Jagan Tenali Tour: ఇంతకంటే ఎక్కువ దిగజారరు అనుకున్న ప్రతి సారీ వైసీపీ అధినేత జగన్, ఆ పార్టీనేతలు మరింత దిగజారి వ్యవహరిస్తున్నారు. కుల, మత విధ్వేషాలు రెచ్చగొట్టడం తమ రాజకీయ సిద్దాంతంగా పెట్టుకున్న వైసీపీ ఆ తరహా ఆలోచనలు మానుకోకపోగా.. మరింత పదును పెడుతోంది. ఇందులో భాగంగా రౌడీషీటర్లకు, గంజాయి బ్యాచ్‌కు జగన్ మద్దతు ఇస్తున్నారు. తెనాలిలో రౌడీ షీటర్లకు పోలీసులు గట్టి ట్రీట్మెంట్ ఇచ్చారు. ఈ వీడియో బాగా వైరల్ అయ్యింది. అయితే వాళ్లు కరుడుగట్టిన నేరస్తులని తేలడంతో సమాజం పోలీసు చర్యలను సమర్థించింది. కానీ దీని నుంచి కూడా రాజకీయ ప్రయోజనం కోరుకుంటున్న జగన్ రెడ్డి.. రౌడీషీటర్లను పరామర్శించడం ద్వారా తన మార్కు నీచ రాజకీయానికి తెర తీస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయ్.
తెనాలి వెళ్లి ఆ రౌడీ షీటర్లను పరామర్శిస్తానని జగన్ చెప్పడంతో ఉలిక్కిపడ్డ వైసీపీ జిల్లా నేతలు ఆ పని మాత్రం చేయొద్దని జగన్‌ని వేడుకుంటున్నారట. ఈ పర్యటన రాజకీయంగా ఉపయోగపడకపోగా… ప్రజల్లో మరింత చులకన అవుతామని చెపుతూ…. ఆ రౌడీ షీటర్ల బ్యాక్ గ్రౌండ్‌ను జగన్‌కు వివరించారట. అయితే ఇవన్నీ ప్రజలకు ఏం అర్థమౌతాయి అంటూ నేతలను వారించిన జగన్.. మనం వెళితే మంచి మైలేజ్ వస్తుందని 3వ తేదీ పరామర్శకు సిద్దం అవుతున్నట్లు తెలుస్తోంది. ఒక ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి గంజాయి బ్యాచ్‌కు, రౌడీ షీటర్లకు మద్దతుగా వెళ్లడం కంటే దారుణం ఇంకొకటి ఉంటుందా అంటూ వైసీపీ నేతలే అవాక్కవుతున్నారట. నాడు సీఎంగా ఉండి దళితులపై, మైనారిటీలపై దమనకాండను కనీసం ఖండించని జగన్… ఇప్పుడు రౌడీ షీటర్లకు మద్దతుగా నేరుగా వెళతాను అనడంపై తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయ్. జగన్ చేస్తున్న ఈ ఆలోచనతో వైసీపీ నేతలు సైతం అంతర్మధనం చెందుతున్నారు. ఈ గేమ్ తమను పూర్తిగా డిఫెన్స్ లోకి నెట్టి పడేస్తుందని భయపడుతున్నారట వైసీపీ నేతలు.
Also Read: MLA Raja Singh: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు
Jagan Tenali Tour: రెండు రోజుల క్రితం వైసీపీ అధినేత జగన్ ఓ వివాహ వేడుకకు హాజరయ్యారు. ఆ సందర్భంగా అధినేత కోసం మాజీ మంత్రి పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. ఇక జగన్‌ను చూసేందుకు వచ్చిన వైసీపీ సైకోలు.. పిచ్చి పట్టినట్లుగా వ్యవహరించారు. అటుగా వెళ్తున్న చిన్న పిల్లాడు సైకిల్ లాక్కున్నారు. దానిని నేలకేసి కొట్టారు. సైకిల్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. అంకుల్ సైకిల్ అని పిల్లాడు ఏడుస్తున్నా జాలీ చూపలేదు. సైకిల్‌ను కాళ్లతో తొక్కి విరగొట్టారు. ఈ సైకోల చర్యలతో ఒక్కసారిగా భయపడిన పిల్లాడు.. సైలెంట్‌గా సైకిల్ తీసుకుని వెళ్లిపోయాడు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. జగన్ 2.0 ఎలా ఉంటుందో ఈ ఒక్క ఉదాహరణ చాలు అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. వైసీపీ మరోసారి అధికారంలోకి వస్తే.. ప్రజలపై దాడులు పెరిగిపోతాయనడానికి ఈ ఒక్క ఘటన చాలు అంటున్నారు. ఇంత దారుణంగా వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. చిన్న పిల్లాడిపై మీ ప్రతాపం ఏమిటని ఏపీ ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నరు. కొందరైతే.. సైకో పార్టీనా మజాకా.. అని కామెంట్ చేస్తున్నారు. ఇక ఈ సంఘటనపై స్పందించిన నారా లోకేష్.. అబ్బే వాళ్ళేమీ మారలేదు… వాళ్ళేమీ మారరు కూడా… ఏ ముహూర్తాన సైకో అని పెట్టామో… ఆ పేరును సార్ధకం చేసుకోవడానికి నిరంతరం పని చేస్తూనే ఉంటారు. అందుకే నాటికి నేటికీ ఎప్పటికీ అదొక సైకో పార్టీ… వాళ్ళకో సైకోనాయకుడు! అంటూ పోస్ట్ చేశారు.
చిన్న పిల్లాడి సైకిల్‌పై ప్రతాతం చూపించి సైకో నామధేయాన్ని సార్థకం చేసుకున్న వైసీపీ.. అంతకుమించి బరితెగించి రౌడీ షీటర్లకు, గంజాయ్ బ్యాచ్‌కు అండగా నిలబడేందుకు రెడీ అయిపోయింది. షరా మామూలుగా ఆ పార్టీ అధినేత రౌడీషీటర్లను పరామర్శించి, బుగ్గలు తడిమి, తల నిమిరి, ఓదార్చి బయటకొస్తారు. ఓ ప్రెస్మీట్ కూడా ఖచ్చితంగా పెడతారు. ఇక పోలీసుల గుడ్డలూడదీస్తానని, రిటైర్డ్ అయినా పట్టుకొస్తానని, అంతు చూస్తానని ఎప్పటిలాగే బెదిరించడం కూడా చేస్తారు. అలా తనకి మతిస్థిమితం సరిగా ఉందో, లేదో.. తెనాలి నుంచి ప్రపంచానికి చాటనున్నారు జగన్మోహన్‌రెడ్డి. అసలే మొండోడు.. అన్నంత పనీ చేస్తాడేమోనని వైసీపీ నేతలు ఆందోళన చెందుతుంటే.. తమ చేతికి మట్టి అంటకుండా జగన్ అతి పెద్ద సెల్ఫ్ గోల్‌తో జనానిని తానేంటో తానే తెలియజేస్తాడంటూ కూటమి పార్టీల నేతలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

