Pemmasani Records

Pemmasani Records: శ్రీమంతుడే కాదు ప్రజాసేవలో పనిమంతుడు కూడా..

Pemmasani Records: సహజ శైలిలో వెటకారం చేద్దామనుకున్నారో, లేక మనసులో మాట అనుకోకుండా బయటకు తన్నుకొచ్చేసిందో తెలీదు కానీ… అంబటి రాంబాబు వంద శాతం కరెక్టుగానే చెప్పారు. ఎస్‌… కుబేరుడే కాదు.. ఆ స్థాయికి స్వయంశక్తితో చేరుకున్న మేధో సంపత్తి ఉన్న వ్యక్తి పెమ్మసాని చంద్రశేఖర్. గుంటూరు ఎంపీగా చంద్రబాబు ఏరి కోరి ఎంపిక చేసిన అభ్యర్ధి. విదేశాల్లో ఉంటూ గుంటూరుకు రావడమే… పెమ్మసాని చంద్రశేఖర్ అనే నేను… అంటూ ల్యాండ్‌ అయ్యారు. అదే.. అసలు ఎవరీ పెమ్మసాని చంద్రశేఖర్‌ అనే చర్చకు కారణమైంది. ఇక, ఎన్నికల్లో ఎక్కడా తొలిసారి పోటీ చేస్తున్న ఫీలింగ్ లేకుండా… అందరినీ కలుపుకుపోతూ… గుంటూరు గడ్డ నుంచి ఘన విజయం సాధించారు. చంద్రబాబుకు చంద్రశేఖర్‌పైన ఉన్న నమ్మకంతో మోదీ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా అవకాశం దక్కింది. ఇక.. ఎక్కడా ఆగలేదు. కేంద్ర మంత్రిగా ఉంటూనే.. సొంత నియోజకవర్గంలో తన మార్క్ ఏంటో నిరూపించుకుంటున్నారు. నిరంతర సమీక్షలు.. నిధుల సమీకరణ బాధ్యత తానే తీసుకొని… కేంద్రం – రాష్ట్రం నుంచి కావాల్సిన విధంగా వనరులు, అనుమతులు సాధించారు. దశాబ్దాల కాలంగా పరిష్కారం కాని సమస్యలపైన ఫోకస్ చేశారు. గతంలో ఏ ఎంపీ చేయని విధంగా ప్రతీ అంశాన్ని గ్రౌండ్ లెవల్‌లో మానిటర్ చేస్తూ శాశ్వత పరిష్కారానికి పూనుకుంటున్నారు.

పార్లమెంట్ పరిధిలో సమస్యల పరిష్కారంతో పాటుగా.. సామాన్యులు, పార్టీ శ్రేణుల కోసం తన కార్యాలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేసారు. ఎవరికి ఏ సమస్య ఉన్నా అర్జీలు స్వీకరిస్తున్నారు. ఆ సమస్య పరిష్కారం వరకు… వారికి ఆ ఫిర్యాదు ఏ స్థాయిలో ఉందో, ఏం జరుగుతుందో ఎప్పటిక ప్పుడు మెసేజ్ ద్వారా సమాచారం ఇస్తున్నారు. గత నాయకుల కంటే భిన్నంగా.. ఎంపీ అంటే ఇలా ఉండాలి అనే విధంగా సామాన్యుల మనసులను గెలుచుకున్నారు. పెమ్మసాని పని తీరు చూస్తే అసలు రాజకీయాలకు కొత్త అనే అనుమానమే రాదు. ఉన్నత విద్యావంతుడు కావటంతో పాటుగా, అంతకు మించి మంచి చేయాలనే తపన ఆయన ఇమేజ్ పెంచుతోంది. తక్కువ సమయంలోనే కేంద్రంలోని ప్రధాన శాఖలతో సత్సంబంధాలు ఏర్పరుచుకున్నారు. దాంతో గుంటూరుకు కేంద్ర నిధుల వరద కొనసాగుతోంది. అభివృద్ధిలో ఏడాది కాలంలోనే గుంటూరు రూపు రేఖలు మారుతున్నాయి.

Also Read: Bandi sanjay: బనకచర్ల ప్రాజెక్టు విషయంలో తెలంగాణకు అన్యాయం జరగనివ్వం

Pemmasani Records: ఇతరులతో పోల్చితే పెమ్మసాని అందరి కంటే అగ్ర స్థానంలో ఉన్నారు. అభివృద్ధిలోనే కాదు.. ప్రజాదరణలోనూ పెమ్మసానికి పోటీ లేకుండా పోయింది. ప్రతిపక్షాలు సైతం విమర్శించలేని విధంగా పెమ్మసాని అభివృద్ధిలో దూసుకుపోతున్నారు. ఇక.. గుంటూరు పార్లమెంట్‌కు ఎన్నో ప్రాజెక్టులకు ఆమోద ముద్ర వేయించారు. ప్రతీ ప్రాజెక్టు పైన ఎక్కడ ఉన్నా సమీక్ష చేస్తారు. పనుల విషయంలో రాజీ పడటం ఉండదు. కేంద్ర నిధులలో వైద్యం, టూరిజం, రోడ్లు, రైల్వే, అర్బన్ డెవలప్మెంట్ ఇలా ఎన్నో శాఖల నుంచి నిధులు మంజూరు చేయించారు. గుంటూరులో ఎంతో కాలంగా పెండింగ్‌లో ఉన్న శంకర్ విలాస్ ఆర్వోబీ గురించి చాలా మంది మాటలు చెప్పటం మినహా ఎలాంటి ప్రయత్నం చేయలేదు. పెమ్మసాని రూ.98 కోట్ల కేంద్ర నిధులు తేవటంతో పాటుగా ఇప్పటికే పనులు ప్రారంభించారు. యుద్ద ప్రాతిపదికన పనులు కొనసాగుతున్నాయి.

ALSO READ  Pawan Kalyan Konidela: ఇంటిపేరు నిలబెట్టిన కొణిదెల పవన్‌ కళ్యాణ్‌

ఇక, ప్రతిపాడులో వంద పడకల ఈఎస్ఐ ఆస్పత్రి కోసం కేంద్రం నుంచి వంద కోట్ల రూపాయల నిధులు రప్పించారు. గండికోట డెవలప్మెంట్ కోసం టూరిజం శాఖ నుంచి రూ.77.91 కోట్ల నిధులు వచ్చేలా చేసారు. గడిపాడు ఆర్వోబీ కోసం రైల్వే శాఖ నుంచి రూ.107.79 కోట్లు మంజూరు చేయించారు. పెదపలకలూరు ఆర్వోబీ కోసం రైల్వే నుంచి మరో రూ.41 కోట్లు మంజూరు చేయించటంలో పెమ్మసాని సక్సెస్ అయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి గుంటూరు ఛానల్ కోసం రూ.400 కోట్లకు ఆమోదం దక్కేలా చేసారు. కేంద్రం నుంచి పీఎంజీఎస్‌వై కింద ఏపీకి రూ.223 కోట్లు వస్తే.. గుంటూరుకు రూ.143 కోట్లు దక్కేలా చూశారు. నందివెలుగు ఆర్వోబీ కోసం రూ.36.91 కోట్లు మంజూరు అయ్యాయి. మంగళగిరి ఆర్వోబీ కోసం రూ.129.18 కోట్లు మంజూరు చేయించారు.

Also Read: Hyderabad: మాజీ ఈఎన్సీ పై రైడ్… కోట్ల విలువ చేసే ఆస్తులు

Pemmasani Records: అదే విధంగా.. సూర్యలంక బీచ్ డెవలప్మెంట్ కోసం కేంద్ర టూరిజం శాఖ నుంచి రూ.97.52 కోట్లు మంజూరు చేసిన ఘనత పెమ్మసానికే దక్కుతుంది. మంగళగిరి ఏయిమ్స్‌లో అవసరమైన సిబ్బంది నియామకంపైన పెమ్మసాని చొరవ తీసుకున్నారు. ఇందు కోసం కేంద్రం నుంచి 534 పోస్టులకు అనుమతి వచ్చేలా చేసారు. కేంద్ర అమ్రుత్ పథకంలో భాగంగా గోరంట్లలో మంచినీటి పైపు లైన్ల కోసం కేంద్రం హౌసింగ్ అండ్ అర్బన్ వ్యవహారాల శాఖ నుంచి రూ.362.23 కోట్లు మంజూరు చేయించి తన సత్తా ఏంటో నిరూపించారు పెమ్మసాని. ఇక.. తన సొంత ట్రస్ట్ ద్వారా పల్నాడు ప్రాంతంలో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. రాజకీయంగా వివాద రహితుడుగా ఉంటూ కేవలం పెమ్మసాని అంటే డెవలప్మెంట్ అనే బ్రాండ్‌గా నిలిచారు.

ప్రతిపక్షాలు సైతం విమర్శించటానికి సాహసం చేయలేని విధంగా పెమ్మసాని పని తీరు ఉంది. సామాన్యులు కోరుకునే నిజమైన నాయకుడు గుంటూరుకు దొరికాడని అందరూ అంగీకరించే మాట. నిజమైన శ్రీమంతుడుగా నిలుస్తున్న పెమ్మసాని బ్రాండ్ మాత్రం దశాబ్దాల కాలం పాటు నిలిచిపోతుంది. ఇక చివరగా.. మహాన్యూస్‌ సీఎండీ వంశీ కృష్ణ మారెళ్లకు గెలవక ముందు ఇచ్చిన ఇంటర్వూలో పెమ్మసాని చంద్రశేఖర్‌ ఏమని చెప్పారో ఒకసారి చూడండి.

అదీ సంగతి. గెలవక ముందే తాను ఎందుకంత కాన్ఫిడెంట్‌గా చెప్పగలిగాడో.. గెలిచాక ఆయన స్పీడు, చేస్తున్న పనులు, చూస్తున్న వారికి ఈపాటికే క్లారిటీ వచ్చేసి ఉంటుంది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *