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ ఢిల్లీ పెద్దల వద్ద కూడా తన మార్క్ చాటుకున్నాడు సీఎం రేవంత్‌ రెడ్డి. తాజాగా రాష్ట్రం చేపట్టిన కులగణనపై ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ ఎంపీలందరికీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు రేవంత్‌. ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌లో రేవంత్ రెడ్డిని రాహుల్ గాంధీ అభినందించడం, కులగణ విషయంలో అభినందిస్తూ సోనియా గాంధీ రేవంత్ రెడ్డికి లేఖ రాయడం.. ఈ రెండు సంఘటనలతో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం వద్ద తన మార్క్‌ చాటుకున్నాడని గాంధీ భవన్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. సీఎం రేవంత్‌పై రాహుల్ గాంధీ ప్రశంసలతో ఆయన పాత్ర మరింత బలపడినట్లు అభిప్రాయపడుతున్నారు.

ఢిల్లీలో రేవంత్ పవర్‌పాయింట్‌ ప్రజంటేషన్‌ తర్వాత… ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్‌ వర్గాల్లో ఎక్కడ చూసినా రేర్‌, రేర్‌ అంటూ చర్చ జరుగుతోందట. ఇంతకీ ఏంటీ రేర్‌ అంటారా? R.A – R.E అంటే రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి అంటూ మాట్లాడుకుంటున్నారట కాంగ్రెస్‌ క్యాడరంతా.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  AP News: పోలీసులపై జగన్ వ్యాఖ్యలను ఖండించిన ఏపీ పోలీసు అధికారుల సంఘం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *