Jubilee Hills Seat Big War: హై ఓల్టేజ్ వార్‌ని తలపిస్తున్న జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికపై ప్రధాన పార్టీలు కన్నేశాయి. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ ఇటీవలే అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలిసిందే. దీంతో ఈ సంవత్సరం డిసెంబర్ చివర్లో ఉప ఎన్నిక వచ్చే అవకాశం ఉంది. దీంతో రాజకీయ పార్టీలలో ఆశవాహులు ఎవరికి వారు తమ ప్రయత్నాలు చేస్తున్నారు. మాగంటి గోపీనాథ్ కుటుంబం నుండే ఒకరు బరిలో దిగుతున్నందున సెంటిమెంట్ ఫ్యాక్టర్ బలంగా పనిచేసే అవకాశం ఉంటుంది. అయితే ఉప ఎన్నికల్లో అధికారంలో ఉన్న పార్టీయే విజయం సాధించిన సందర్భాలు అనేకం. అందుకే అధికారంలో ఉన్న హస్తం పార్టీలో టికెట్ కోసం ఎవరికి వారు ముమ్మర ప్రయత్నాలు మొదలు పెట్టారు. మరో వైపు బీజేపీ కూడా సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతూ… ఇప్పటికే ప్రచారం కూడా మొదలు పెట్టేసింది. దీంతో ఈ ఉప ఎన్నిక రసవత్తరంగా మారింది.
బీఆర్‌ఎస్ విషయానికొస్తే.. మాగంటి మృతితో సింపతీ ఫ్యాక్టర్ ఉన్నప్పటికీ.. కుటుంబంలో టికెట్ ఎవరికివ్వాలన్న ఈక్వేషన్‌మాత్రం కష్టతరంగా మారింది. మాగంటి గోపినాథ్ భార్యకు టికెట్ ఇస్తే.. ఆమెకు కార్యకర్తలు ఏ మేరకు సహకరిస్తారు అనే అనుమానాలు కూడా లేకపోలేదు. ఆమెకు కార్యకర్తల్లో ఏమంత గుడ్ విల్ లేదన్నది వినిపిస్తోన్న వాదన. ఈ పాయింట్ మీదే మాగంటి గోపీనాథ్ సోదరుడు వజ్రనాథ్ కూడా రంగంలోకి దిగి టికెట్ ఆశిస్తున్నారు. ఇప్పటికే గ్రౌండ్ లెవల్‌లో ఆయన తిరుగుతున్నారు. జూబ్లీహిల్స్ పరిధిలో ఏ చిన్న కార్యక్రమం ఉన్నా… అక్కడికి వెళ్తూ కార్యకర్తలను తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు.
తెలాంగాణ లోకల్ ఎన్నికల్లో, అందులోనూ హైదరాబాద్ స్థానిక ఎన్నికలపై ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రభావం ఉంటుంది. అందుకోసమే తమ సీటును తామే గెలవాలని బీఆర్‌ఎస్ కోరుకుంటోంది. ముఖ్యంగా అవినీతి, ఫోన్ ట్యాపింగ్ కేసులు ఎదుర్కొంటున్న బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నాయకత్వానికి ఈ ఉప ఎన్నిక ఒక లిట్మస్ టెస్ట్ లాంటిది. బీఆర్‌ఎస్ పగ్గాలు తనకే కావాలని పార్టీ లోపలా, బయటా కొట్లాడుతున్న కల్వకుంట్ల కవిత.. కేటీఆర్‌ను ఒక రకంగా భయపెడుతున్నారు. కేటీఆర్ ఈ ఉప ఎన్నిక గెలవకుంటే.. కవిత తన వాణిని, తన డిమాండ్‌ని మరింత బలంగా వినిపించే అవకాశం ఉంటుంది. అదే విధంగా ఓవరాల్‌గా స్థానిక ఎన్నికలపై ఈ ఉప ఎన్నిక ప్రభావం చూపుతుంది. దీంతో జూబ్లీహిల్స్ బై ఎలక్షన్.. కేటీఆర్‌కి టెస్ట్ డ్రైవ్ లాంటిదే అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Also Read: Kilaru Rosaiah Janasena: వైసీపీలోకి రీఎంట్రీకి సిద్దమౌతున్న కిలారి రోశయ్య..!
Jubilee Hills Seat Big War: ఇక అధికార కాంగ్రెస్ కూడా ఎలాగైనా ఈ ఉప ఎన్నిక గెలవాలని కసరత్తు చేస్తోంది. 2023 ఎన్నికలో జూబ్లీహిల్స్ నుండి కాంగ్రెస్ తరుపున ఎమ్మెల్యేగా అజారుద్దీన్ పోటీ చేశారు. మాగంటి గోపినాథ్ చేతిలో ఓటమిపాలైయ్యారు. మరోసారి టికెట్ ఆశించడమే కాకుండా… బరిలో నేనే ఉంటానని ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. అజారుద్దీన్ స్టేట్మెంట్ తర్వాత టికెట్ కోసం ఎవరి ఎత్తుగడలు వారు వేస్తున్నారు. ఇందులో నవీన్ యాదవ్, అలాగే మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నాలు మొదలు పెట్టిన్నట్లు తెలుస్తోంది. బొంతు రామ్మోహన్ మున్నారు కాపు సామజికవర్గానికి చెందిన నేత కాగా, ఆయన భార్య యాదవ సామజికవర్గానికి చెందిన వారు. ఒకే ఇంట్లో రెండు సామజిక వర్గాలు ఉండటం, జీహెచ్ఎంసీ మాజీ మేయర్‌గా బొంతు రామ్మెహన్‌కు బల్దియా ఏరియాపై మంచి పట్టుండటం ఆయనకు కలిసొస్తోంది. ఇక చిన్న శ్రీశైలం యాదవ్ కుమారుడు నవీన్ కుమార్ యాదవ్.. గతంలో కూడా జూబ్లీహిల్స్ బరిలో ఎంఐఎం పార్టీ తరుపున ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి పాలయ్యాడు. 2023 ఎన్నికలకు ముందు కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకున్నాడు. 2023 అసెంబ్లీ ఎన్నికలోనే జూబ్లీహిల్స్ టికెట్ సైతం ఆశించాడు కానీ అప్పటి పరిస్థితులో కుదర్లేదు. లోకల్ కాండిడేట్, పైగా యాదవ్ సామజికవర్గం కావడంతో టికెట్ తనకే వస్తుందని గట్టి ఆశతో ఉన్నారట నవీన్ యాదవ్.
ఇంత గట్టి పోటీ ఉన్న జూబ్లీహిల్స్‌లో పోలింగ్ శాతం చాలా తక్కువ. మాస్ వోటింగ్ ఎటువైపు మక్కువ చూపిస్తే ఆ అభ్యర్థే గెలిచే ప్లేస్ ఇది. పేరుకు జూబ్లీహిల్స్ కాస్ట్‌లీ ఏరియా అయినా… ఎమ్మెల్యే గెలుపులో మాత్రం లోకల్ మాస్ వోటింగే ప్రభావం చూపిస్తుంది. ఇప్పుడు ఆ మాస్ ఓటింగ్ చుట్టూనే అభ్యర్థుల భవిష్యత్తు ఆధారపడి ఉంది.