Pawan On Yuvagalam

Pawan On Yuvagalam: ఆనాటి నుండి మొదలైన పవన్‌-లోకేష్‌ల మైత్రి..

Pawan On Yuvagalam: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏపీ సీఐడీ చేతిలో అక్రమంగా అరెస్ట్‌ అయ్యి రాజమండ్రి సెంట్రల్‌ జైల్లో ఉన్న సమయమది. వైసీపీ ప్రభుత్వం సృష్టించిన ఎన్నో అవాంతరాలను దాటుకుని వచ్చి.. జైల్లో రిమాండ్‌ ఖైదీగా ఉన్న చంద్రబాబును పరామర్శించారు జనసేనాని పవన్‌ కళ్యాణ్‌. చంద్రబాబుతో ఆయన ఏం చర్చించారన్నది పక్కన పెడితే.. బయటకొచ్చి చేసిన ప్రకటన ఏపీ రాజకీయాల్లో పెను సంచలనం. అప్పుడు పవన్‌ కళ్యాణ్‌ పక్కన నిలుచుని ఆ ప్రకటనను స్వాగతించింది నారా లోకేష్‌.

ఆనాటి నుండి మొదలైన పవన్‌-లోకేష్‌ల మైత్రి.. అన్నదమ్ముల బంధంగా కొనసాగుతూ.. పాలనకు జోడుగుర్రాల్లా మారి.. కూటమి ఏడాది పరిపాలనపై బలమైన ముద్ర వేసింది. కూటమి ఘన విజయానికి ఏడాది పూర్తయిన సందర్భంగా నేడు శ్రేణులు ప్రజలతో కలిసి సంబరాలు జరుపుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో పవన్‌-లోకేష్‌ల అపూర్వ కలయిక ఆ సంబరాలను రెట్టింపు చేస్తోంది.

పవన్‌ కళ్యాణ్‌ – నారా లోకేష్‌.. ఈ ఇద్దరు ఎక్కడ తారసపడినా వారి మధ్య కనిపించే ఆప్యాయత వేరు. తాజాగా ఇరువురూ భేటీ అయ్యారు. సందర్భం ఏదైనా ఈ కలయికకు ఓ ప్రత్యేకత ఉంది. ఈ భేటీలో మంత్రి నారా లోకేష్‌ తన యువగళం పాదయాత్రపై రూపొందించిన పుస్తకాన్ని డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌కు అందజేశారు. పవన్‌ కళ్యాణ్‌ ఆ పుస్తకాన్ని ఆసాంతం ఆసక్తిగా పరిశీలించి, లోకేష్‌కు అభినందనలు తెలిపారు. లోకేష్‌ పాదయాత్ర సాధించిన విజయం పవన్‌ని ఎంతగానో మురిపించింది అనడానికి నిదర్శం.. లోకేష్‌కు, పవన్‌ ఇచ్చిన ఆత్మీయ ఆలింగనం.

Also Read: Ys sharmila: డీఎస్సీ పరీక్షలపై అభ్యర్థుల ఆందోళనను పరిగణనలోకి తీసుకోవాలి

Pawan On Yuvagalam: నాటి రాక్షస పాలనపై ప్రజలను చైతన్యవంతం చేయడంలో యువగళం పాదయాత్ర సఫలీకృతమైందని నారా లోకేష్‌కి కితాబిచ్చారు పవన్‌ కళ్యాణ్‌. స్వతహాగా పుస్తకాల ప్రియుడైన పవన్‌ కళ్యాణ్‌.. లోకేష్‌ యువగళం పాదయాత్ర అనుభవాలను కళ్లకి కట్టినట్లుగా పుస్తక రూపంలో తీసుకురావడాన్ని ప్రశంసించారు. ఇక లోకేష్‌ సైతం.. పవన్‌ ప్రశంసని ఆశీర్వాదంగా భావించినట్లున్నారు. అందుకే.. పవనన్నకు పుస్తకం అందజేశానని, యువగళం పాదయాత్ర నాటి అనుభవాలను పవనన్నతో పంచుకున్నాననీ.. తన ఆనందాన్ని ఎక్స్‌ వేదికగా పంచుకున్నారు. “నా అన్న పవన్‌ కళ్యాణ్‌” అంటూ బహిరంగ వేదికలపైనే ప్రస్తావిస్తున్న లోకేష్‌.. నేడు తన ట్వీట్‌లోనూ “పవనన్న” అంటూ సంభోదించారు.

పవన్‌ కళ్యాణ్‌ ఎప్పటికైనా ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకుంటున్నారు జనసైనికులు. ఇక లోకేష్‌ని టీడీపీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించాలని, డిప్యూటీ సీఎంని చేయాలని తెలుగు తమ్ముళ్లు కోరుకుంటున్నారు. వారి వారి శ్రేణుల రాజకీయ ఆంకాంక్షలు, డిమాండ్లు ఎలా ఉన్నా… ఈ ఇద్దరు ప్రస్తుతం చంద్రబాబు నాయకత్వంలో పనిచేయడానికే ఇష్టపడుతున్నారని అనేక సందర్భాల్లో ఫ్రూవ్‌ అయ్యింది. కూటమి ప్రభుత్వం మరో పదేళ్లు అధికారంలో ఉండాలని ఇద్దరూ చెప్తున్నారు. తదనుగుణంగానే వీరి మధ్య సక్యత, సమన్వయం, మైత్రి కొనసాగుతుండటం కూటమిలో శుభపరిణామం అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *