Peeleru in Iso Race

Peeleru in Iso Race: ఐఎస్వో సర్టిఫికెట్ పోటీలో పీలేరు పంచాయతీ

Peeleru in Iso Race: ఐఎస్వో – ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ స్టాండర్డైజేషన్… అనేక అంశాలను పరిగణలోకి తీసుకుని ఆ సంస్థ వారు ఆ సర్టిఫికెట్ను అందిస్తారు. ఆ సర్టిఫికెట్ పొందిన సంస్థలకు రాష్ట్ర, కేంద్ర, అంతర్జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. ఐఎస్వో సర్టిఫికెట్ సాధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో రెండు గ్రామ పంచాయతీలను పైలెట్ ప్రాజెక్టులుగా ఎంపిక చేసింది. అలా అన్నమయ్య జిల్లాలోని కోడూరు, పీలేరు గ్రామ పంచాయతీలను జిల్లా పంచాయతీ అధికారులు ఎంపిక చేశారు. ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా పీలేరు గ్రామ పంచాయతీ అధికారులు గడిచిన 20 రోజులుగా ఐఎస్వో నిబంధనల మేరకు తమ కార్యాలయాన్ని ఆధునికీకరిస్తున్నారు. ఏళ్లుగా నాటుకుపోయిన పాత పద్ధతులను వదిలించుకుని, పంచాయతీ కార్యాలయానికి కార్పొరేట్ తరహా సొబగులు అద్దుతున్నారు.

ఐఎస్వో సర్టిఫికేషన్లతో అనేక ప్రయోజనాలున్నాయి. ఐఎస్వో ప్రమాణాలు ఆయా సంస్థల నాణ్యత, నిర్వహణ వ్యవస్థలను అభివృద్ధి చేయడంలో సహాయపడతాయి. ఐఎస్వో ధ్రువీకరణలు ఆయా సంస్థల పనితీరును మెరుగుపరుస్తాయి. అవి సమర్థవంతంగా పనిచేసేలా చేస్తాయి. ఆయా సంస్థల విశ్వసనీయత, వాటిపై ప్రజల నమ్మకాన్ని మెరుగుపరుస్తాయి. ఐఎస్వో ధ్రువీకరణలు పొందిన స్థానిక సంస్థలకు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు అదనపు నిధులు కేటాయించి వాటిలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడతాయి. అంతటి కీలకమైన ఐఎస్వో సర్టిఫికేషన్ సాధన కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక కేరళ ఇన్స్టిట్యూట్ ఆఫ్ లోకల్ అడ్మినిస్ట్రేషన్‌ను నియమించుకుంది. ఆ సంస్థ ప్రతినిధులు రాష్ట్రంలోని 52 పైలెట్ పంచాయతీలలో పర్యటించి ఐఎస్వో సర్టిఫికెట్ సాధన కోసం ఆయా పంచాయతీల్లో చేపట్టాల్సిన మార్పులు, చేర్పులు, కార్యాలయాల నిర్వహణ, సిబ్బంది పనితీరు, ప్రజలకు అందించాల్సిన వివిధ సేవల గురించి గత రెండు నెలలుగా అవగాహన, శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ ప్రక్రియను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ మంత్రి పవన్ కళ్యాణ్, రాష్ట్ర పంచాయతీరాజ్ ఓఎస్‌వో కృష్ణతేజ ప్రత్యేకంగా పర్యవేక్షిస్తుండడంతో 52 పంచాయతీల్లో ఐఎస్వో సర్టిఫికేషన్ పనులు చురుగ్గా సాగుతున్నాయి.

Also Read: MP Chamala Kiran Over: సూడో సెక్యులరిజం అనగానే వారికి ఉలికిపాటెందుకు?

Peeleru in Iso Race: రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ మంత్రి పవన్ కళ్యాణ్ ఆలోచనలకు అనుగుణంగా ఐఎస్వో సర్టిఫికేషన్ సాధించేందుకు ప్రతిష్టాత్మకంగా పనులు చేస్తున్నామని చెప్పారు పీలేరు పంచాయతీ ఈవో గురుమోహన్‌. గ్రామ పంచాయతీ కార్యాలయంలో కార్పొరేట్ తరహా సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు. అందులో భాగంగా కార్యాలయానికి వచ్చే ప్రజల కోసం వెయిటింగ్ రూము, హెల్ప్ డెస్క్, వివిధ సేవల సిటిజన్ చార్టర్, ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు, మరుగుదొడ్లు, చంటి పిల్లల తల్లులకు ప్రత్యేక గదులు, రికార్థుల ఆన్లైన్ నిర్వహణ, నిర్దేశిత సమయంలో సేవలు అందించే విధానం, కార్యాలయంలో ఆహ్లాదకర వాతావరణం ఉండేలా మొక్కల పెంపకం వంటివి చకాచకా ఏర్పాటు చేస్తున్నారు. ఇక ఐఎస్వో సర్టిఫికేషన్ కోసం జరుగుతున్న పనులను పర్యవేక్షించి లోటుపాట్లు తెలియజేసేందుకు పీలేరుకు త్వరలోనే కిలా బృందం రానుంది. వారు సూచించిన మార్పులు, చేర్చులు చేసుకున్న తరువాత ఐఎస్వో బృందం పీలేరు గ్రామ పంచాయతీని పరీక్షించి సర్టిఫికేషన్ జారీ చేసే అవకాశం ఉంది.

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *