Nellore Mahanadu: నెల్లూరు జిల్లా జగన్ ఖిల్లాగా పది, పదిహేనేళ్లు నిలిచింది. జగన్ వైసీపీ పార్టీ పెట్టి ఉపఎన్నికల్లో ఎం.పి, ఎమ్మెల్యే అభ్యర్థులను పెట్టినా కూడా లక్షల మెజారిటీతో జగన్ నిలబెట్టిన బొమ్మ లీడర్లను నెల్లూరు జిల్లాలో నెత్తిన పెట్టుకున్నారు ఓటర్లు. అయితే, రెండువేల ఇరవై నాలుగో సంవత్సరం జరిగిన అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో వైసీపీని చీపురుపెట్టి ఊడ్చేసినట్టు పూర్తిగా సున్న సీట్లతో ఓడించారు నెల్లూరు జిల్లా ప్రజలు. సరే, ఏడాది అయిపోతుందిలే, దుస్థితి మారి ఉంటుంది, వైసీపీ పరిస్థితి మెరుగుపడి ఉంటుంది, తెలుగుదేశం జోష్ కొంత తగ్గి ఉంటుంది అనుకుని ఆశపడుతున్న వైసీపీ లీడర్స్‌కు గుండె ఆగినంత పనైంది. తాజాగా జరిగిన నెల్లూరు జిల్లా మినీ మహనాడుకు కర్త, కర్మ, క్రియ అన్నింటితో పాటు దగ్గరుండి అన్ని ఏర్పాట్లు చేశారు నెల్లూరు టీడీపీ ఎం.పి. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి.
వేలాదిమంది సరిపోయే వీపీఆర్ భారీ కన్వెన్షన్ సెంటర్‌లో మూడు, నాలుగు గంటలపాటు తెలుగుదేశం నెల్లూరు జిల్లా మినీ మహనాడును నిర్వహించారు వీపీఆర్ కపుల్. నెల్లూరు పార్లమెంట్ జిల్లా పరిధిలో అన్ని నియోజకవర్గాల నుండి వేలాదిమంది భారీగా తరలివచ్చారు. వీపీఆర్ కన్వెన్షన్ సెంటర్ లోపల, బయట ఇసుకేస్తే రాలని జనంతో నిండిపోయింది. అచ్చం పెద్ద మహనాడు తరహాలో సిస్టమ్ ప్రకారం నాయకులు, కార్యకర్తల నమ్మకం, ప్రసంగాలు, భోజనాలు ఇలా అన్నీ క్రమపద్ధతిలో జరిపారు. ఎం.పి, ఎమ్మెల్యేలు, మంత్రులు వచ్చి గంటలకొద్దీ ప్రసంగాలు చేసినా ఒక్క టీడీపీ కార్యకర్త కూడా బయటకు కదలలేదు. జస్ట్ ఇది స్టార్టింగ్‌నే, ఇంకా ఏడాది కూడా పూర్తి కాలేదు. మరో మూడు, నాలుగేళ్లు అద్భుతాలు చేస్తామని డల్‌గా పసుపు సైనికులకు ఎం.పి. వేమిరెడ్డి, మంత్రులు ఆనం, నారాయణ, ఎమ్మెల్యేలు ఇచ్చిన ధైర్యవచనాలతో పూనకం వచ్చినట్టు ఉగిపోయారు పసుపు సైనికులు.
తెలుగుదేశం పార్టీలో కార్యకర్తే అధినేత అని నారా లోకేష్ చెప్పిన మాటలు నిజం అవుతాయనే నమ్మకం ఉన్న క్యాడర్‌కు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో జరిగిన మినీ మహనాడులతో పాటు, నెల్లూరు జిల్లా మహనాడు కూడా భరోసాను ఇచ్చిందని కార్యకర్తలు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. తెలుగుదేశం పార్టీ రెండువేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు అన్నీ అమలు చేస్తుంది. జస్ట్ కొంత జాప్యం అయితే జరిగి ఉండొచ్చు కానీ, సూపర్ సిక్స్ పథకాలు మొదలైతే వైసీపీకి, జగన్‌కు రెండువేల ఇరవై తొమ్మిది ఎన్నికలు రాజకీయంగా అంతిమ ఎన్నికలు అవుతాయని టీడీపీ లీడర్స్ చెప్పిన మాటలు కార్యకర్తలకు ధైర్యం ఇచ్చాయి. వైసీపీ పోయిన టైమ్‌కు, తెలుగుదేశం అధికారంలోకి వచ్చే టైమ్‌కు, ఆంధ్రలో ఉన్న దారుణ పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఇప్పుడు అభివృద్ధి పనులు ఎలా జరుగుతున్నాయి, వైసీపీ మాఫియా పాలన పోవడంతో ప్రజలు, వ్యాపారులు, మహిళలు ఎంత ధైర్యంగా ఉన్నారు, ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీల్లో విద్యార్థులు, యువత, కాలేజీలు, హాస్పిటల్స్ ఎలా అభివృద్ధి చెందుతున్నాయో మంత్రులు నారాయణ, ఆనం చక్కగా వివరించారు.
Also Read: Naidu Big Plan For AP: దేశానికి యుద్ధ విమానాలు అందించే స్థాయికి ఏపీ!
Nellore Mahanadu: చంద్రబాబు, లోకేష్‌ల విజన్, వారిపై నమ్మకంతో ఆంధ్రకు వస్తున్న పెట్టుబడులు, పరిశ్రమలు, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం చంద్రబాబు, లోకేష్‌లు పడుతున్న శ్రమను ఎం.పి. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి చెప్పిన విధానం కార్యకర్తలను ఫిదా చేసింది. జగన్‌ను దగ్గర చూశామని, చంద్రబాబు, లోకేష్‌లతో కలిసి పని చేస్తున్నామని, అసలు తెలుగుదేశంలో ఇంత క్రమశిక్షణ, గౌరవం, పద్ధతిగా లీడర్స్ ఎలా ఉంటారు అంటే ఎన్టీఆర్, చంద్రబాబు, లోకేష్‌ల పనితీరు వల్లనే అని తెలుసుకున్నామని వీపీఆర్ దంపతులు చెప్పిన మాటలు టీడీపీ కార్యకర్తలకు బాగా నచ్చాయి. బూతులు తిట్టే లీడర్స్‌ని ఎంకరేజ్ చేసే జగన్‌కు, పొరపాటున నోరు జారి తప్పు మాట్లాడితే మందలించే చంద్రబాబు, లోకేష్‌లకు స్వర్గానికి, నరకానికి ఉన్న తేడా ఉందని మంత్రులు ఆనం, నారాయణ చెప్పిన తీరు కూడా కార్యకర్తలకు బాగా ఎక్కేసింది.
గంటలకొద్దీ మీటింగ్ పెట్టి జగన్‌ని, వైసీపీని తిట్టడం కాకుండా, వాస్తవాలు చెప్పి, కార్యకర్తలకు రానున్న రోజుల్లో టాప్ ప్రయారిటీ ఉంటుందని విశ్వాసం కల్పించడంలో నెల్లూరు జిల్లా మహనాడు సక్సెస్ అయింది. బలహీన వర్గాల ప్రజల్లో, బీసీల్లో క్రేజ్, తెలుగుదేశం క్యాడర్‌కు ఇష్టమైన ఎమ్మెల్సీ బీద రవిచంద్రయాదవ్ కడప పెద్ద మహనాడు పనుల్లో బిజీగా ఉండి నెల్లూరు మహనాడుకు రాలేకపోవడం కొంత లోటుగా కనిపించింది. బీద రవిచంద్రయాదవ్ వచ్చి ఉంటే బీసీ వర్గాల్లో ఇంకా భరోసా లభించి ఉండేదనే చర్చ జరిగింది. నెల్లూరు జిల్లాకు కొత్తగా కాబోయే టీడీపీ జిల్లా అధ్యక్షుడు ఎవరనే దానిపై కూడా నెల్లూరు మహనాడులో గుసగుసలు వినిపించాయి. నెల్లూరు మహనాడులో వీపీఆర్ జంట ప్రభాకర్ రెడ్డి, ప్రశాంతి రెడ్డిలు ప్రత్యేకంగా చేయించిన మాంసాహార, శాఖాహార వంటకాలు, స్వీట్లు, హాట్లు, ఐస్‌క్రీమ్స్ అద్భుతంగా ఉన్నాయని కార్యకర్తలు బ్రహ్మాండంగా కడుపు నిండా తిని ఆనందంగా తమ నియోజకవర్గాలకు తిరిగి వెళ్లారంటా. ఇంత జోష్‌తో, భరోసా ఇస్తూ, కార్యకర్తలను గౌరవిస్తూ వైసీపీలో లీడర్స్ చూసిందే లేదని, వల్గర్‌గా బూతులు, అరుపులు, కేకలు, అసహ్యపు మాటలు తప్ప, హుందాగా సభ జరపడం అంటే నెల్లూరు మహనాడులా ఉండాలని లైవ్‌లో, ఛానళ్లలో పసుపు పండగ చూసిన బూలుగు పార్టీ ఫ్యాన్ కార్యకర్తలు వైసీపీ లీడర్స్‌పై మండిపడుతున్నారంటా.

