Pulivendula YCP Future: అందరి నోటా అదే మాట. ఏంటా మాట అంటారా? పులివెందుల పులి బిడ్డ జైలు బోనులోకి వెళ్లడానికి ముహూర్తం ఫిక్స్ అయ్యిందా అని. ఎందుకంటే చెడపకురా చెడేవు అన్న చందంగా తయారయ్యింది వైసీపీ బడా నేతల పరిస్థితి. బీజేపీ నుంచి వైసీపీ దాక.. తాడేపల్లి నుండి పులివెందుల దాకా… ఢిల్లీ నుండి గల్లీ దాకా… ఇప్పుడు ఒక్కటే డిస్కషన్. లిక్కర్‌లో అంతిమ లబ్ధిదారుడి అరెస్టుకు రంగం సిద్ధమైందంటూ అంతా చర్చించుకుంటున్నారు. కల్తీ మద్యంతో ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడింది లిక్కర్ మాఫియా. లిక్కర్ ఒక్కటే కాదు, ల్యాండ్, శాండ్, మైన్స్ ఇలా.. ధనార్జనే లక్ష్యంగా చెలరేగిపోయారు ఐదేళ్ల పాటు. ఫలితంగా ప్రజలు ఆ పార్టీకి 11 సీట్లతో సరిపెట్టారు. అప్పటి నుండి వైసీపీకి అంతటా 11 నంబరే వెంటాడుతోంది. 11 మంది ఎమ్మెల్యేలు, అసెంబ్లీలో 11 నిముషాలు, లిక్కర్ డెన్‌లో 11 కోట్లు. ఒక స్కామ్‌లో ఏకంగా 11 కోట్ల నగదు పట్టుబడటం అంటే మామూలు విషయం కాదు. అందుకే.. ప్రజల ప్రాణాలతో పబ్జి గేమ్ ఆడిన జగన్… జైలు ఊచలు లెక్కబెట్టే రోజులు దగ్గర పడ్డాయంటున్నారు పరిశీలకులు.
Also Read: Peddareddi: డూ ఆర్ డై సిచ్యుయేషన్‌లో తాడిపత్రి పెద్దారెడ్డి
మరి జగన్ అరెస్ట్ అయితే వైసీపీ పరిస్థితి ఏంటి? జగన్ సతీమణి భారతి పార్టీ బాధ్యతలు తీసుకోనున్నారా? ఆ విషయంలో ఇప్పటికే జగన్ ఒక క్లారిటీకి వచ్చారా..? రాష్ట్ర నాయకత్వం సంగతి పక్కన పెడితే… సొంత అడ్డా పులివెందులలో వైసీపీని నడిపించే నాయకుడు ఎవరు? ఇక్కడే వైసీపీ నేత సతీష్ రెడ్డి పేరు తెరపైకి వస్తోంది. ఇప్పటికే పులివెందుల వైసీపీలో సతీష్ రెడ్డి అంతా తానై వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు జగన్ జైలుకు వెళ్తే పులివెందులను పూర్తిగా క్యాప్చర్ చేయడానికి సతీష్ రెడ్డి రెడీ అయిపోయారంటూ టాక్ నడుస్తోంది. ఆయన జగన్ జైలుకు వెళ్తారని చాలా నమ్మకం పెట్టుకున్నారని ఇంటర్నల్ టాక్. దీంతో వైసీపీ క్యాడర్ అలర్ట్ అయ్యి.. పులివెందులలో మాకీ రెడ్డిగారు వద్దు జగనన్నా అంటూ వాపోతున్నారట. ఇలాంటి పరిస్థితులే రాష్ట్ర పార్టీలోనూ కనిపిస్తున్నాయి. దీంతో జగన్ జైలుకు వెళితే పై నుంచి పులివెందుల దాకా పార్టీలో చీలికలు మొదలయినా ఆశ్చర్యం లేదని పరిశీలకులు అంచనా వేస్తున్నారు.