Pulivendula 90 Cr Scam: ఉమ్మడి కడప జిల్లా కమలాపురం నియోజకవర్గంలోని ఆ వైసీపీ నేత తీరే వేరు. కబ్జాలకు కేర్ ఆఫ్ అడ్రస్‌గా మారారు డిప్యూటీ మేయర్ బండి నిత్యానంద రెడ్డి. జగన్ హయాంలో తనదైన శైలిలో కబ్జాలు చేసారు. మేయర్‌ను సైతం విమర్శించి, ఎదరుదాడి చేసి లబ్ది పొందాలని ప్రయత్నాలు చేశారు. బినామీల పేరిట కోట్ల రూపాయల స్థలాలు కబ్జా చేశారు ఈ డిప్యూటీ మేయర్ నిత్యానంద రెడ్డి. గత ప్రభుత్వంలో చూసీ చూడనట్లు వ్యవహరించిన అధికారులు… ఇప్పుడు కూటమి ప్రభుత్వంలోనూ ఎందుకు సైలెంట్‌గా ఉన్నారో అన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Also Read: Bandi Sanjay: ఫోన్ ట్యాపింగ్ కేసులో ట్విస్ట్.. సిట్ విచారణకు కేంద్రమంత్రి బండి సంజయ్!
కమలాపురం నియోజకవర్గం సీకే దిన్నెలో భారీగా భూ కబ్జాలకు పాల్పడ్డారు నిత్యానంద రెడ్డి. మామిళ్లపల్లె గ్రామంలో 727, 738/1, 738/3, 739/1, 740/2, 740/3, 749, 748/2 సర్వే నంబర్లలో ఉన్న ప్రభుత్వ భూమిని సైతం ఆక్రమించేశారు. మామిళ్ళ పల్లెలో సర్వే నెంబర్:727లో ఉన్న 308 ఎకరాలలో డిప్యూటీ మేయర్ చిన్నాన్న ఆదినారాయణ రెడ్డి 30 ఎకరాల మేర ఆక్రమించి రిజిస్ట్రేషన్లు కూడా చేయించుకుని, చెట్లు నాటేశారు. ఇలా గత ప్రభుత్వంలో డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డి కబ్జా లీలలే అన్నీ ఇవ్వీ కాదు. ఈ వైసీపీ నేత ఆగడాలు మితి మీరి పోతున్నా, కట్టడి చేయాలని ప్రజలు కోరుతున్నా అధికారులు మాత్రం సైలెంట్ మోడ్‌లోనే ఉండిపోవడంలో ఆంతర్యం ఏమిటో.. అన్న చర్చ నియోజకవర్గ వ్యాప్తంగా జరుగుతోంది. డిప్యూటీ మేయర్ నిత్యానంద రెడ్డి ఆగడాలను ఇకనైనా నియంత్రించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మొత్తం కబ్జాలపై ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉంది.

