Kotam Reddy Picture Super

Kotam Reddy Picture Super: సినిమా చూపిస్తున్న కోటంరెడ్డి.. ప్రత్యర్థులు పరార్‌!

Kotam Reddy Picture Super: ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు చాలా డిఫరెంట్‌గా ఉంటాయి. ఆంధ్ర ప్రజలు అతిరథ మహారథులను సైతం ఒకసారి గెలిపిస్తే మరోసారి ఓడిస్తారు. ఇందులో బడా బడా లీడర్లకు సైతం మినహాయింపు ఇవ్వరు ఆంధ్ర ఓటర్లు. అయితే ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా పదిహేనేళ్లు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో.. ప్రత్యర్థులకు, బడా రాజకీయ కుటుంబాలకు, వేల కోట్ల కోటీశ్వరులకు ఓటమి రుచి చూపిస్తున్నారు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. నెల్లూరు జిల్లాలో హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా రికార్డ్ క్రియేట్ చేసి.. మూడోసారి వరుసగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యేగా గెలిచేశారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి ఫస్ట్ టైమ్ ఎమ్మెల్యేగా గెలిచేటప్పటికి.. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిది సాదాసీదా ఫ్యామిలీనే. డబ్బు బలం కూడా నామమాత్రమే. కానీ 2014లో బీజేపీపైన, 2019లో టీడీపీపైన, 2024లో వైసీపీపైన మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు. ఏదో గాలివాటంలో గెలిచాడు, అధినేతల ఇమేజ్‌పై గెలిచాడు.. అని ప్రత్యర్థులు చేసే గాలి ప్రచారం అంతా బూటకమని కోటంరెడ్డి రోజువారీ రాజకీయం చూస్తే తెలుస్తుంది.

నెల్లూరు జిల్లాలో రాజకీయం చేయాలంటే బడా రెడ్లు, రాజకీయ కుటుంబాల కింద అణిగిమణిగి ఉండాలి. వారి దయాదాక్షిణ్యాలతో పోటీ చేయాలి. ఎన్నికల్లో డబ్బు ఖర్చు పెట్టాలి. గెలవాలి. నేదురుమల్లి, నల్లపరెడ్డి, ఆనం, మాగుంట కుటుంబాల రాజకీయం నడిచే రోజుల్లో నెల్లూరు రాజకీయం అలాగే ఉండేది. కానీ నెల్లూరు జిల్లా కేంద్రంలో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి లాంటి సామాన్యుడు ఎమ్మెల్యేగా పోటీ చేసిన తర్వాత సీన్ పూర్తిగా మారిపోయింది. ఆయన పొలిటికల్‌ జర్నీ చూస్తే.. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా.. ప్రజల సమస్యలపై పోరాడటంలో ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. విపక్షంలో ఉన్నప్పుడు.. అధికార పక్షం మంత్రులపై పోరాటాలే కాదు.. తన సొంత నియోజకవర్గం కోసం అవసరమైతే అధికార పార్టీ నేతలతో సత్సంబంధాలు మెయింటైన్‌ చేశారు. ఎమ్మెల్యేగా ప్రతి టర్మ్‌లోనూ నియోజకవర్గం ప్రజలతో పాస్ మార్కులు వేయించుకోవడమే ఆయనకు తెలిసిన రాజకీయం.

Also Read: Harihara Pawan Kalyan: డిప్యూటీ సీఎం తాలూకా.. యుద్ధానికి సిద్ధమా?

Kotam Reddy Picture Super: 2019 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వచ్చింది. తనను రెండోసారి గెలిపించిన నెల్లూరు రూరల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకునే పవర్.. అధికార పార్టీ ఎమ్మెల్యేగా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి వచ్చింది. కానీ జగన్ టైమ్‌లో తన నియోజకవర్గ అభివృద్ధికి నిధులు పెద్దగా రాకపోవడం, ప్రజల సమస్యలు పెద్దగా పరిష్కారం కాకపోవడంతో.. వైసీపీలో ఉంటూనే జగన్‌ పేషీలోని ధనుంజయ రెడ్డి లాంటి అధికారులతో పోరాటం చేయాల్సి వచ్చింది. తన నియోజకవర్గంలోని స్లమ్‌ ఏరియాలో పేద ప్రజల మురుగునీటి కష్టాలు తీర్చేందుకు, ప్రభత్వం కళ్లు తెరిపించేందుకు… ప్రభుత్వ ఆసుపత్రి నుంచి వచ్చే వ్యర్థాలతో కలగలిసిన మురుగు నీరు పారే బురద గుంటలో దిగారు కోటంరెడ్డి. ఈ నిరసన అప్పట్లో సంచలనంగా మారింది.

నిధులు కావాలి, పనులు కావాలని జగన్‌ని కలిసేందుకు ప్రయత్నించే క్రమంలో కోటంరెడ్డికి కనీసం అపాయింట్‌మెంట్ కూడా లభించలేదని, ఇందుకు ప్రధాన కారణం అప్పటి ఐఏఎస్ అధికారి ధనుంజయ రెడ్డేనని వివాదం కూడా నడిచింది. జగన్‌ని కంట్రోల్ చేస్తూ.. డీఫ్యాక్టో సీఎంగా పేరుపొందిన ఐఏఎస్‌ ధనుంజయ రెడ్డి.. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని అవమానించడంతోనూ, జగన్‌కు చాడీలు చెప్పి దూరం పెంచడంతోనూ.. విసిగిపోయిన కోటంరెడ్డి ధైర్యంగా ఎన్నికలకు ఏడాది ముందే వైసీపీపై తిరుగుబాటు ప్రకటించారు. జగన్ నైజం, కక్ష సాధింపులు తెలిసి కూడా… తన ఆత్మాభిమానం కోసం, నెల్లూరు రూరల్ నియోజకవర్గం ప్రజల సమస్యల కోసం వైసీపీపై ఏడాది కాలం పాటు సాగించిన పోరాటం కోటంరెడ్డికి గొప్ప ఇమేజ్ తెచ్చిపెట్టింది.

Also Read: PSLV-C61 ప్రయోగంలో సాంకేతిక సమస్య.. మూడోదశలో గుర్తించిన ఇస్రో..!

Kotam Reddy Picture Super: అప్పటికే జగన్ పాలనతో విసిగిపోయిన జనాలకు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి బూస్ట్ ఇచ్చారు. అనూహ్యంగా తెలుగుదేశం పార్టీలో జాయిన్ కావడం, టికెట్ దక్కించుకుని నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎవరూ సాధించని రికార్డ్ మెజారిటీతో గెలవడంతో పాటూ… హ్యాట్రిక్ ఎమ్మెల్యే రికార్డ్‌ని కూడా నమోదు చేసుకున్నారు. ఇన్ని పొలిటికల్ రికార్డ్స్ సాధించిన కోటంరెడ్డి మూడోసారి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత చంద్రబాబు, లోకేష్, మంత్రి నారాయణల సహకారంతో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి జాతర మొదలుపెట్టారు. జస్ట్ ఫస్ట్ ఇయర్‌లోనే నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి దాదాపు ఐదొందల కోట్లు అభివృద్ధి పనుల కోసం సాధించారు కోటంరెడ్డి.

పేద, మధ్య తరగతి ప్రజలకు సౌకర్యాలు మెరుగుపర్చేందుకు 40 కోట్లతో 331 పనులు చేపట్టి.. నెల రోజుల్లోనే పూర్తి చేసి.. ప్రారంభోత్సవాలు చేసి.. మరో ప్రత్యేక రికార్డ్ సాధించారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, చంద్రబాబు, లోకేష్‌ల అభినందనల మధ్య ప్రజల చేతే అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు చేశారు. కోటంరెడ్డి నిత్యం ఫుల్ టైమ్ రాజకీయాలు చేస్తూ, వందల కొద్దీ అభివృద్ధి పనులు చేపడుతూ ప్రజల్లో ఫుల్ క్రేజ్ పెంచుకుంటున్నారు. కోటంరెడ్డి హవా ఎంతలా నడుస్తోందంటే.. రాష్ట్రంలో ఇప్పుడు అనేక నియోజకవర్గాల్లో ప్రజలు… తమకు కూడా కోటంరెడ్డి లాగా పనులు, నిధులు సాధించే ఎమ్మెల్యే ఉంటే ఎంత బాగుండేదో కదా.. అంటూ చర్చించుకుంటున్నారు. మొత్తానికి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పనితీరు కూటమి ప్రభుత్వంలో మిగతా ఎమ్మెల్యేల్లో పోటీ తత్వాన్ని పెంచుతోంది అంటున్నారు పరిశీలకులు.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *