Quantam Vally vs Fishery: సీఎం చంద్రబాబు పెద్ద ప్లాన్‌తోనే సింగపూర్ వెళ్లారు. గతంలో సింగపూర్‌తో ఆంధ్రా అనుబంధం ఓ స్వర్ణయుగం లాంటిది. అమరావతికి మాస్టర్ ప్లాన్ ఉచితంగా ఇచ్చారు. తర్వాత జగన్ నిర్వాకంతో ఇక ఏపీ వైపు చూడకూడదనుకున్నారు. కానీ మళ్లీ చంద్రబాబు ఆ భూతం మళ్లీ రాదన్న ధైర్యం ఇచ్చి.. అమరావతికి రావాలని ఆహ్వానించేదుకు వెళ్లారు. ఈ క్రమంలో ఆయనను కలిసేందుకు సింగపూర్ నుంచే కాదు ఆ చుట్టుపక్కల ఉన్న ఆరేడు దేశాల నుంచి తెలుగువాళ్లు, పారిశ్రామికవేత్తలు వచ్చారు. వాస్తవానికి ఒకసారి పరాభవంతో తిరిగి వెళ్లిపోయిన సింగపూర్ కన్సార్టియంను మళ్లీ ఆహ్వానించాలన్న ఆలోచనే ఓ సాహసం. ఎందుకంటే సింగపూర్ కన్సార్టియంను గత వైసీపీ ప్రభుత్వం మామూలుగా అవమానించలేదు. తన ఫ్యాక్షన్ బుద్ధిని సింగపూర్ ప్రభుత్వంపైనా చూపించింది. సింగపూర్ కన్సార్టియంపై, సింగపూర్ మంత్రి ఈశ్వరన్‌పై తప్పుడు కథనాలు రాయించింది. కేసులు కూడా బనాయించింది. దీంతో అసలు ఏపీ వైపే కన్నెత్తి చూడకూడదని సింగపూర్ ప్రభుత్వం, సింగపూర్ వ్యాపార సంస్థలు భావించాయి. అలాంటి సింగపూర్ ప్రభుత్వ సంస్థని తిరిగి రాష్ట్రానికి ఆహ్వానించడం అంటే… మరొకరైతే ఏం మొహం పెట్టుకుని వెళ్లి అడుగుతామని వెనకడుగు వేసే వారేమో. కానీ అక్కడుంది చంద్రబాబు. రాష్ట్రానికి మేలు జరుగుతుంది అంటే… ఆయన ఇక మరేదీ పట్టించుకోరు. చంద్రబాబుతో ఐదు నిమిషాలు మాట్లాడితే ఆరు నెలల్లో పెట్టుబడులతో వచ్చామని ఇటీవల యూఏఈ ఆర్థిక మంత్రి చెప్పారు. బిజినెస్ టాక్స్‌లో చంద్రబాబు నైపుణ్యం అలాంటిది. అందుకే ఆయన అంటే పారిశ్రామికవేత్తలు మంచి గౌరవం ఇస్తారు. నేడు సింగపూర్ పర్యటన కూడా అదే విధంగా సత్ఫలితాలిస్తుండటం ఏపీకి శుభపరిణామం అంటున్నారు విశ్లేషకులు.
Also Read: GSLV F-16 NISAR: నింగిలోకి నిసార్.. జీఎస్ఎల్వీ F-16 కౌంట్‌డౌన్ ప్రారంభం!
రాష్ట్రం కోసం, రాజధాని కోసం చంద్రబాబు పడుతున్న కష్టం ఆ మాదిరిగా ఉంటే.. వైసీపీ నేతల బుద్ధి మాంద్యం, బరితెగింపు తనం మరోలా ఉంది. తాజాగా మాజీ గుడ్‌మార్నింగ్ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి రాజధాని అమరావతి విషయంలో మరీ వెటకారానికి పోయారు. సీఎం చంద్రబాబు క్వాంటం వ్యాలీ, స్పోర్ట్స్ వ్యాలీ, ఆ వ్యాలీ, ఈ వ్యాలీ అంటున్నారనీ… కానీ అవేవీ ఉండవని, చివరికి అమరావతిలో ఆక్వా వ్యాలీ తప్ప మరేదీ ఉండదని వెటకరించారు వెంకట్రామిరెడ్డి. అమరావతి వరదలొస్తే మునిగిపోతుందని, అలాంటి ప్రాంతంలో ఫిషరీలు మాత్రమే అభివృద్ధి అవుతాయన్నది వెంకట్రామన్న అంతరంగంలోని ఉద్దేశం అనమాట. వాస్తవానికి అమరావతిలో క్వాంటం వాలీకి సంబంధించి ఇప్పటికే ఐబీఎమ్, మైక్రోసాఫ్ట్, టీసీఎస్, ఎల్ అండ్ టీ సంస్థలు వేర్వేరు క్వాంటం కంప్యూటింగ్ టెక్నాలజీలతో తమ క్వాంటం సిస్టమ్స్‌ని ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చాయి. భారతదేశంలోనే మొట్టమొదటి, అత్యాధునిక క్వాంటమ్ వ్యాలీ టెక్ పార్క్ ఇది. చంద్రబాబు ఆలోచనలు ప్రపంచస్థాయిలో అమరావతిని నిలిపేలా ఉంటే.. కేతిరెడ్డి లాంటి వైసీపీ బ్రెయిన్స్ మాత్రం చేపల చెరువుల దగ్గరే ఆగిపోయాయి అంటున్నారు అనలిస్టులు. జగన్‌కు, చంద్రబాబుకు తేడా కూడా అదే అంటున్నారు. జగన్‌కు జనాలకు చేపలు ఇచ్చి తినమనేవాడు. కానీ, చంద్రబాబు జనాలకు చేపలు పట్టడం కూడా నేర్పిస్తారు. ఐదేళ్లు బటన్ నొక్కి నొక్కి.. నోటు బ్యాంకు, ఓటు బ్యాంకు రాజకీయాలు మాత్రమే చేసిన వాళ్లకి.. అభివృద్ధి, టెక్నాలజీ, క్వాంటం వ్యాలీ, రాష్ట్ర సమగ్ర అభివృద్ధి వంటి కాన్సెప్టులు అర్థం కావులే అంటున్నారు పొలిటికల్ క్రిటిక్స్.