Why not Pulivendula

Why not Pulivendula: నో రిగ్గింగ్‌.. నో ఫ్యాక్షన్‌.. వైసీపీ గెలుపు కష్టమేనా?

Why not Pulivendula: ఆంధ్రప్రదేశ్ లో 2024 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీకి కోలుకోలేని దెబ్బ తగిలిందని చెప్పొచ్చు. 11 సీట్లకే పరిమితం అవ్వడం, ప్రతిపక్ష హోదా కూడా దక్కకపోవడంతో ఆ పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. ఇక ప్రభుత్వం మారాక వరుసగా వివిధ కుంభకోణాల్లో వైసీపీ నేతలు జైలుకు క్యూ కడుతున్నారు. అధికార టిడిపిని ఎదుర్కోలేక నాయకులు చేతులెత్తేస్తున్నారు. ఇక లోకల్ బాడీ ఎన్నికలు వచ్చేసరికి ఆ పార్టీ పరిస్థితి తలచుకుంటేనే క్యాడర్ బెంబేలెత్తుతోందట. అంతకుముందే మాజీ ముఖ్యమంత్రి, పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి నియోజకవర్గంలో ఆ పార్టీ చేతులెత్తేసిందట. ఇక పులివెందుల రూరల్ జెడ్పిటిసి ఎన్నికల్లో టిడిపి విజయం ఖాయం అంటున్నారు కడప తమ్ముళ్లు.

రాయలసీమ జిల్లాలు కడప, కర్నూల్ అంటే వైసిపి కంచుకోటగా భావించేవారు. నేడు అక్కడ నుంచే వైసిపి గ్రాఫ్ తగ్గుతూ పునాదులు కదులుతున్నాయి. కూటమి రాయలసీమ జిల్లాల్లో బలం పెంచుకుంటూ, వైసీపీ కంచుకోటలను బద్దలు కొడుతూ ముందుకు వెళుతోంది. ఉదాహరణ ఎవరూ ఊహించని విధంగా కడప వేదికగా మహానాడును గ్రాండ్ సక్సెస్ చేశారు. కడప గడ్డపై ఈ బలం పసుపు పార్టీకి ఒక్కరోజులో వచ్చిన హైప్‌ ఏమాత్రం కాదు. ఐదేళ్లు గ్రౌండ్‌ లెవెల్‌లో క్యాడర్‌ పడ్డ కష్టం, యువ నాయకుడు నారా లోకేష్ పాదయాత్ర ప్రభావం, అధినేత నారా చంద్రబాబు నాయుడు పర్యటనల ఇంపాక్ట్‌, జిల్లా ఇంచార్జ్‌ మంత్రి సవితమ్మ దగ్గర నుంచి జిల్లా నాయకత్వం కృషి మరువలేనిదని చెబుతున్నారు. ఇప్పుడు ఏకంగా పులివెందుల జెడ్పీటీసీని కైవసం చేసుకోవడానికి పక్కా ప్రణాళికతో విజయం దిశగా దూసుకెళ్తోంది టిడిపి.

Also Read: Ex Deputy CM: మాజీ ఉప ముఖ్యమంత్రి ఇంట్లో దొంగలు పడ్డారు

కొన్ని దశాబ్దాలుగా పులివెందుల అంటేనే వైయస్సార్ కంచుకోటగా పిలవబడుతోంది. పులివెందులలో వైయస్ రాజశేఖర్ రెడ్డి దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి వరకు… లోకల్ బాడీ ఎన్నికల దగ్గర నుంచి ఎమ్మెల్యేలు, ఎంపీల వరకూ ఓటమెరుగని నేతలుగా వారి హవా కొనసాగుతోంది. 1983లో అన్న నందమూరి తారక రామారావు టిడిపి పార్టీని స్థాపించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రభంజనం సృష్టించారు. అయితే కడప జిల్లా పులివెందులలో మాత్రం ఆ ఫలితాలు అందుకోలేకపోయింది పార్టీ. మారుతున్న కాలంతో పాటు రాజకీయ సమీకరణాల నేపథ్యంలో 2024 ఎన్నికల్లో మాత్రం కడప వైయస్సార్ అడ్డాలో టిడిపి జెండా రెపరెపలాడిందని చెప్పవచ్చు. దీనికి ప్రధాన కారణం యువ నాయకుడు నారా లోకేష్ పాదయాత్రతో పాటు చంద్రబాబు నాయుడు వ్యూహాలు అంటున్నారు పరిశీలకులు. కూటమి పార్టీల క్యాడర్ కసితో పనిచేయడంతో.. ఎవరూ ఊహించని విధంగా 10లో ఏకంగా 7 ఎమ్మెల్యే స్థానాలు గెలిచి రికార్డు క్రియేట్ చేశారు. అదే ఊపుతో ఇప్పుడు వై నాట్ పులివెందల అన్న టిడిపి కల సాకారం దిశగా.. అందుకు తొలి అడుగుగా పులివెందుల జెడ్పీటీసీ కైవసం చేసుకోబోతున్నాం అంటున్నారు టిడిపి నాయకులు.

ALSO READ  ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో గాలిలో పల్టీకొట్టిన కారు.. మహిళ మృతి 

పులివెందులలో ఏ ఎన్నిక అయినా సరే.. కొన్ని చోట్ల వైసీపీ నేతలు సాంప్రదాయంగా రిగ్గింగ్‌కి పాల్పడటం జరుగుతుంది. ఇక స్థానిక సంస్థల ఎన్నికల్లో అయితే 99 శాతం ఏకగ్రీవాలే ఉంటాయి. పోటీగా నామినేషన్లు వేసే సాహసం కూడా చేయరు. కానీ అదంతా గతం. దశాబ్దాల తర్వాత ఇప్పుడు పులివెందులలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరుగుతున్నాయి. జెడ్పీటీసీ ఎన్నికల్లో టీడీపీ సహా, వైసీపీ, కాంగ్రెస్‌, ఇండిపెండెంట్లు సైతం స్వేచ్ఛగా నామినేషన్లు వేశారు. ఎన్నికలలో ఎవరైనా యథావిధిగా అక్రమాలకు తెగబడితే తాట తీసేందుకు పోలీసులు సిద్ధంగా ఉన్నారట. ఈ నేపథ్యంలో టీడీపీ గెలుపు నల్లేరుపై నడకే అన్న టాక్‌ వచ్చేసిందట ఇప్పటికే. అయితే టిడిపి విజయాన్ని ఎలాగైనా అడ్డుకోవాలని వైసిపి సాయశక్తులా విశ్వ ప్రయత్నాలు చేస్తోందట. వైసీపీ ప్రయత్నాలను తిప్పికొడుతూ టీడీపీ మాస్ లీడర్ బీటెక్‌ రవితో పాటు ఇంచార్జ్‌ మంత్రి సవితమ్మ, స్థానిక నేతలు గట్టిగా ఫైట్ చేస్తుండటంతో వైసీపీ ఆటలు సాగటం లేదని టాక్ వినిపిస్తోంది.

ఆగస్టు 12వ తేదీన పులివెందుల జెడ్పీటీసీ ఎన్నిక జరగబోతోంది. 14వ తేదీ ఫలితాలు రానున్నాయి. అంటే ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవానికి ఒక రోజు ముందే పులివెందులలో పెద్ద ఎత్తున సంబరాలు చేయడానికి సిద్ధమవుతున్నారంట తెలుగు తమ్ముళ్లు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *