Pawan Health: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆరోగ్యం పట్ల అభిమానులల్లో ఆందోళన నెలకొంది. మంగళవారం రాష్ట్ర సచివాలయంలో జరిగిన కేబినెట్ సమావేశానికి చేతికి సెలైన్ డ్రిప్‌తో హాజరైన పవన్, ఆరోగ్యం సహకరించకపోవడంతో క్యాంప్ ఆఫీసుకు తిరిగి వెళ్లారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, ఆయన పరిస్థితి సీరియస్‌గా ఉందా అనే చర్చ మొదలైంది. అయినప్పటికీ, బుధవారం 16వ ఆర్థిక సంఘం సమావేశానికి మళ్లీ సెలైన్‌తో హాజరై, తన బాధ్యతను చాటారు. ఈ పట్టుదల అభిమానులను కదిలించింది, కానీ ఆందోళననూ పెంచింది.
పవన్ కళ్యాణ్ తనకు చిన్న తనం నుంచి ఆస్తమా ఉందని పలు సందర్భాల్లో చెప్పారు. కరోనా సెకండ్ వేవ్‌లో ఈ సమస్య తీవ్రమై, ఆయన ఆరోగ్యం దెబ్బతిన్నట్లు వార్తలొచ్చాయ్. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి జ్వరం, స్పాండిలైటిస్‌తో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆయన, రోజూ వైద్య చికిత్స తీసుకుంటున్నారు. ఇటీవల రెండు రోజుల మన్యం జిల్లా పర్యటన, ఆ వెంటనే సింగపూర్‌లో చిన్న కొడుకు మార్క్ శంకర్‌కు అగ్నిప్రమాదం కారణంగా సింగపూర్‌కి వెళ్లాల్సి రావడం.. ఇలా… వరుసగా వారం రోజులు చికిత్సకు గ్యాప్ రావడంతో జ్వరం మళ్లీ తిరగబడినట్లు తెలుస్తోంది. ఈ పరిస్థితిలోనూ ప్రభుత్వ కార్యక్రమాలకు హాజరవుతూ, రాష్ట్ర బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు పవన్ కళ్యాణ్.
Also Read: Visaka Mayor Game: వైసీపీ కోట బద్దలు కొట్టారు ఇలా..
Pawan Health: ఇక తనకున్న ఆస్తమా సమస్యతో పాటు, చాతుర్మాస దీక్ష, వారాహి అమ్మవారి దీక్షలంటూ ఆయన నెలల పాటు ఉపవాసాలు ఉంటుండం కూడా ఆయన రోగ నిరోధక శక్తిని బలహీన పరుస్తున్నాయని పరిశీలకులు అంటున్నారు. సినిమాలు, రాజకీయ బాధ్యతల మధ్య ఒత్తిడి, తరచూ పర్యటనలు ఆయన ఆరోగ్యాన్ని మరింత క్షీణింపజేస్తున్నాయి. అభిమానులు ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. పవన్ రాజకీయ భవిష్యత్తు, రాష్ట్ర అభివృద్ధికి ఆయన ఆరోగ్యంగా ఉండటం చాలా కీలకమని విశ్లేషకులు సైతం సూచిస్తున్నారు.