Liquor scam: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనం… మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి జీవితంలో ఓ అనూహ్య ట్విస్ట్! ఐదేళ్ల ముఖ్యమంత్రి పదవీ కాలంలోనూ, ఎన్నికల ఓటమి తర్వాత కూడా మొబైల్ ఫోన్‌కి ఆమడ దూరంగా ఉన్న జగన్, ఇప్పుడు సడన్‌గా ఐఫోన్ కొన్నారట. “నాకు ఫోన్ లేదు, నెంబర్ అసలే లేదు” అంటూ గతంలో గట్టిగా చెప్పిన జగన్, ఇప్పుడు ఐఫోన్‌తో చాటింగ్‌లో బిజీగా కనిపిస్తున్నారట. కానీ, ఈ ఫోన్ వాడకం వెనుక కథ సామాన్యమైనది కాదు. రూ.3200 కోట్ల లిక్కర్ ముడుపుల కేసు విచారణలో వణుకు పుట్టించే డెవలప్‌మెంట్స్‌తో ముడిపడి ఉందంటున్నారు పరిశీలకులు. వైసీపీ పాలనలో జరిగిన భారీ లిక్కర్ స్కామ్‌పై సిట్ విచారణ తీవ్రంగా సాగుతోన్న సంగతి తెలిసిందే. ఈ స్కామ్‌లో కింగ్‌పిన్‌లు ఒక్కొక్కరుగా అరెస్ట్ అవుతున్నారు. నాడు సీఎంఓలో కీలక పాత్రలు పోషించిన ఉన్నతస్థాయి వ్యక్తులు కూడా ఈ కేసులో దొరికిపోయే సూచనలు కనిపిస్తున్నాయి.
ఈ హై-వోల్టేజ్ డెవలప్‌మెంట్స్ వైసీపీలో అలజడి సృష్టిస్తున్నాయి. “ఈ అరెస్ట్‌లు ఎక్కడి వరకు వెళతాయి? జగన్‌కు ఈ కేసు ఎలాంటి ఇబ్బందులు తెచ్చిపెడుతుంది?” అనే ప్రశ్నలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. ఈ నేపథ్యంలోనే జగన్ ఐఫోన్ కొనుగోలు చేసి, స్వయంగా వాడటం మొదలుపెట్టారని తెలుస్తోంది. కేసు పరిణామాలను ఎప్పటికప్పుడు ట్రాక్ చేయడం, అప్‌డేట్స్ తెలుసుకోవడం, తదుపరి చర్యలపై సహచరులతో చర్చించడం కోసం ఈ ఫోన్ కీలకం అయినట్లు సమాచారం. కానీ, ఇక్కడే స్టోరీలో ట్విస్ట్ ఉంది… జగన్ వాడుతున్న ఫోన్‌లో సిమ్ కార్డు ఆయన పేరుమీద లేదట! అత్యంత నమ్మకమైన వ్యక్తి పేరున రిజిస్టర్ అయిన సిమ్‌ను ఉపయోగిస్తున్నారని విచారణ అధికారులు గుర్తించారు.
జగన్ ఐఫోన్‌లో సిగ్నల్ యాప్‌ను వాడుతున్నారని తెలిసింది. ఇది రాజకీయ వర్గాల్లో సంచలనం రేపుతోంది. సిగ్నల్ యాప్‌కు సామాన్య సమాజంలో పెద్దగా పాపులారిటీ లేదు, కానీ దీని భద్రతా ఫీచర్స్ గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే! ఈ యాప్‌లో జరిగే చాట్‌లు నిర్దిష్ట సమయంలో ఆటోమేటిక్‌గా డిలీట్ అవుతాయి… అంటే, పూర్తిగా చెరిగిపోతాయి! ఈ మెసేజ్‌లు ఎంత సమయంలో డిలీట్ కావాలన్నది కూడా యూజర్ సెట్ చేసుకోవచ్చు. ఈ చాట్‌లను ట్రాక్ చేయడం అసాధ్యం, ఎందుకంటే అవి క్లౌడ్‌లో సేవ్ కావు. ఈ హై-సెక్యూరిటీ ఫీచర్స్ కారణంగానే సిగ్నల్ యాప్‌ను జగన్ ఎంచుకున్నట్లు తెలుస్తోంది. సహచరులు, కేసులో నిందితులు, వ్యక్తిగత సిబ్బంది, లాయర్లతో రహస్య సంప్రదింపుల కోసం ఈ యాప్ జగన్‌కు ఆయుధంలా మారింది అనక తప్పదు. అంతేకాదు, అవసరమైతే ఫేస్‌టైమ్ యాప్ ద్వారా పరిమితంగా కాల్స్‌లో మాట్లాడుతున్నారని విచారణ అధికారులు పసిగట్టారు. ఈ రెండు యాప్‌ల ద్వారా జగన్ గుట్టుచాటుగా కమ్యూనికేషన్ నడుపుతున్నారని, విచారణ అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు తెలుసుకుని, అందుకు తగ్గట్టు నిర్ణయాలు తీసుకుంటున్నారని సమాచారం.
Also Read: Transgender: ట్రాన్స్‌జెండర్లకు గుడ్‌న్యూస్ చెప్పిన ప్రభుతవం.. కూటమి సర్కార్ కీలక ప్రకటన
Liquor scam: లిక్కర్ స్కామ్ విచారణ కీలక దశకు చేరుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా గుర్తించబడిన కాసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, జగన్ ఆమోదంతోనే ఎక్సైజ్ పాలసీని రూపొందించారని ‘కన్ఫెస్’ చేసినట్లు సిట్ నివేదికలు చెబుతున్నాయి. ఈ పాలసీ ద్వారా నెలకు రూ.60 కోట్ల కిక్‌బ్యాక్‌లు సేకరించారని, ఈ డబ్బు వైసీపీ నాయకుల ద్వారా జగన్‌కు చేరిందని ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆరోపణలు రాజకీయంగా జగన్‌ను ఇరుకున పెడుతున్నాయి. విచారణలో నిందితులు ఇస్తున్న స్టేట్‌మెంట్లు, వారు బయటపెడుతున్న వివరాలు మీడియా, రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
ఈ సమయంలోనే జగన్ ఐఫోన్ వాడకం మొదలుపెట్టడం గమనార్హం. సిగ్నల్ యాప్, ఫేస్‌టైమ్ వంటి హై-సెక్యూరిటీ టూల్స్‌తో కమ్యూనికేషన్ నడపడం, సిమ్ కార్డు కూడా తన పేరుమీద లేకపోవడం… ఇవన్నీ జగన్ ఎంత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారో తెలియజేస్తున్నాయి. విచారణ అధికారులు ఈ విషయాలను గుర్తించినప్పటికీ, సిగ్నల్ యాప్ ద్వారా జరిగే చాట్‌లను ట్రాక్ చేయలేకపోతున్నారు. ఇది జగన్‌కు తాత్కాలిక రక్షణగా మారినప్పటికీ, అరెస్ట్‌ల భయం ఆయనను వెంటాడుతున్నట్లు కనిపిస్తోంది.
జగన్ ఐఫోన్ వాడకం, సిగ్నల్ యాప్‌తో రహస్య చాట్‌లు, ఫేస్‌టైమ్‌తో గుట్టుగా కాల్స్, సిమ్ కార్డు గోప్యత… ఇవన్నీ లిక్కర్ స్కామ్ నుండి జగన్‌ను కాపాడతాయా? లేక, విచారణ మరింత ఊపందుకుని జగన్‌ను కటకటాల్లోకి నెట్టేస్తుందా? ఈ కేసు ఎక్కడి వరకు వెళుతుంది? ఈ స్కామ్ విచారణ ఆంధ్ర రాజకీయాల్లో భారీ భూకంపాన్నే సృష్టిస్తుందా? కాలమే సమాధానం చెప్పాలి!