Jagan vs Vijaya

Jagan vs Vijaya: అడ్డొచ్చిన తల్లిని, చెల్లిని తొక్కుకుంటూ పోయిన జగన్‌!

Jagan vs Vijaya: 2019లో, అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న జగన్, తన సోదరి షర్మిలతో కలిసి ఆస్తుల విభజనకు సంబంధించి MoUపై అనగా, మెమోరాండం ఆఫ్ అండర్‌స్టాండింగ్‌పై సంతకం చేశారు. ఈ ఒప్పందం ప్రకారం, జగన్‌కు 60 శాతం, షర్మిలకు 40 శాతం ఆస్తులు దక్కాలని నిర్ణయించారు. సరస్వతి పవర్, భారతి సిమెంట్స్, సాక్షి మీడియాలలో వాటాలు, ఎలహంక ఇల్లు షర్మిలకు బదిలీ చేయడానికి అంగీకరించారు. 2021లో, జగన్ తన భార్య భారతితో కలిసి తమ వాటాలను తల్లి విజయలక్ష్మికి గిఫ్ట్ డీడ్ ద్వారా బదిలీ చేశారు. ఆస్తులపై న్యాయపరమైన సమస్యలు ఉన్నందున, ఈ బదిలీ తాత్కాలికమని, సమస్యలు పరిష్కారమైన తర్వాత చట్టబద్ధంగా వాటాలు పంచుకుంటామని నాడు జగన్ చెప్పారు. కానీ, రాజకీయంగా షర్మిల తనకు వ్యతిరేకంగా వెళ్లడంతో జగన్ తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. సరస్వతి పవర్ సంస్థ విలువ పెరగడంలో తాను, తన భార్య భారతి కీలక పాత్ర పోషించామని, అందువల్ల ఈ వాటాలను షర్మిలకు ఇవ్వలేనని ఎన్సీఎల్టీలో పిటిషన్ దాఖలు చేశారు. తల్లి విజయలక్ష్మి, షర్మిలలకు వాటాల బదిలీని నిలిపివేయాలని కోరారు. విచారణలో, ఎన్సీఎల్టీ జగన్ వాదనలతో ఏకీభవించి, వాటాల బదిలీని నిలుపుదల చేస్తూ తీర్పు ఇచ్చింది. కానీ ఈడీ, సీబీఐ విచారణల కారణంగా వాటాల బదిలీకి అవకాశం లేదని తేల్చింది. ఈ తీర్పు విజయలక్ష్మి, షర్మిలకు ఆర్థికంగా ఎదురుదెబ్బ కాగా, జగన్‌కు చట్టపరమైన విజయంగా నిలిచింది.

Also Read: Jagan Alert: ఈ ఆరాటమంతా సతీమణిని తప్పించేందుకేనా?

అయితే, ఈ విజయం జగన్‌ను ఒక కొడుకుగా, ఒక అన్నగా నైతికంగా ఓడించింది. తల్లి, చెల్లితో కలిసి సంతకం చేసిన ఒప్పందానికి ఏ మాత్రం విలువనివ్వకుండా జగన్ కోర్టును ఆశ్రయించారు. పైగా తల్లీ, చెల్లినే తనను మోసం చేస్తున్నారని కోర్టుకు చెప్పారు. అదే సమయంలో విజయలక్ష్మి తన కొడుకు చెబుతున్నవన్నీ అబద్దాలని కోర్టుకు లేఖ ద్వారా స్పష్టం చేశారు. మొత్తానికి ఎవరు మోసం చేశారో, ఎవరివి అబద్దాలో పక్కనబెడితే.. వైఎస్‌ కుటుంబంలో ఆస్తులకు తప్ప, ఆప్యాయతలకు చోటు లేదని ప్రజలు కళ్లారా చూస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారం తెలియజేస్తోంది ఒక్కటే. జగన్‌కు ఆస్తుల పట్ల ఎంత వ్యామోహమో ఈ సంఘటన తెలియజేస్తోందంటున్నారు. చట్టపరంగా గెలిచినా.. సొంత తల్లిని, చెల్లిని మోసం చేసిన వాడిగా జగన్‌ నైతికంగా ఓడిపోయారని అంటున్నారు. అయితే విజయలక్ష్మి ఈ తీర్పును హైకోర్టులో సవాల్ చేసే అవకాశం కనిపిస్తోంది. ఈ వివాదం వైఎస్‌ కుటుంబంలో ఏర్పడిన బీటలు, ఆస్తుల కోసం ఒకరినొకరు చేసుకున్న మోసాలను బహిర్గతం చేస్తోంది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *