Pawan Warns Pak

Pawan Warns Pak: మోడీ దృష్టికి పవన్‌ కళ్యాణ్‌ సంచలన స్టేట్మెంట్‌!

Pawan Warns Pak : జమ్మూ కశ్మీర్‌లోని పహల్గాం ఉగ్రదాడి దేశాన్ని కలచివేసిన వేళ, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన దేశభక్తి, దాతృత్వంతో మరోసారి ప్రజల హృదయాలు గెలిచారు. ఈ కిరాతక దాడిలో 26 మంది అమాయక పర్యాటకులు ప్రాణాలు కోల్పోగా, నెల్లూరు జిల్లాకు చెందిన మధుసూదన్‌రావు కూడా అమరుడయ్యారు. ఈ దుర్ఘటనపై తీవ్ర ఆవేదన, ఆగ్రహం వ్యక్తం చేసిన పవన్, మంగళగిరిలో జనసేన ఆధ్వర్యంలో సంతాప సభ నిర్వహించి అమరులకు నివాళులర్పించారు. మధుసూదన్ కుటుంబానికి వ్యక్తిగతంగా, పార్టీ తరఫున కలిపి రూ.55 లక్షలు ఆర్థిక సాయం ప్రకటించి తన మానవత్వాన్ని చాటారు. మధుసూదన్ ఎవరికీ హాని చేయలేదనీ, కశ్మీర్ చూసేందుకు కుటుంబంతో వెళ్లి దారుణ హతకు గురయ్యారనీ ఆవేదన వ్యక్తం చేశారు పవన్‌.

పవన్ కళ్యాణ్ మాటల్లో దేశభక్తి జ్వాలలు స్పష్టంగా వ్యక్తమయ్యాయి. కశ్మీర్ ఎప్పటికీ భారత్‌దేనన్న పవన్‌.. పాకిస్థాన్‌ను మూడుసార్లు ఓడించిన చరిత్ర భారత్‌ది అని గుర్తు చేశారు. ఉగ్రవాదులను ప్రోత్సహించే పాకిస్థాన్ కారణంగా వందలాది కశ్మీరీ పండిట్లు మృతిచెందారనీ, వేలాది మంది వలసపోయారనీ ఆవేదన వ్యక్తం చేశారు పవన్‌. పహల్గాంలో ఉగ్రవాదులు పర్యాటకుల ఐడీ కార్డులు తనిఖీ చేసి, మతం అడిగి అమాయకులను కాల్చిచంపిన దారుణాన్ని తీవ్రంగా ఖండించారు. ఇలాంటి కిరాతకులపై జాలి చూపాల్సిన అవసరం లేనే లేదన్నారు. భారత్ సంయమనం పాటిస్తోందనీ, కానీ ఈ సంయమనం ఎంతవరకు? అనేలా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక పాకిస్థాన్‌కు, దాని సానుభూతిపరులకు పవన్ ఘాటు వార్నింగ్ ఇచ్చారు. భారత్‌లో ఉంటూ, ఇక్కడి తిండి తిని పాకిస్థాన్‌కు వంత పాడేవారు ఆ దేశానికే వెళ్లిపోవాలని ఆగ్రహావేశంతో నిప్పులు చెరిగారు. సెక్యులర్ పేరుతో నిజాన్ని కప్పిపుచ్చే కొన్ని రాజకీయ పార్టీలు, సోకాల్డ్ ఇంటలెక్చువల్స్‌పై కూడా పవన్‌ విమర్శలు గుప్పించారు. 26 మందిని మతం అడిగి చంపినా పాకిస్థాన్‌కు మద్దతిస్తారా? ఓట్ల కోసం, సీట్ల కోసం దేశ భద్రతతో చెలగాటమా? అంటూ ప్రశ్నించారు. ఉగ్రవాదంపై ఐక్యంగా పోరాడాలని, దేశ సమగ్రతను కాపాడాలని పిలుపునిచ్చారు డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌.

Also Read: Narendra Modi: భారత్-పాక్ ఉద్రిక్తతల వేళ ప్రధాని మోదీ కీలక భేటీ..

Pawan Warns Pak : పాకిస్థాన్‌ యుద్ధమే కోరుకుంటే… భారత్‌ తప్పని సరిగా యుద్ధమే ఇస్తుందనీ, వారు రక్తమే పారాలని కోరుకుంటే.. రక్తం చిందించేందుకు తామంతా సిద్ధంగా ఉన్నామని, కానీ ఇప్పుడున్న భారత్ వేరని పాక్‌ తెలుసుకోవాలని హెచ్చరించారు పవన్‌ కళ్యాణ్‌. హిందువులకు ఉన్న దేశం ఇదొక్కటేనని.. ఇక్కడ కూడా టార్గెట్ చేస్తే ఎక్కడికి పోవాలని ఆవేదనతో అన్నారు. “If you love Pakistan so much, then LEAVE India and go live there. There is no need to STAY in India and love Pakistan” అంటూ పవన్‌ ఇచ్చిన స్టేట్మెంట్. సోషల్ మీడియాని కుదిపేస్తోంది. పవన్ వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయ్‌. ఈ స్టేట్‌మెంట్‌ ప్రధాని మోడీ దృష్టికి వెళ్లడంతో పాటూ… పలు హిందూ సంఘాల హర్షం వ్యక్తం చేస్తూ, ప్రశంసలు కురిపిస్తున్నాయి.

ALSO READ  BRS Counter to Budget: రక్తకన్నీరు సినిమాలో నాగభూషణం డైలాగ్‌లా భట్టి పద్దు!

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *