Kuppam YCP Address Gone

Kuppam YCP Address Gone: జగన్‌మోహన్‌రెడ్డి ఎక్స్‌ ఖాతాలో గొప్ప జీవిత సత్యం

Kuppam YCP Address Gone: కృష్ణాష్ఠమి సందర్భంగా ఇవాళ మాజీ సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి ఎక్స్‌ ఖాతాలో ఓ ట్వీట్‌ దర్శనమిచ్చింది. “అధర్మం ఎంత బలంగా ఉన్నా – అది తాత్కాలికం. ధర్మం ఎంత నెమ్మదిగా ముందుకెళ్లినా – అది శాశ్వతం. శ్రీకృష్ణుడి జీవితం దీనికి నిదర్శనం. ఈ కృష్ణాష్ఠమి మీ జీవితాల్లో శాంతిని, ప్రేమను, విజయాన్ని తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా” అంటూ.. వాటన్నింటినీ దూరం చేసుకున్న జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రజలకు హితవు చెబుతున్న విచిత్రమైన సందర్భం చూస్తున్నాం. నాలుగు గోడల మధ్య బైబిల్‌ మాత్రమే చదివే జగన్‌ మోహన్‌ రెడ్డికి శ్రీకృష్ణుడి జీవితం గురించి తెలిసి ఉండకపోవచ్చు. ఈ ట్వీట్‌ ఆయన పీఆర్‌ టీమ్‌ పెట్టి ఉండొచ్చు. అయితే దీనిని ఆయన కనీసం ఓ సారి చదివి, అర్థం చేసుకుంటే.. శేష జీవితం సంతోషంగా గడపొచ్చన్నది పెద్దల అభిప్రాయం. ఎందుకంటే 151 సీట్లు ఇచ్చి నెత్తిన పెట్టుకున్న ప్రజలకు అధర్మ పరిపాలన రుచి చూపించింది జగన్‌మోహన్‌ రెడ్డే. పార్టీకి తానే జీవిత కాలం శాశ్వత అధ్యక్షుడినని, 30 ఏళ్లు ఏపీకి తిరుగులేని చక్రవర్తినని విర్రవీగింది ఆయనే. 2019 ఎన్నికల్లో 151 సీట్లతో ప్రజలు ఇచ్చిన మ్యాండేట్‌ని పూర్తిగా దుర్వినియోగం చేసి, 2024 ఎన్నికల్లో విజయానికి దూరమైంది ఆయనే. ఆస్తి కోసం తల్లిని, చెల్లిని దూరం చేసుకుని, జీవితంలో నా అన్న వాళ్ల ప్రేమకు దూరమైంది ఆయనే. అవినీతి కేసుల్లో చిక్కి, బెయిల్‌ మీదే జీవిస్తూ జీవితంలో శాంతి లేకుండా చేసుకున్నది కూడా ఆయనే. కాబట్టి జగన్‌ మోహన్‌ రెడ్డి అధికారిక ఎక్స్‌ హ్యాండిల్‌లో ఆయన పీఆర్‌ టీమ్‌ పోస్టు చేసిన శ్రీకృష్ణాష్ఠమి సందేశం.. తొలుత ఆయనకే వినిపించాలని అనలిస్టులు సూచిస్తున్నారు.

Also Read: Koya Puli in Pulivendula: వైసీపీ ట్రబుల్ షూటర్స్‌కు ఆయనతో బిగ్ ట్రబుల్‌

అధర్మం ఎంత బలంగా ఉన్నా – అది తాత్కాలికం. ధర్మం ఎంత నెమ్మదిగా ముందుకెళ్లినా – అది శాశ్వతం. ఇది ముమ్మాటికీ నిజం. జగన్‌ మోహన్‌ రెడ్డి ఎక్స్‌ ఖాతాలో ఓ గొప్ప జీవిత సత్యం ఇవాళ కనిపించింది. పులివెందుల, కుప్పంలలో వైసీపీకి తిరబెట్టిన పరిస్థితులను అర్థం చేసుకుంటే జగన్‌ ట్వీట్‌ ఇంకా బాగా అర్థమౌతుంది. వైనాట్‌ 175 అన్నారు. వైనాట్‌ కుప్పం అన్నారు. అన్నట్లుగానే కుప్పం మునిసిపాలిటీ, స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికారాన్ని అడ్డు పెట్టుకుని చెలరేగిపోయారు. “కుప్పంలో కుప్ప కూలిన చంద్రబాబు. సొంతూరు నారా వారి పల్లెలోనూ ఘోర పరాజయం. చిత్తూరు జిల్లాలో ఫ్యాన్‌ ప్రభంజనం. కుప్పంలో చరిత్ర తిరగరాసిన ఫ్యాన్‌.” ఇవన్నీ నాడు కుప్పంలో వైసీపీ దొంగ పెళ్లికి సొంత పత్రిక వాయించిన బాజాభజంత్రీలు. నాడు అధర్మం ఎంత బలంగా నడిచిందో చెప్పేందుకు ఇదో ఉదాహరణ. అందుకే ఆ గెలుపు తాత్కాలికం అయ్యింది. నేడు కుప్పంలో సీన్‌ ఏంటి? చంద్రబాబుపై పోటీ చేసిన వైసీపీ అభ్యర్థి భరత్‌ ఎక్కడున్నాడో తెలీదు. కనీసం వైసీపీ జెండా పట్టేటోడు లేడు. ఎన్నికలకు ముందే ద్వితీయ శ్రేణి లీడర్లు టీడీపీలో చేరిపోయారు. జగన్‌, పెద్దిరెడ్డిలు కలిసి.. కుప్పాన్ని పుంగనూరుగానో, పులివెందులగానో మారుద్దామనుకున్నారు. ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రాజమండ్రి సెంట్రల్‌ జైలు బయట సెటిల్‌ అయిపోయారు. పులివెందులలో జగన్‌ జెడ్పీటీసీ స్థానాన్ని కోల్పోయారు. చంద్రబాబు కంచుకోట కుప్పం మాత్రం చెక్కు చెదరలేదు. ఇప్పుడు జగన్‌ కృష్ణాష్ఠమి సందేశం ఎవరికి వర్తిస్తుందో.. విజ్ఞులైన ప్రజలకు అర్థమయ్యే ఉంటుంది.

ALSO READ  Rape Case: సూర్యాపేట జిల్లాలో దారుణం.. యువ‌తికి మ‌ద్యం తాగించి కొన్నిరోజులుగా లైంగిక‌దాడి

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *