Political Emergency for Jagan

Political Emergency for Jagan: జగన్‌ జెట్‌ స్పీడ్‌లో తాడేపల్లికి ఎందుకొచ్చారో తెలుసా?

Political Emergency for Jagan: ఆంధ్రప్రదేశ్‌ గతంలో చూడని భీకర తుపాన్‌ మొంథా. ఏకంగా 22 జిల్లాలను కవర్‌ చేసింది ఈ తుపాన్‌. ‘మొంథా’ రాకాసి వచ్చింది.. పోయింది. కానీ ఎక్కడా మరణాలు లేవు.. ఆర్తనాదాలు లేవు. కళ్ల ముందే వాహనాలు కొట్టుకుపోయే సీన్లు లేవు. ఊళ్లకు ఊళ్లు ప్రజలు నీట చిక్కుకున్న పరిస్థితులు లేవు. హెలీకాఫ్టర్ల నుంచి ఫుడ్‌ ప్యాకెట్లు విసిరేసే దృశ్యాలు లేవు. పక్కా ప్రొఫెషనల్‌గా రచించుకున్న ముందస్తు ప్రణాళికతో ‘మొంథా’ను ధీటుగా ఎదుర్కొన్నది ఆంధ్రా. ఇందుకోసం మూడంచెల ఫార్ములాని అమలు చేసింది ప్రభుత్వం. ఫస్ట్‌ స్టేజ్‌లో తుఫాన్‌ తీవ్రత, ప్రభావిత ప్రాంతాల గుర్తించారు. ప్రజల్ని ముందస్తుగానే సురక్షిత ప్రాంతాలకు తరలించారు. రెండో స్టేజ్‌లో తుఫాన్‌ని ఫర్పెక్ట్‌గా మానిటరింగ్‌ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా టీమ్‌లని సమన్వయం చేసుకోవడంలో సఫలీకృతమయ్యారు. థర్డ్‌ స్టేజ్‌లో ఫీల్డ్‌లో తక్షణ సహాయ కార్యక్రమాలు చేపట్టారు. ఫలితంగా మరణాలు లేవు, ఏ ఒక్కరికీ ఇబ్బందులు లేవు. గవర్నమెంట్ ప్లాన్‌ ఆఫ్‌ యాక్షన్‌కి ప్రతిఒక్కరూ ఫిదా అవుతున్నారు!

Also Read: Pawan Kalyan: రైతులకు భరోసా.. మొంతా తుఫాన్ కు దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలిస్తున్న పవన్

మొంథా తుపాన్‌పై ఆర్టీజీఎస్‌ మంత్రి నారా లోకేష్‌ ఒక రకంగా యుద్ధమే చేశారు. రౌండ్‌ ద క్లాక్‌ అన్నట్లుగా 24 గంటలూ వార్‌ రూమ్‌కే పరిమితం అయ్యారు. అర్థరాత్రి తర్వాత చంద్రబాబు, పవన్‌లు వెళ్లిపోయినా కూడా రాత్రంతా మానిటరింగ్‌ కొనసాగించారు మంత్రి లోకేష్‌. ఎక్కడ సమస్య ఉన్నట్లు తెలిసినా వెంటనే అక్కడి నేతల్ని, అధికారుల్ని వెంటనే అలర్ట్‌ చేశారు. 24 గంటల పాటు నిర్విరామంగా లోకేష్‌ నడిపించిన భారీ యంత్రాంగాన్ని చూస్తే.. ఆయన సామర్థ్యం తెలుస్తుంది. ముంపుకు ఆస్కారమున్న 1328 గ్రామాలను ఖాళీ చేయించారు. నెలలు నిండిన 3465 మంది గర్బిణీలను సేఫ్‌గా ఆస్పత్రుల్లో చేర్పించేశారు. 1906 తాత్కాలిక శిబిరాలకు సహాయ సామాగ్రి పంపిణీ చేశారు. 14,798 పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. వాటిలో 364 సూళ్లను తుపాను రక్షిత కేంద్రాలుగా మార్చారు. 11 ఎన్డీఆర్‌ఎఫ్‌, 12 ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలతో పాటూ రిజర్వ్‌ టీములను రంగంలోకి దించారు. 876 ర్యాపిడ్‌ రెస్పాన్స్ బృందాలు పనిచేశాయి. కూలిన చెట్లను క్లియర్‌ చేయడానికి 145 బృందాలు గ్రౌండ్‌లోకి దిగిపోయాయి. 11,347 విద్యుత్ స్తంభాలు, 1210 ట్రాన్ఫర్మర్లతో విద్యుత్‌ శాఖ సిబ్బందిని ముందస్తుగా సిద్ధం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 772 పునరుద్ధరణ బృందాలను తుపాను గమనాన్ని బట్టి మొహరించారు. రోడ్ల క్లియరెన్స్‌కు 7,289 ప్రొక్లెయినర్లు, క్రేన్లు సిద్ధం చేశారు. కరెంట్, తాగునీటి అంతరాయం లేకుండా 1037 డీజిల్‌ జనరేటర్లను ఏర్పాటు చేశారు. ఇలాంటి అతిపెద్ద డిజాస్టర్‌ మేనేజ్మెంట్‌ టీమ్‌కి లోకేష్‌ సమర్థ సారథ్యం వహించారు.

మొంథా మొత్తం ముంచేస్తే.. ఆ తర్వాత జగన్‌ బెంగళూరు నుండి నెమ్మదిగా వచ్చినా చేసుకునేందుకు బోలెండంత రాజకీయం ఉండేది, అందుకు స్కోప్‌ కూడా ఉండేది. కానీ జగన్‌ అంచనాలు తల్లకిందులైనట్లు అనుకోవాలి. లేకుంటే ఆయన అంత హడావుడిగా బెంగళూరు నుండి ఆంధ్రా వచ్చేవారు కాదు. పరామర్శలు చేసుకునేందుకు ఎక్కడా మరణాలు లేవు. గగ్గోలు పెట్టి, ప్రభుత్వంపై విమర్శలు చేయడానికి ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగలేదు. పునరావాస కేంద్రాల్లో అంతా సురక్షితంగా, అన్ని వసతులతో రక్షణ పొందారు. ఇంకో రెండ్రోజుల్లో మొత్తం సెట్‌ రైట్‌ అయ్యాక.. జగన్‌ వచ్చి ఉంటే పూర్తిగా అభాసుపాలయ్యేవారు. దీంతో ఆయన బుధవారమే తాడేపల్లిలో దిగిపోయారు. జగన్‌ రాజకీయాలు ఊహాతీతంగా ఉంటాయి. మొంథా తుపాన్‌ మీద ఇప్పుడు ఆయన చేయడానికి ఏమీ లేదు. అయినా ఏదో ఒకటి చేయకుండా ఉండరు. జగన్‌ ఏం చేస్తారన్నది మరో రెండ్రోజులు ఆగి చూడాల్సిందే.

 

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *