Pushpa Red Sandle

Pushpa Red Sandle: ఏపీలో ‘పుష్ప’ గాడి రూల్: ఒక్క దుంగ కదలట్లే!

Pushpa Red Sandle: శేషాచలం అడవుల్లో దాగిన బంగారు నిధి ఎర్రచందనం! ప్రపంచంలో ఎక్కడా లేని ఈ అరుదైన కలపకు అంతర్జాతీయ మార్కెట్‌లో క్రేజ్ అంతా ఇంతా కాదు. ఒక్క టన్ను రెడ్ శాండిల్ ధర 2నుండి 3 కోట్లుంటుంది! చైనా, జపాన్‌లలో ఈ ఎర్రచందనంలో లగ్జరీ ఫర్నిచర్, సంగీత వాయిద్యాలు, ఔషధాలు తయారవుతాయి. చైనాలో అయితే కొత్త జంటకు ఎర్రచందనం వస్తువులు కానుకగా ఇవ్వడం ఆనవాయితీ. దానికోసం వాళ్లు మన ఎర్ర బంగారాన్ని ఎంతైనా సరే పెట్టి కొనడానికి ఎగబడతారు. కానీ, ఈ సంపద రాష్ట్ర ఖజానాకు చేరకుండా స్మగ్లర్లు దోచుకుంటున్నారు.

‘పుష్ప’ సిరీస్‌లో అల్లు అర్జున్ లాంటి క్యారెక్టర్‌లు ఎర్రచందనం స్మగ్లింగ్‌ను బాగా హైలైట్ చేశాయి. పుష్ప పుణ్యమా అని… అడవుల్లో చెట్లు నరకడం దగ్గర నుండి షిప్పుల్లో దేశం దాటించే దాకా ఆ సినిమా చూసిన అందరికీ ఒక క్లారిటీ అయితే వచ్చేసింది. అయితే రియల్‌ లైఫ్‌లో ఈ డ్రామా మరింత థ్రిల్లింగా ఉంటుంది. రియల్‌ పుష్పా రాజ్‌లు నడిపించే దందాలో ఎవ్వరికీ తెలీని మరో కోణం ఉంది. పోలీసుల కళ్లుగప్పి స్మగ్లింగ్‌ చేయడమే కాదు… ఒకవేళ పోలీసులకు సరుకు పట్టుబడినా సరే.. మార్కెట్‌లో తమ ఆధిపత్యమే కొనసాగేలా చేయగల స్కిల్‌ ఈ రియల్‌ పుష్పాలది. అందుకు నిదర్శనమే కథనం.

Pushpa Red Sandle: ప్రస్తుతం మనకున్న సమాచారం మేరకు తిరుపతి గోడౌన్లలో 950 టన్నుల ఎర్రచందనం నిల్వలున్నాయి. దీని విలువ అంతర్జాతీయ మార్కెట్‌లో 20 నుండి 25 వేల కోట్లు! ఈ డబ్బుతో అమరావతి రాజధాని నిర్మాణం సాఫీగా సాగిపోతుంది. పోలవరం ప్రాజెక్టు పరుగులు పెడుతుంది. కానీ, ఈ నిల్వలు వేలం వేయాలంటే స్మగ్లర్లు అడ్డుపడుతున్నారు. టెండర్ పిలిచినా, గోడౌన్లలోని సరకు అమ్ముడుపోకుండా.. రాజకీయ ఒత్తిళ్లు, అవినీతి నీలి నీడలు అడ్డుకుంటున్నాయని టాక్. ఎందుకంటే స్మగ్లర్లు కేంద్రం నుంచి రాష్ట్రం వరకు కూడా తమ బలాన్ని విస్తరించారు.

రెడ్ శాండిల్ టాస్క్ ఫోర్స్ ఎంత వేటాడి పట్టుకుంటున్నా, స్మగ్లింగ్ ఆగడం లేదు. శేషాచలంలో రోజూ ఎక్కడో ఒకచోట కొత్త స్మగ్లింగ్ కేసు బయటపడుతోంది. ‘పుష్ప’ సినిమాలో స్మగ్లర్లు పాల లారీలు, కూరగాయల ట్రక్కుల్లో రెడ్ శాండిల్‌ను తరలించే సీన్లు చూశాం. రియల్‌గానూ అంతకు మించిన టెక్నిక్స్ వాడుతున్నారు ఈ దొంగనా డుడుకులు. అంబులెన్స్‌లు, రైస్ బ్యాగ్‌లు, కంటైనర్‌లలో దాచిపెట్టి రెడ్ శాండిల్‌ను విదేశాలకు చేరుస్తున్నారు. రోజుకో కొత్త ప్లాన్‌తో పోలీసులకు చుక్కలు చూపిస్తున్నారు.

Also Read: Waqf Bill: వక్ఫ్ చట్టంపై నిరసనలు హింసాత్మకం..ముగ్గురి మృతి

Pushpa Red Sandle: రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా, స్మగ్లర్లు ఒక అడుగు ముందే ఉంటున్నారు. ఈ స్మగ్లింగ్‌ గేమ్‌లో కింగ్‌ పింగ్స్‌ ఎవరు? పొలిటికల్‌గా వారికి మద్ధతు ఎక్కడ నుండి వస్తోంది? వంటి ప్రశ్నలు రాష్ట్రాన్ని కుదిపేస్తున్నాయి. ఈ నేపథ్యంలో రెడ్ శాండిల్ టాస్క్ ఫోర్స్ అధికారులు ఓ పరిష్కారం సూచిస్తున్నారు. అదేంటంటే… ఒక్కసారిగా 1000 టన్నుల ఎర్రచందనాన్ని గ్లోబల్ మార్కెట్‌లో వేలం వేయాలి! ప్రభుత్వాల నుండే నేరుగా ఎంత కావాలన్నా ఎర్రచందనం కొనుక్కునే మార్గాలుంటే.. ఇక స్మగ్లర్లపై ఆధారపడాల్సి అవసరం చైనా, జపాన్‌ దేశాల వారికి ఉండదు. ఇలా చేస్తే స్మగ్లర్ల మార్కెట్ కుప్పకూలుతుంది. ఒక్క టెండర్‌తో రాష్ట్ర ఖజానాకు వేల కోట్లు వచ్చి పడతాయి. కానీ, ఈ టెండర్లను ఎందుకు ముందుకు తీసుకెళ్లలేకపోతున్నారు? స్మగ్లర్ల లాబీ రాష్ట్రం నుంచి ఢిల్లీ వరకు వ్యాపించిందా? అన్న ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయ్‌.

ఇలా టన్నుల కొద్దీ ఎర్ర చందనం నిల్వలు గోడౌన్లలో మగ్గుతుంటే, స్మగ్లర్లు మాత్రం కోట్లు కొల్లగొడుతున్నారు. ఈ ఎర్రచందనం సంపదను రాష్ట్రం కాపాడుకోవాలంటే, స్మగ్లర్ల ఆటకట్టించాలి. సర్కార్‌ ధైర్యంగా తీసుకునే ఒకే ఒక్క స్టెప్‌… గ్లోబల్ టెండర్… రాష్ట్ర భవిష్యత్తును మార్చేయగలదు. లేదంటే, వేల కోట్ల సంపద స్మగ్లర్ల చేతిలోనే ఆవిరయ్యే ప్రమాదముంది.

 

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *