Jagan Sattenapalli Show

Jagan Sattenapalli Show: రప్పా రప్పా.. ఇద్దర్ని బలిచ్చారు!

Jagan Sattenapalli Show: జగన్ రెంటపాళ్ల పర్యటనలో కుట్ర కోణం దాగి ఉనట్లు పోలీసులకు సమాచారం అందిందా? దేశం మొత్తం ఏపీ వైపు తిరిగి చూసే విధంగా నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో యోగాంధ్ర కార్యక్రమానికి పిలుపునిచ్చారు సీఎం చంద్రబాబు నాయుడు. ఈ నెల 21న వైజాగ్ వేదికగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. దానిని డిస్టబ్ చేయడానికే జగన్ రెంటపాళ్ల పర్యటనని హడావుడిగా ప్లాన్‌ చేసుకున్నట్లు పోలీసు, నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. తల్లికి వందనం కార్యక్రమంతో ఏపీ ప్రభుత్వానికి మంచి పేరొచ్చింది. యోగాంధ్రా, తల్లికి వందనం కార్యక్రమాలు డిస్టర్బ్ చేయాలనే.. వైసీపీ ఈ కుట్రకు తెరతీసిందంటూ ఇప్పుడు పోలీసులకు సమాచారం అందుతోంది.

గత ఏడాది జూన్ 4 ఏపీలో ఎన్నికల రిజల్ట్ వచ్చిన రోజు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని కోట్ల రూపాయలు బెట్టింగ్ కాశాడు సత్తెనపల్లి నియోజకవర్గం రెంటపాళ్లకు చెందిన వైసీపీ అభిమాని నాగమల్లేశ్వరరావు. ఫలితాలు తల్లకిందులయ్యాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో జూన్ 5న పురుగుల మందు తాగాడు నాగమల్లేశ్వరరావు. మృత్యువుతో పోరాడి జూన్ 9న ఆస్పత్రిలోనే మరణించాడు. ఆ తర్వాత మూడు రోజులకు అంటే.. జూన్ 12న అధికారం చేపట్టింది కూటమి ప్రభుత్వం. నాగమల్లేశ్వరరావు మరణించే నాటికి… జిల్లా వ్యాప్తంగా పోలీస్‌ స్టేషన్లలో డ్యూటీలో ఉన్నది వైసీపీకి ఫుల్‌ సపోర్ట్‌గా వ్యవహరించిన పోలీసులే. కానీ కూటమి ప్రభుత్వం, పోలీసుల వేధింపులే నాగమల్లేశ్వరరావుని ఆత్మహత్యకు పురిగొల్పాయంటూ స్టోరీ రాసుకొచ్చాడు జగన్మోహన్‌రెడ్డి.

Also Read:  Virat Kohli: లండన్‌లోని తన ఇంట్లో గిల్, పంత్‌లతో కోహ్లీ మీటింగ్..

Jagan Sattenapalli Show: బుధవారం సత్తెనపల్లి వెళ్లాలని ఫిక్స్ అయ్యారు జగన్. మొదట పోలీసులు అనుమతి లేదని చెప్పేశారు. పర్యటన పేరిట వైసీపీ ఏం చేస్తుందో ఇటీవలి జగన్ పొదిలి పర్యటనతో ఓ క్లారిటీ రావడంతో పోలీసులు అనుమతివ్వలేదు. పొదిలి పర్యటనలో పొగాకు రైతులతో ముఖాముఖి అంటూ శాంతి భద్రతల సమస్యను సృష్టించారు జగన్. అరాచక శక్తులను పొదిలిలో జమ చేసి లా అండ్ ఆర్డర్‌కు విఘాతం కల్గించారు. జగన్ పర్యటనల అనుభవాలతో ఆయన సత్తెనపల్లి టూర్‌కు వెళ్తానంటే పోలీసులు అభ్యంతరం చెప్పారు. కానీ, అదేపనిగా మేము వెళ్తాం, ఏం చేసుకుంటారో చేసుకోండి అన్నట్లుగా పోలీసులకు సవాల్ విసిరి మరీ రెంటపాళ్లకు వెళ్లారు వైసీపీ అండ్‌ కో. మూడు కార్లు, వంద మందితో మాత్రమే రెంటపాళ్లకు రావాలని పోలీసులు విధించిన నిబంధనని తుంగలో తొక్కారు జగన్మోహన్‌రెడ్డి. అందుకు తగ్గట్టు వైసీపీ క్యాడర్‌ను ముందు నుంచే రెచ్చగొట్టారు. అక్కడే… జగన్‌ పర్యటన లక్ష్యం నాగమలేశ్వర్ కుటుంబాన్ని పరామర్శించడం కాదనీ.. ప్రజలను రెచ్చగొట్టి శాంతి భద్రతల సమస్యను సృష్టించడమేనని అర్థమైంది.

ఇక గుంటూరులో జగన్‌రెడ్డి చేసిన రోడ్ షో అరాచకంగా మారింది. జగన్ రెడ్డి ప్రచార పిచ్చి వల్ల రెండు నిండు ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. పోయేదేదో నేరుగా పల్నాడుకు పోకుండా.. గుంటూరు నుండే బల ప్రదర్శన స్టార్ట్‌ చేశారు జగన్‌ రెడ్డి. ఈ క్రమంలో ఏటుకూరు రోడ్డు వద్ద ఆయన కాన్వాయ్‌లోని వాహనం ఢీకొని ఓ వృద్ధుడు గాయపడ్డాడు. అతన్నిరోడ్డున పక్కకు లాగేసి.. వైసీపీ కార్యకర్తలు వెళ్లిపోయారు. స్థానికుల అతడిని ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆ వృద్ధుడు చికిత్స పొందుతూ చనిపోయాడు. జగన్‌ కాన్వాయ్‌లో వృద్ధుడు చనిపోవడానికి కారణమైన AP26CE0001 సఫారీ కారు మరెవరిదో కాదు… సాక్షాత్తూ వైసీపీ నేత దేవినేని అవినాశ్‌ ముఖ్య అనుచరుడిదే అని తెలుస్తోంది. ప్రమాదం జరిగినపుడు దేవినేని అవినాశ్‌ కూడా అదే కారులో ఉన్నట్లు చెప్తున్నారు. ఇక సత్తెనపల్లిలో జగన్ ర్యాలీకి తీసుకువచ్చిన ఓ వ్యక్తి.. సొమ్మసిల్లి.. చనిపోయాడు. అయితే జగన్ రెడ్డి మాత్రం ఈ రెండింటిలో ఏ మరణాన్ని పట్టించుకోలేదు. తన దారిన తాను రెంటపాళ్లకు వెళ్లి రాజకీయం చేశారు. ప్రభుత్వం ఏర్పడక ముందే జరిగిన ఆత్మహత్యను.. రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పుకొచ్చారు.

Also Read: Jagan in Danger: ఈ ప్రమాదం వైసీపీని ముంచేయబోతుందా?

Jagan Sattenapalli Show: 2024లో ఎన్నికల ఫలితాల తర్వాత వైసీపీకి చెందిన కొంత మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. చాలా మంది దివాలా తీశారు. దీనికి కారణం బెట్టింగ్. జగన్ రెడ్డి వైనాట్ 175 అంటూ అందర్నీ నమ్మించారు. చివరికి పోలింగ్ ముగిసిన తర్వాత ఫీడ్ బ్యాక్ తెలుసుకుని కూడా గెలుస్తున్నాం అంటూ ఐ ప్యాక్ ఆఫీసుకు వెళ్లారు. ఆరా మస్తాన్ అనే వ్యక్తితో సర్వేలు రిలీజ్ చేయించుకున్నారు. జగన్ రెడ్డిని నమ్ముకుని వేల మంది వైసీపీ కార్యకర్తలు బెట్టింగులు కాసి సర్వం కోల్పోయారు. వారి కోసం జగన్ రెడ్డి చిన్న సాయం కూడా చేయలేదు. తప్పుడు సర్వేలు, ప్రచారాలతో క్యాడర్‌ను జగన్ మిస్ లీడ్‌ చేశారు. తాడేపల్లి ప్యాలెస్ నుంచి వచ్చే సర్వేలను సోషల్ మీడియాలో ప్రచారం చేసి.. క్యాడర్‌ను నమ్మించే ప్రయత్నం చేశారు. జగన్‌ను గుడ్డిగా నమ్మిన వారు.. అడ్డంగా బలైపోయారు. అలా బలైపోయిన వారిలో ఒకడే.. ఈ రెంటపాళ్లకు చెందిన నాగ మల్లేశ్వరరావు. తన ఓవరాక్షన్‌ వల్ల చనిపోయిన ఆ బాధితుడి కుటుంబానికి జగన్ రెడ్డి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. కానీ రెంటపాళ్ల వెళ్లి రాజకీయం మాత్రం చేశారు.

జగన్ రెడ్డి వ్యవహార శైలి సామాన్య ప్రజల్ని సైతం ఆశ్చర్య పరుస్తోంది. రాజకీయం కోసం.. ప్రాణాలు తీయడం.. తప్పుడు ప్రచారాలు చేయడమే కాదు.. కనీసం తనను చూసేందుకు వచ్చిన వారు ఇద్దరు చనిపోతే పట్టింకుకోకుండా వెళ్లిపోవడం ఆయన తీరును.. నైజాన్ని వెల్లడిస్తోందని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *