Lokesh Students Meet: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అనూహ్యంగా ఐటీ శాఖతో పాటూ విద్యా శాఖ బాధ్యతలు చేపట్టారు నారా లోకేష్. మానవ వనరుల అభివృద్ధి – హెచ్‌ఆర్‌డి, ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్… రెండూ యువత భవితను తీర్చిదిద్దేవే. అంటే.. ఏపీలో విద్యార్థులకు నాణ్యమైన చదువులు, చదువులకు తగ్గ ఉద్యోగాలు కల్పించే కీలక బాధ్యతల్ని లోకేష్ భుజాన తన వేసుకున్నారు. విద్యా శాఖ అంటే.. తనకు చంద్రబాబు అప్పగించిన ఛాలెంజ్ టాస్క్ అని కూడా లోకేష్ ఓ సందర్భంలో అన్నారు. అన్నట్లుగానే.. విద్యను అందలమెక్కిస్తూ, మసకబారిన విద్యా వవస్థకు కొత్త రూపునిస్తూ.. ప్రక్షాళన మొదలుపెట్టారు.
మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటగా లోకేష్ తీసుకున్న నిర్ణయం విద్యలో రాజకీయ జోక్యాన్ని నిషేధించడం. విద్యా కార్యక్రమాల్లో రాజకీయ నాయకుల ఫొటోలు, పార్టీ రంగుల చీడను వదిలించేశారు. ఏ పార్టీ రంగులతో మ్యాచ్ కాని స్కూల్ యూనిఫామ్‌ని అందిస్తున్నారు. విద్యార్థులకు అందజేసే కిట్లనూ అదే విధంగా మార్చేశారు. మధ్యాహ్న భోజన పథకాని దొక్కా సీతమ్మ పేరు పెట్టారు. విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించేలా చర్యలు తీసుకున్నారు. విద్యార్థులపై ఒత్తిడిని తగ్గిస్తూ, అనవసర భారాన్ని తొలగించారు. ప్రతి శనివారాన్ని నో బ్యాగ్ డేగా ప్రకటించారు. రాజకీయ కార్యక్రమాల కోసం విద్యార్థులను తరలించడాన్ని నిషేధించారు. వారి దృష్టిని చదువుపై మాత్రమే కేంద్రీకరించేలా ఆదేశాలు జారీ చేశారు.
ఇప్పుడు ఉపాధ్యాయులపై యాప్‌ల భారం లేదు. విద్యా దీవెన, వసతి దీవెన వంటి పథకాల కింద 6,500 కోట్ల బకాయిలను క్లియర్ చేసి, విద్యార్థులకు సర్టిఫికెట్లు అందేలా చేశారు. కెజి నుంచి పిజి వరకు నూతన పాఠ్యప్రణాళిక రూపొందించి, పుస్తకాల భారం తగ్గించి నాణ్యత పెంచేందుకు చర్యలు తీసుకున్నారు. విద్యా నైపుణ్యాల అభివృద్ధికి ‘లెర్నింగ్ ఎక్సలెన్స్ ఇన్ ఏపీ’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. విద్యా సంస్థల నుంచి బయటకు వచ్చే ప్రతి విద్యార్థికి ఉద్యోగం అందేలా కరిక్యులమ్‌లో మార్పులు చేయాలని ఆదేశించారు. మెగా డీఎస్సీ ద్వారా 16,000 ఉపాధ్యాయ నియామకాలు చేపడుతున్నారు. విద్యా వ్యవస్థను బలోపేతం చేసి, ఏపీని విద్యారంగంలో అగ్రస్థానంలో నిలపాలనే లక్ష్యంతో పనిచేస్తున్నారు నారా లోకేష్.
Also Read: Suresh Wife-Anil Wife: జగన్‌ని నమ్ముకున్నోళ్లు అందాకా ఆగక్కర్లేదా?
Lokesh Students Meet: తాజాగా.. సర్కారీ బడుల్లో చదివి, కార్పొరేట్ విద్యాసంస్థలకు తమ బడులు ఏమాత్రం తీసిపోవని నిరూపించిన విద్యార్థుల్ని స్వయంగా కలుసుకున్నారు మంత్రి నారా లోకేష్. “షైనింగ్ స్టార్స్ – 2025” పేరిట కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి, పదో తరగతి ఫలితాల్లో రికార్డులు బద్దలు కొట్టిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల్ని తన చేతుల మీదుగా సన్మానించారు. నాలుగైదు యాంగిల్స్‌లో కెమెరా సెట్టింగులు లేవు. పిల్లలతో పేజీలు పేజీలు ప్రసంగాలు బట్టీ పట్టించి, పొగిడించుకోవడాలు లేవు. స్వచ్ఛమైన ఆ పసి మనసుల్ని మలినం చేసే కార్యక్రమాలేవీ లేవు. స్వచ్ఛంగా విద్యార్థులతో ముచ్చటించారు నారా లోకేష్. వారిని స్వేచ్ఛగా తమ అభిప్రాయాలు చెప్పమన్నారు. ఇంతటి ఘన విజయాలు సాధించడంలో స్టడీ ప్లాన్, ప్రిపరేషన్, ఉపాధ్యాయుల సహకారం వంటి అంశాలపై ఆరా తీశారు. వారి అనుభవాలు పంచుకున్నారు.
విద్యార్థులు కూడా ఎంతో ఆనందంగా వారి సక్సెస్‌ని లోకేష్‌తో షేర్ చేసుకుని, భావోద్వేగానికి గురయ్యారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యా మిత్ర కిట్ల నాణ్యత బాగుందని, వాటిపై పార్టీ గుర్తులు లేకపోవడం మంచి నిర్ణయమని ఓ విద్యార్థి పేర్కొనడం గమనార్హం. తమని విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ సన్మానిస్తారని అస్సలు ఊహించలేదనీ, చాలా గర్వంగా ఉందని తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. విద్యార్థులు తమ కలల్ని, భవిష్యత్‌లో తాము సాధించాలనుకుంటున్న విజయాలను గురించి విద్యాశాఖ మంత్రితో డిస్కస్ చేయడం చూస్తే ఎవరికైనా ముచ్చటేయక మానదు. పొలిటీషియన్ అంటే.. అందులోనూ ఉన్నత పదవిలో ఉన్న పొలిటీషియన్ అంటే.. విద్యార్థులకు ఇన్‌స్పిరేషన్‌గా, రోల్ మోడల్‌గా ఉండాలన్న మంచి సంప్రదాయాన్ని, ఓల్డ్ ట్రెండ్‌ని తిరిగి రీ క్రియేషన్ చేస్తున్నారని చెప్పొచ్చు.. ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్.