Kavita Reactions

Kavita Reactions: ఫామ్‌హౌస్‌ సీక్రెట్స్‌.. బీఆర్‌ఎస్‌ని షేక్‌ చేస్తున్న కవిత!

Kavita Reactions: కవిత రాజీనామా బీఆర్‌ఎస్‌ని షేక్‌ చేస్తోందా? అంటే అవుననే సమాధానమే ఎర్రవల్లి వర్గాల నుండి వినిపిస్తోంది. కవిత సస్పెన్షన్‌తో బీఆర్ఎస్‌లో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఎమ్మెల్సీ పదవికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన కల్వకుంట్ల కవిత.. తన ట్విట్టర్ హ్యాండిల్ నుంచి కారు గుర్తును తొలగించారు. బయోలో మాజీ ఎంపీ, తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలిగా పేర్కొన్నారు. అదే విధంగా లండన్‌లో మీట్ ది ప్రెస్‌లో మాట్లాడిన మాజీ మంత్రి హరీశ్ రావు కవిత వ్యాఖ్యలకు పరోక్షంగా కౌంటర్ ఇచ్చారు. బీఆర్ఎస్‌లో కేసీఆరే సుప్రీం అని, ఎవరికైనా ఆయన నిర్ణయమే శిరోధార్యమని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా మాజీ సీఎం కేసీఆర్ ఎర్రవల్లిలోని తన వ్యవసాయ క్షేత్రంలో గణపతి హోమం నిర్వహించారు. మరో వైపు బీఆర్ఎస్ సోషల్ మీడియా మిగతా విషయాలన్నీ పక్కన పెట్టి.. కవిత టార్గెట్‌గా పోస్టులు పెడుతుండటం హాట్ టాపిక్‌గా మారింది. మహిళ అని కూడా చూడకుండా బూతుపురాణం అందుకున్నారు బీఆర్‌ఎస్‌ క్యాడర్‌. ఈ పరిణామాలను గమనిస్తున్న కవిత సోషల్ మీడియా టీం.. పెద్దగా రియాక్ట్ కావడం లేదు.

బీఆర్‌ఎస్‌లో కవిత పలుమార్లు వ్యతిరేక గళం వినిపించినప్పటికీ… కేసీఆర్‌ మౌనమే దాల్చారు. కానీ హరీశ్‌రావుపై విమర్శలు చేయగానే.. అధిష్ఠానం సీరియస్‌గా రియాక్ట్‌ అయ్యి.. క‌విత‌పై స‌స్పెన్ష‌న్ వేటు వేసింది. ఇది జ‌రిగిన త‌ర్వాత‌.. హ‌రీష్ రావు స్పందించారు. అయితే.. ఆయ‌న ఎక్క‌డా క‌విత పేరును ప్ర‌స్తావించ‌లేదు. పైగా.. చాలా లైట్ తీసుకున్న‌ట్టు స్ప‌ష్టంగా క‌నిపించింది. తనపై విమ‌ర్శ‌లు చేసిన వారి విజ్ఞ‌త‌కే ఈ విష‌యాన్ని వ‌దిలేస్తున్నా అంటూ హ‌రీష్ రావు ఒక్క ముక్కలో తేల్చేశారు. క‌విత పేరును కూడా ఎత్తేందుకు హ‌రీష్ రావు ఇష్ట‌ప‌డ‌లేద‌ని తెలుస్తోంది. దీంతో క‌విత వ్య‌వ‌హారాన్ని హ‌రీష్ రావు లైట్ తీసుకున్న‌ట్టు స్ప‌ష్ట‌మైంది. ఫ‌లితంగా క‌విత‌కే ఈ వ్య‌వ‌హారంలో డ్యామేజీ జ‌రుగుతుంద‌ని పలువురు భావిస్తున్నారు. ఒక రకంగా హరీశ్‌ రావు.. కవితకు మళ్లీ తనపై మాట్లాడే అవకాశం లేకుండా చెక్‌ పెట్టారని అనుకోవచ్చు. ఇప్పుడు కవిత చేసిన ఆరోపణలు… ఇప్పుడు ఆమెకే ఎదురు నిలిచే అంశంగా మారాయంటున్నారు కొందరు అనలిస్టులు.

Also Read: PNB Scam Case: భారత్ కు మెహుల్ చోక్సీ.. జైలు లో దిమ్మతిరిగిపోయే వసతులు..!

అయితే హరీశ్‌రావుపై కవిత చేసిన ఆరోపణలు.. ఆమెకు పబ్లిక్‌లో మైలేజ్‌ తీసుకురాకున్నా.. మరో రకంగా పనిచేస్తుండటం గమనార్హం. ఎలాగంటే.. కవిత చేసిన అవినీతి ఆరోపణలపై.. బీఆర్‌ఎస్‌ నేతలు పైకి మేకపోతు గాంభీర్యాలు ప్రదర్శిస్తున్నా… పార్టీ లోపల పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. సంతోష్ రావు, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డితో కలిసి మోకిలాలో భారీ విల్లా ప్రాజెక్టు నిర్మిస్తున్నారని.. దానికి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయని కవిత ప్రశ్నించారు. అతి సాధారణ కుటుంబం నుంచి వచ్చిన పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి వందల కోట్లు ఎలా సంపాదించారంటూ కవిత చేసిన వ్యాఖ్యలపై పార్టీలో చర్చ జోరుగానే నడిచిందట. ఇలాంటి సమయంలో పోచంపల్లిని కేసీఆర్‌ తన ఫామ్ హౌస్‌కి పిలిపించడం, అదే సమయంలో లండన్ నుంచి వచ్చిన హరీష్ రావు.. వచ్చీ రాగానే ఒకట్రెండు కార్యక్రమాలు చూసుకుని నేరుగా ఫామ్ హౌస్‌కు చేరుకోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. అప్పటికే ఫామ్‌ హౌస్‌లో కేటీఆర్ సహా కీలక నేతలందరూ ఉన్నారు. దీంతో ఏదో పెద్ద చర్చే ఫామ్ హౌస్‌లో జరుగుతోందన్న అభిప్రాయం వినిపిస్తోంది. ప్రస్తుతానికి హరీశ్‌రావుకు పార్టీ మద్ధతుగా నిలబడటం, హరీశ్‌ రావు కూడా తన విధేయతను చాటుకోవడం సరే కానీ.. కవిత ఆరోపణల ప్రభావం భవిష్యత్తులో హరీశ్‌రావుపై ఎలా ఉండబోతోందన్న చర్చ హాట్‌ లైన్‌లోకి వస్తోంది.

ALSO READ  Aarya: హీరో ఆర్య నివాసంలో ఐటీ సోదాలు: కారణమేంటి?

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *