Pogaku Parchur MLA: పర్చూరు నియోజకవర్గం అంటేనే రైతాంగం అనే గుర్తింపుంది. 90 శాతం పైగా రైతు కుటుంబాలు ఉండే ఈ నియోజకవర్గంలో అత్యధిక మంది ప్రజలది మధ్య తరగతి జీవనమే. వ్యవసాయం, నల్ల బర్లీ పొగాకు పంటలకు ప్రసిద్ధి చెందిన ఈ ప్రాంతంలో రైతాంగ సమస్యలపై స్పష్టమైన అవగాహన ఉన్న నాయకుడు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు. స్వతహాగా రైతు కుంటుంబం, మధ్య తరగతి జీవనం నుండి వచ్చిన వాడు కావడంతో.. రైతులన్నా, రైతుల సమస్యలన్నా అందరికన్నా ముందుంటారు ఏలూరి సాంబశివరావు. రైతులకు స్పష్టమైన అవగాహన కల్పిస్తూ, వారి సమస్యలకు సమర్థవంతమైన పరిష్కారాలు చూపుతూ… పర్చూరు ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్న నాయకుడని చెప్పొచ్చు. 2014, 19, 24 ఎన్నికల్లో ఏలూరి వరుస విజయాలు.. ఆయన పనితనానికి మెచ్చి ప్రజలిచ్చిన బహుమానాలుగా చెప్పక తప్పదు.
పర్చూరు నియోజకవర్గంలో ప్రతి గ్రామ సరిహద్దు ఎమ్మెల్యే ఏలూరికి కొట్టిన పిండి. ప్రతి కార్యకర్తను పేరుపెట్టి పిలిచే సాన్నిహిత్యం ఆయనది. చిన్నా, పెద్దా తేడా లేకుండా ప్రతి సమస్యను పరిష్కరించే తపనతో నడిచే నాయకుడు. పర్చూరులో 90కి పైగా గ్రామాలుంటే.. చుట్టుపక్కల ప్రాంతాలతో కలిపి.. ఈ ఏరియాలో మొత్తం 65 వేల ఎకరాల్లో బర్లీ పొగాకు పంటలే సాగవుతాయి. కానీ, గత కొంతకాలంగా పొగాకు రైతులు తీవ్ర కష్టాలు ఎదుర్కొన్నారు. సరైన మద్దతు ధర లేక, కంపెనీలు క్వింటాకు 5 వేల నుంచి 7 వేల వరకు మాత్రమే చెల్లించడంతో రైతులు నష్టాల సుడిగుండంలో చిక్కుకున్నారు. ఈ సమస్యను తన సొంత సమస్యగా భావించిన ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు, రైతుల్ని గట్టెక్కించే పరిష్కారం కోసం తపనతో కృషి చేశారు. ఒక్కొక్క పొగాకు రైతు కన్నీటి కథలను స్వయంగా తెలుసుకున్న ఏలూరి… సమస్య తీవ్రతను ముఖ్యమంత్రి చంద్రబాబు, వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు దృష్టికి తీసుకెళ్లారు. వ్యవసాయ శాఖ అధికారులతో సమీక్షలు జరిపి, పొగాకు కొనుగోలు కంపెనీల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించారు. రాష్ట్ర చరిత్రలో మొదటిసారిగా మార్క్‌ఫెడ్ ద్వారా పొగాకు కొనుగోలు చేసే విధంగా ప్రభుత్వాన్ని ఒప్పించారు.
Also Read: Railway Track Incident: రైల్వే ట్రాక్‌పై కారు నడుపుతున్న మహిళ.. నిలిచిపోయిన రైలు
Pogaku Parchur MLA: ఎమ్మెల్యే ఏలూరి కృషి ఫలితంగా.. ఇప్పుడు చీరాల, పర్చూరులలో ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటయ్యాయి. క్వింటా బర్లీ పొగాకుకు 12 వేల రూపాయల కనీస మద్ధతు ధర ప్రకటించిన ప్రభుత్వం.. పొగాకు చివరి ఆకు వరకూ కొంటామని భరోసా ఇచ్చింది. చెప్పిన 24 గంటల్లోనే రూ.273 కోట్ల నగదు రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ అయింది. ఇది మా ఎమ్మెల్యే ఏలూరి రెండు నెలల కృషికి, మాకు దక్కిన ప్రతిఫలం అంటున్నారు పర్చూరు ప్రాంత పొగాకు రైతులు. అలా ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు స్పందన, చొరవ పొగాకు రైతుల మొహంలో చిరునవ్వులు తెచ్చింది. పొగాకు రైతుల పరామర్శ పేరిట జగన్ బలప్రదర్శన చేస్తే… ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు మాత్రం సమస్య పరిష్కారానికి పక్కా ప్రణాళికతో ముందుకెళ్లారు. నిజానికి పొగాకు రైతుల సమస్యపై జగన్ పర్యటనకు చాలా రోజుల ముందు నుండే ఏలూరి సాంబశివరావు స్ట్రాటజికల్‌గా ఈ సమస్య పరిష్కారానికి పని మొదలు పెట్టారు. మా హయాంలో “రైతు రాజులా బతకాలి” అన్న కూటమి ప్రభుత్వ పెద్దల మాటలకు ఏలూరి కృషి అద్దం పడుతోంది. రైతు సమస్య అంటే చాలు అందరి కన్నా ముందుంటూ, రైతు క్షేమమే తన ధ్యేయంగా ముందుకు సాగుతున్న ఏలూరి సాంబశివరావు, పర్చూరు రైతాంగానికి నేడు ఆపద్భాందవుడిలా నిలిచారు.

