Lokesh And Pawan

Lokesh And Pawan: పవన్‌ నిబద్ధత – లోకేష్‌ విజ్ఙత – కూటమి ఐక్యత!

Lokesh And Pawan: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నారా లోకేష్, పవన్ కల్యాణ్‌ల మధ్య అనుబంధం కొత్త అధ్యాయాన్ని లిఖిస్తోంది. ఒకవైపు టీడీపీ యువనేతగా, మంత్రిగా తనదైన ముద్ర వేస్తున్న లోకేష్… మరోవైపు జనసేన అధినేతగా, డిప్యూటీ సీఎంగా ప్రజల గుండెల్లో చెరగని స్థానం సంపాదించిన పవన్. ఈ ఇద్దరూ కలిస్తే అది కేవలం రాజకీయ కూటమి కాదు. అంతకు మించిన సంచలనం. కనిగిరిలో రిలయన్స్ సీబీజీ ప్లాంట్ శంకుస్థాపన సభలో లోకేష్ తన మనసు విప్పి మాట్లాడారు. “పవన్ నా అన్నయ్య. ఆయన నిబద్ధత, కృషి మాకు స్ఫూర్తి. తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు ఆయన చేస్తున్న పోరాటం అసాధారణం” అంటూ ఆకాశానికెత్తారు. లోకేష్‌ మాటలు కేవలం మాటలతో వ్యక్తపరిచే మర్యాదలా కాకుండా, పవన్‌ కళ్యాణ్‌పై హృదయంలో తనకున్న గౌరవాన్ని ప్రతిబింబించాయి.

“చంద్రబాబు అనుభవం రాష్ట్రానికి దొరికిన వరం. ఆయనతో కలిసి పనిచేయడం మాకు గర్వకారణం” అంటూ పవన్ సందర్భం వచ్చినప్పుడల్లా చెప్తున్నారు. మరోవైపు “నా అన్నయ్య పవన్‌.. మనకు అండగా నిలిచారు. ప్రజల తరఫున పోరాడుతున్నారు. తలచుకుంటే ఏదైనా సాధిస్తాడు” అంటూ తరచూ ప్రస్తావిస్తున్నారు లోకేష్‌. ఈ ఇద్దరి సమన్వయం కూటమి ప్రభుత్వాన్ని బలోపేతం చేస్తోంది అనడంలో సందేహమే లేదంటున్నారు పొలిటికల్‌ పరిశీలకులు. పది నెలల కూటమి పాలనలో ఈ జోడి సాధించిన విజయాలు చిన్నవేమీ కావు.

టీసీఎస్‌ను రాష్ట్రానికి తీసుకొచ్చిన ఘనత లోకేష్‌ది అయితే, వైసీపీ అర్థాంతరంగా వదిలేసి వెళ్లిన.. తాగునీటి పథకాలను పూర్తి చేసేందుకు కేంద్ర నిధులు సమకూర్చిన క్రెడిట్ పవన్‌ది. వాట్సాప్ గవర్నెన్స్‌తో పాలనలో విప్లవం తెచ్చిన లోకేష్, 500 సీబీజీ ప్లాంట్ల స్థాపనలో తన సత్తా చాటారు. అటు పవన్, ప్రజల సమస్యలను సొంత బాధ్యతగా తీసుకుని, సీఎం చంద్రబాబుతో కలిసి పరిష్కార మార్గాలు చూపుతున్నారు. ఈ ఇద్దరి కలయికలో రాష్ట్రం కొత్త దశకు చేరుకుంటోందని అభిప్రాయపడుతున్నారు విశ్లేషకులు.

Also Read: Forbes Billionaires List: ప్రపంచ కుబేరుల జాబితాలో ఎలాన్ మస్క్ NO 1

Lokesh And Pawan: టీడీపీ కష్టాల్లో ఉన్నప్పుడు పవన్ ఆదుకున్న సంగతి చంద్రబాబుకు మర్చిపోలేని అనుభవం. ఆ కృతజ్ఞతను లోకేష్ సందర్భం వచ్చినప్పుడల్లా పంచుకుంటున్నారు. “మా అన్న పవన్ లేకపోతే ఈ రోజు ఈ స్థితిలో ఉండేవాళ్లం కాదు” అంటూ లోకేష్ గుండెలోని మాటను బయటపెట్టారు. ఈ గౌరవం, ఆప్యాయత రాజకీయాలను దాటి, ఒక కుటుంబ బంధంలా కనిపిస్తోంది. ప్రత్యర్థులు వీరి మధ్య చిచ్చు పెట్టాలని చూసినా, లోకేష్-పవన్‌ల సమైక్యత వారి ఆశలను ఎప్పటికప్పుడు చెల్లాచెదురు చేస్తోంది. వైసీపీ విమర్శలకు చెక్ పెడుతూ, కూటమి బలాన్ని చాటుతోంది పవన్‌ – లోకేష్‌ల జోడీ.

జనసేన క్యాడర్‌కు పవన్ పోరాట పటిమ స్ఫూర్తి అయితే, టీడీపీ శ్రేణులకు లోకేష్ విజన్ మార్గదర్శి. పవన్ తలచుకుంటే ఏదైనా సాధ్యమని లోకేష్ అంటే, చంద్రబాబు లాంటి అనుభవజ్ఙులైన లీడర్స్‌ చేతిలో అధికారం ఉంటే రాష్ట్రం గెలుస్తుందని పవన్ భావిస్తారు. వీరి ఐక్యత కొనసాగినంత కాలం కూటమి అజేయం, ప్రత్యర్థుల కుట్రలు విచ్ఛిన్నం కాక తప్పదంటున్నారు ఎనలిస్టులు. ఈ బంధం రాజకీయ సిద్ధాంతాలను దాటి.. ఒక ఉన్నత లక్ష్యం దిశగా.. ఆంధ్రప్రదేశ్‌ను స్వర్ణ యుగంలోకి నడిపించే సంకల్పంగా కొనసాగాలన్నది ప్రజల ఆకాంక్షగా చెప్తున్నారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *