Lokesh vs Sakshi

Lokesh vs Sakshi: ఏం రాతలవి? నిద్రలోనూ లోకేష్‌ భయపెడుతున్నాడా?

Lokesh vs Sakshi: ఏపీ విద్యాశాఖ రికార్డులు సృష్టిస్తోంది. ఇటీవల జరిగిన మెగా పేరెంట్-టీచర్ మీటింగ్ కూడా గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కింది. 53.4 లక్షల మంది తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొన్న ఈ మెగా పీటీఎంలో… పాల్గొన్న విద్యార్థులు, పూర్వ విద్యార్థులు, పాఠశాల యాజమాన్యం, పాఠశాల నిర్వహణ కమిటీ సభ్యులు కలిపితే మొత్తం 1.5 కోట్ల మంది పాల్గొన్న అతిపెద్ద పేరెంట్-టీచర్ మీటింగుగా గిన్నిస్‌ సంస్థ వారు గుర్తించారు. మెగా పీటీఎం నుండి సేకరించిన డేటాను నిశితంగా ఆడిట్ చేసిన తర్వాత ఈ రికార్డును అధికారికంగా గిన్నిస్ బృందం ధ్రువీకరించింది. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ నియమించిన 40 మందికి పైగా ఆడిటర్లు ఈ అవార్డును నిర్ధారించడానికి 61 వేల పాఠశాలల నుండి సేకరించిన డేటాను విశ్లేషించారు. సంబంధిత ధృవపత్రాన్ని ఆగస్టు రెండవ వారంలో అమరావతిలో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో అందజేయనున్నారు.

విద్యా శాఖలో లోకేష్‌ తీసుకొస్తున్న సంస్కరణలు ఇలా ఉంటే.. వైసీపీ కరపత్రంగా నడపబడే ఆ పత్రిక మాత్రం ఏమాత్రం విద్యాశాఖపై నిస్సంకోచంగా అవాస్తవాలను వండి వారుస్తోంది. ప్రభుత్వ తప్పుల్ని ఎత్తి చూపుతూ వ్యతిరేక కథనాలు రాయడం తప్పు కాదు. పత్రికలు చేయాల్సిన పనే అది. కానీ వాస్తవికంగా వ్యతిరేకత ఉన్న అంశాలను ఒడిసిపట్టుకుని వార్తలు రాసే ఓపిక, నేర్పు, సామర్థ్యం ఆ పత్రికకు లేకుండా పోయిందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కూటమి ప్రభుత్వాన్ని నడుపుతోంది జగన్ బద్ధ శత్రువు అయినంత మాత్రాన… రోజూ పేజీలు పేజీలు నింపుతూ వ్యతిరేక కథనాలు రాయాలంటే ఎక్కడ సాధ్యమవుతుంది? అంతకన్నా ఫేక్‌ కథనాలను వండి వార్చడమే చాలా సులభం అనుకున్నట్లుంది వైసీపీ కరపత్రం. ఎలాంటి లాజిక్స్‌ లేకుండా, నిజాలతో పని లేకుండా, ఆధారాలు లేకుండా ఇలాంటి వార్త రాస్తే లీగల్‌గా రోడ్డున పడతామన్న స్పృహ లేకుందా, అబద్దమని అందరికీ తెలిసిపోయేలా వార్తలు రాస్తే అబాసు పాలవుతామన్న భయం లేకుండా, పుంకాలు పుంకాలుగా తప్పుడు వార్తలు అచ్చు వేస్తోంది. రీసెంట్‌గా మాజీ మంత్రి రోజాకు సినీ తారల మద్ధతంటూ ఒక ఫేక్‌ వార్త, పర్చూరులో పొగాకు రైతు 40 లక్షల రూపాయల తన పంటని ట్రాక్టర్‌తో తొక్కించాడంటూ మరో తప్పుడు వార్త రాసి దొరికిపోయిన వైపీపీ కరపత్రిక, తాజాగా మంత్రి నారా లోకేష్‌ విద్యాశాఖపై మరో తప్పుడు స్టోరీని వండి వార్చింది. విద్యా శాఖపై తప్పుడు కథనాలు రాయడం, లోకేష్‌ వాస్తవాలు బయటపెట్టగానే కౌంటర్‌ కూడా చేసుకోలేని పరిస్థితిలో సైలెంట్ అయిపోవడం, కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుండీ ఆ పత్రిక ఇదే పనిగా పెట్టుకుంది.

Also Read: Encounter: జమ్మూకశ్మీర్‌లో మళ్లీ ఎన్‌కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదులు హతం

లేటెస్ట్‌గా వైసీపీ పార్టీ పత్రికలో రాసిన రాతలేంటంటే.. ఆంధ్రప్రదేశ్‌లో కాలేజీలు ఖాళీ అవుతున్నాయని, ఇంటర్మీడియట్‌లో ప్రవేశాలు సగం కూడా దాటడం లేదని, కూటమి ప్రభుత్వం వచ్చాక అసలు ప్రభుత్వ కాలేజీల్లో చేరడానికే విద్యార్థులు ఇష్టపడటం లేదని, ఇక సగం సీట్లు ఖాళీగా ఉన్న కాలేజీలు ఇలా, డబుల్‌ డిజిట్‌ అడ్మిషన్లు జరగని కళాశాలలు ఇలా.. అంటూ ఇష్టమొచ్చిన నంబర్స్‌ వేసి ఓ కట్టు కథనం అల్లింది. వాస్తవానికి జగన్‌ దిగిపోయే నాటికి చివరి అకడమిక్‌ ఇయర్‌ 2023-24లో ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌, సెకండియర్‌ కలిపి మొత్తం ప్రవేశాలు 1,24,818 అయితే, కూటమి అధికారంలోకి వచ్చాక తాజా అకడమిక్‌ ఇయర్‌ 2025-26లో ప్రవేశాల సంఖ్య 1,46,332. అంటే 2025-26లో దాదాపు 18 శాతం అడ్మిషన్లు పెరిగాయి. అదే విధంగా 2024లో డ్రాపౌట్ల సంఖ్య 9 వేల పైచిలుకు ఉంటే, 2025లో డ్రాపౌట్ల సంఖ్య 3వేల పైచిలుకు మాత్రమే. ఇదే విషయాన్ని కోట్‌ చేస్తూ మంత్రి నారా లేకేష్‌ ట్వీట్‌ చేశారు. ప్రకాశం జిల్లా కనిగిరి వంటి మారుమూల కళాశాలల్లో అడ్మిషన్లు రెట్టింపు కావడం ప్రభుత్వ విద్యావ్యవస్థపై ప్రజల్లో పెరిగిన నమ్మకానికి నిదర్శనం అంటూ లోకేష్‌ స్పష్టం చేశారు. వాస్తవాలు ఇలా ఉంటే, వైసీపీ కరపత్రం అలా రాయడానికి కారణమేంటంటే… అంతిమంగా కూటమి ప్రభుత్వంలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌, వసతి దీవెన వంటివి సరిగా అందడం లేదని ఒక అబద్దాన్ని జనం మీద రుద్దడం కోసం, జగన్‌ విద్యార్థులకు ఎంతో బాగా చేశాడని ఒక అభూత కల్పనని నిజమని నమ్మించడం కోసం. కానీ అడ్డంగా దొరికిపోవడం మాత్రం ప్రతి సారి కామన్‌.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *