Nellore Leaders Mingale: ఉమ్మడి నెల్లూరు జిల్లాలో జైళ్లు, కేసులు, అరెస్ట్‌లు వైసీపీ లీడర్లను కట్టడి చేయలేకపోగా, ఫ్యాన్ పార్టీ లీడర్లలో ఫైటింగ్ స్పిరిట్‌ను, మొండితనాన్ని, తెగబడే తత్వాన్ని అలవాటు చేశాయని తెలుగుదేశం పార్టీ వర్గాల్లో ఆందోళన వ్యక్తం అవుతోందట. తెలుగుదేశం మంత్రులు, ఎమ్మెల్యేలు రాజకీయం వదిలేసి, ప్రత్యర్థులను ఆర్థికంగా కట్టడి చేసే ప్లానింగ్‌ను మరచిపోయి, వైసీపీ నుండి తెలుగుదేశంలోకి వచ్చి, తిరిగి వైసీపీలోకి వెళ్లే సన్‌ఫ్లవర్ లీడర్లకే అన్ని కాంట్రాక్ట్‌లు, పనులు, క్యాష్ అండ్ క్యారీ సిస్టమ్‌లో పనులు చేసిపెడుతున్నారనే తీవ్ర అసంతృప్తి ఇప్పుడు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో పసుపు పార్టీ క్యాడర్‌ను తీవ్ర ఆగ్రహానికి గురిచేస్తోందట. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో దాదాపు ప్రతి నియోజకవర్గంలో.. తెలుగుదేశం పార్టీ సెకండ్ గ్రేడ్ లీడర్లు మరియు క్యాడరు… ఇప్పుడు మంత్రులు, ఎమ్మెల్యేలకు ప్రధాన శత్రువులుగా మారిపోవడానికి ప్రధాన కారణం… ఆర్థికంగా బలంగా ఉన్న వైసీపీ లీడర్ల ఫ్రెండ్షిప్‌కు టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలలో చాలా మంది ఆకర్షితులవడమే అని చర్చ నడుస్తోంది. సిలికా ఇసుక మైన్‌లు, తెల్లరాయి ఖనిజం మైనింగ్, ఇసుక స్మగ్లింగ్, గ్రావెల్ స్మగ్లింగ్, రేషన్ బియ్యం మాఫియా, ఇరిగేషన్, పంచాయతీరాజ్ కాంట్రాక్ట్‌లు, బ్రాందీ షాపులు… ఇలా అన్నింటిలోనూ గతంలో వైసీపీలో వ్యాపారాలు, వ్యవహారాలు చేసిన తలకాయలే ఇప్పుడు కూడా కూటమి ప్రభుత్వంలో మంత్రులు, ఎమ్మెల్యేల చుట్టూ చేరిపోయారని ఏడాదిన్నరగా తెలుగు తమ్ముళ్లు గోలగోల చేస్తున్నా.. చంద్రబాబు, లోకేష్‌లు పట్టించుకోవడం లేదనే ఆవేదన పెరిగిపోతోందట. తెలుగుదేశం పార్టీకి సొంత పార్టీ లీడర్లు, క్యాడర్ శత్రువులుగా మారిన చిత్రమైన పరిస్థితి ఉమ్మడి నెల్లూరు జిల్లాలో విపరీతంగా పెరిగిపోవడం ఇప్పుడు ప్రధాన సమస్యగా మారిపోయింది. ఇదే వైసీపీకి బలంగా మారుతోంది అంటున్నారు అనలిస్టులు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రూల్స్, రెగ్యులేషన్స్‌తో పని లేకుండా తిరుమల కొండ దర్శన లెటర్లు మొదలు… కాంట్రాక్ట్‌లు, చిన్నచితకా ఉద్యోగాలు, ఇసుక, గ్రావెల్ రవాణా అనుమతుల పనులను వైసీపీ క్యాడర్, లీడర్లకు అప్పటి వైసీపీ ఎమ్మెల్యేలు ధైర్యంగా చేసి పెట్టేవారట. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక కూడా సిలికా ఇసుక మైనింగ్‌లోనూ, తెల్లరాయి ఖనిజం మైన్‌లు, తిరుమల దర్శన లెటర్లు కూడా వైసీపీ లీడర్లు, క్యాడర్‌కే ప్రాధాన్యతలో జరుగుతున్నాయనేది టీడీపీ లీడర్లు, క్యాడర్ ప్రధాన ఆరోపణగా ఉంది. నెల్లూరు నుండి వస్తున్న పాత వైసీపీ లీడర్లు, వ్యాపారస్థులు సిలికా ఇసుకను, క్వార్ట్జ్ మైన్స్‌ను దోచేస్తున్నారని టాక్ నడుస్తోందట. పాత వైసీపీలో… సిలికా, క్వార్ట్జ్ మైన్స్ సిండికేట్‌లో ఉన్న స్మగ్లర్లే ఇప్పుడు కూడా తమ హవా చూపుతూ, జస్ట్ ఏడాదిన్నరలో ఐదొందల కోట్లకు పైగా దోచేశారని టీడీపీ అసంతృప్త లీడర్లు, తెలుగుదేశం మైన్ యజమానులు కడుపు మంటతో రగిలిపోతున్నారట. అమాయకుడైన ఎంపీ వేమిరెడ్డి పేరు చెప్పి.. తెల్లరాయి ఖనిజంలో ఆయన నమ్మినవారు అక్రమ స్మగ్లింగ్ చేసి రెండొందల కోట్లు దోచేశారట. టీడీపీ పెద్దల దయతో సిలికా ఇసుక మైనింగ్‌ను గోదావరి జిల్లాలా టీడీపీ పెద్దమనుషులకు ఇస్తే, వారి చుట్టూ కూడా వైసీపీ వ్యాపారులు, లీడర్లను తెలివిగా పెట్టిన తెలుగుదేశం బడా లీడర్లు కొందరు.. రెండొందల కోట్లకు పైగా అక్రమంగా ఏడాదిన్నరలో దోచేశారని ఓపెన్ టాక్, పేపర్లతో సహా వివరాలు చూపిస్తున్నారు బాధిత తెలుగుదేశం లీడర్లు, మైన్ ఓనర్లు, వ్యాపారులు. వైసీపీ టైమ్‌లో తిరుమల దర్శనాలకు పదుల సంఖ్యలో లెటర్లు వైసీపీ లీడర్లు తెస్తుండగా, ప్రస్తుతం కూడా టీడీపీ ఎమ్మెల్యేల లెటర్లు తెలుగుదేశం లీడర్లు, క్యాడర్ కంటే వైసీపీ బ్యాచ్‌కే ఎక్కువగా ఇస్తుండటం ఏమిటి గోవిందా అంటూ తెలుగు తమ్ముళ్లు ప్రశ్నిస్తున్నారు.
Also Read: Peter Navarro: మోదీ ఇదేమి వైఖరి.. అమెరికా మరో ఆర్థికవేత్త సంచలన వ్యాఖ్యలు
నెల్లూరు జిల్లా కేంద్రంలో అయితే వైసీపీ టైమ్‌లో చిల్లర వ్యాపారాలు చేసుకునే వైసీపీ లీడర్లు అక్రమ రియల్ ఎస్టేట్ లేఅవుట్స్, బిల్డర్స్ యజమానులుగా మారిపోయి వందల కోట్లు సంపాదించేశారని టాక్. సేమ్ తెలుగుదేశం అధికారంలోకి రాగానే ఆ పాత వైసీపీ బ్యాచ్ అంతా తమ వ్యాపార అవసరాల కోసం పసుపు రంగును పులుముకుని రెడీ అయిపోయారట. ఇంకేముంది, నెల్లూరు జిల్లా కేంద్రంలో ప్రతి రియల్ ఎస్టేట్ లేఅవుట్, అపార్ట్‌మెంట్స్, విల్లాలు, గ్రూప్ హౌస్‌ల నిర్మాణాలు అన్నీ పాత వైసీపీ లీడర్ల కంట్రోల్‌లోనే జరుగుతున్నాయనేది తెలుగుదేశం లీడర్లు, క్యాడర్ తీవ్ర అసంతృప్తికి కారణం అవుతోందని చర్చ నడుస్తోంది. ఎమ్మెల్యేలు కూడా రియల్ ఎస్టేట్, కన్‌స్ట్రక్షన్స్, ఇరిగేషన్ కాంట్రాక్ట్‌లు, పంచాయతీ వర్క్‌లలో తెలుగుదేశం ఒరిజినల్ లీడర్లు, క్యాడర్ కంటే.. వైసీపీ నుండి టీడీపీలోకి తమతో వచ్చిన వారికే పనులు ఇస్తున్నారనేది ఇప్పుడు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం కోంప ముంచుతోందని అంటున్నారు. మీరు చంద్రబాబు, లోకేష్ మనుషులు, మీతో మాకు పని లేదు, మా కోసం వైసీపీ నుండి మాతో వచ్చిన వారికే మా ప్రాధాన్యత అని చాలా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు పెత్తనం అంతా సొంత మనుషులకే ఇచ్చేశారని టాక్. టీడీపీలో కొత్తగా ఎమ్మెల్యేలు అయిన వారు, మంత్రుల చుట్టూ ఉన్న మెయిన్ లీడర్లు కూడా క్యాష్ బలంగా ఉన్న వైసీపీ లీడర్లతో లాలూచీపడి ఒరిజినల్ తెలుగు తమ్ముళ్లను చూస్తేనే అలర్జీ ఫీలింగ్‌తో ఫేస్ పెడుతున్నారట. టోటల్‌గా ఉమ్మడి నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు ప్రధాన శత్రువులు ఎవరయ్యా అంటే… ఒరిజినల్ తెలుగుదేశం సెకండ్ గ్రేడ్ లీడర్లు, కార్యకర్తలు అనే ఆందోళన వ్యక్తం అవుతోందట. ఇటీవల ఓ మంత్రి గారు పార్టీ పని కోసం ఉమ్మడి నెల్లూరు జిల్లా పర్యటనకు వచ్చిన సమయంలో, పాత తెలుగుదేశం పార్టీ లీడర్లను హోటల్ రూమ్ బయట వెయిట్ చేయించి, కొత్తగా చేరిన పాత వైసీపీ లీడర్లతో వ్యాపారం, వ్యవహారం, సొంత లాభాల కోసం గుసగుసలాడటం కూడా ఇప్పుడు నెల్లూరు టీడీపీ తమ్ముళ్లలో అసంతృప్తిని పీక్స్‌కు చేరేలా చేసిందంటున్నారు.

