Jagan work from home: వైసీపీ అధినేత జగన్‌మోహన్ రెడ్డి రాజకీయం ఆంధ్రప్రదేశ్‌లో చర్చనీయాంశంగా మారుతోంది. 11 సీట్లతో ప్రజల చీత్కారానికి గురైన తర్వాత కూడా జగన్ తన ‘వర్క్ ఫ్రమ్ బెంగళూరు’ శైలితో ప్రజల నుండి మరింతగా దూరమవుతున్నారు. వారంలో నాలుగు రోజులు తాడేపల్లి ప్యాలెస్‌లో ఉంటే.. మూడు రోజులు బెంగళూరులోని యెలహంక ప్యాలెస్‌కు పరిమితం అవుతున్నారు. సోషల్ మీడియా ద్వారా చంద్రబాబు నాయుడుపై బురదచల్లడమే ఆయన రాజకీయంగా మారింది. ఈ వైఖరి వైసీపీకి రాజకీయంగా ఆత్మహత్యా సదృశ్యంగా మారుతోందని వైసీపీ నేతలే స్వయంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రాజకీయ నాయకుడిగా ప్రజల మధ్య ఉండి, వారి సమస్యలను పరిష్కరించడం ఇప్పుడు అవసరం లేని పనిగా జగన్ భావిస్తున్నట్లు ఉన్నారు. 2019-2024 మధ్య సంక్షేమ పథకాల పేరుతో డబ్బు పంచిన జగన్, అమరావతి, పోలవరం వంటి అభివృద్ధి ప్రాజెక్టులను నిర్వీర్యం చేశారు. ఫలితంగా 2024 ఎన్నికల్లో ప్రజలు వైసీపీని తిరస్కరించారు. అయినప్పటికీ, జగన్ శాసనసభకు హాజరు కాకుండా, ప్రజల మధ్యకు వెళ్లకుండా, బెంగళూరు నుండి ట్వీట్లతో రాజకీయం చేస్తున్నారు. అందుకే.. కూటమి నేతలు నాదెండ్ల మనోహర్, అనిత వంటివారు జగన్‌ను ‘వర్క్ ఫ్రమ్ బెంగళూరు’ నాయకుడిగా ఎద్దేవా చేస్తూ, ఆయనకు రాష్ట్ర పరిస్థితులు అర్థం కావని విమర్శిస్తున్నారు.
Also Read: Vishakapatnam: విశాఖ మెట్రో ప్రాజెక్టుకు వేగం – టెండర్ల ప్రక్రియలో ఆసక్తికర స్పందన
Jagan work from home: మరోవైపు, చంద్రబాబు నాయుడు అమరావతి, పోలవరం, ఐటీ పరిశ్రమల ద్వారా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారు. యువతకు ఉద్యోగాలు, నైపుణ్య శిక్షణ, విద్యా సంస్థల ఏర్పాటుతో చంద్రబాబు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తున్నారు. 52 ఏళ్ల వృద్ధిడిలా జగన్ ప్యాలెస్‌లకు పరిమితమై బురద రాజకీయాలు, అమరావతిపై విషప్రచారం చేస్తూ కాలం వృథా చేస్తుంటే, 73 ఏళ్ల యువకుడిలా చంద్రబాబు రాష్ట్ర భవిష్యత్తును తీర్చిదిద్దేందుకు పరుగులు పెడుతున్నారు. జగన్ ఇదే వైఖరి కొనసాగిస్తే, 2029 ఎన్నికల్లో వైసీపీకి ఒక్క సీటు కూడా రాకపోవచ్చని పరిశీలకులు హెచ్చరిస్తున్నారు.