Jagan Return To AP

Jagan Return To AP: సీబీఐ దెబ్బకు జగన్‌ లీగల్‌ టీమ్‌ మల్లగుల్లాలు?

Jagan Return To AP: వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి లండన్ పర్యటనను హఠాత్తుగా ముగించుకొని బెంగళూరు తిరిగి వచ్చారు. 15 రోజుల పర్యటనకు సీబీఐ కోర్టు అనుమతి ఇచ్చినప్పటికీ, 10 రోజుల్లోనే ఆయన బెంగళూరు చేరుకున్నారు. ఈ ఆకస్మిక రాక వెనుక కారణం ఏమిటన్న చర్చ ఏపీ రాజకీయ వర్గాల్లో నడుస్తోంది. జగన్‌పై అక్రమాస్తుల కేసులో గత 12 ఏళ్లుగా బెయిల్‌పై ఉన్నారు. ఆయన విదేశీ పర్యటనలకు కోర్టు అనుమతి తప్పనిసరి. తాజా లండన్ పర్యటనకు షరతులతో కూడిన అనుమతి పొందారు. అందులో ఫోన్ నంబర్, ఈమెయిల్ వివరాలు సమర్పించాలని కోర్టు ఆదేశించింది. అయితే, జగన్ ఇచ్చిన ఫోన్ నంబర్ ఆయనది కాదట. ఫోన్‌ నంబర్‌ తప్పుగా పేర్కొనడమో, తనది కాకుండా వేరొకరి నంబర్‌ ఇవ్వడమో చేశారంటున్నారు. దీంతో సీబీఐ అధికారులు ఆయన్ను సంప్రదించలేకపోయారు. జగన్‌ వైఖరి అనుమానాస్పదంగా మారడంతో సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీపావళి సెలవుల తర్వాత దీనిపై విచారణ జరిగే అవకాశం ఉంది. విచారణలో జగన్‌ కోర్టు షరతుల్ని ఉల్లంఘించారని తేలితే బెయిల్ రద్దవడంతో పాటూ… భవిష్యత్ విదేశీ పర్యటనలకు అనుమతి నిరాకరణ జరగవచ్చన్న భయంతో జగన్ హడావుడిగా తిరిగి వచ్చినట్లు తెలుస్తోంది.

Also Read: PrabhasHanu: 1932 నుండి మోస్ట్ వాంటెడ్.. ‘రెబల్ స్టార్’ టైటిల్ రిలీజ్ టైమ్ ఫిక్స్

అసలు ఎవరికీ సమాచారం లేకుండా జగన్‌ సడన్‌గా ఊడిపడటంతో.. ఆయన ఆకస్మిక రాకను ఎలా ఎలివేట్‌ చేయాలో తెలియక వైసీపీ సోషల్‌మీడియా ఫాన్స్‌ తికమక పడుతుంటే, జగన్‌ రాక వెనుక అసలు కారణంపై స్పష్టత ఇవ్వలేకపోతోంది వైసీపీ. ఏది ఏమైనా జగన్‌ కోర్టు ఆదేశాలను ఉల్లంఘించినట్లు తేలితే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయి. అందుకే జగన్ నాలుగు రోజులు ముందుగానే వచ్చి తప్పించుకునే ప్రయత్నం చేసినట్లు న్యాయ వర్గాలు చెబుతున్నాయి. జగన్‌ తిరిగి వచ్చేశారు కాబట్టి ఇక ఆ తప్పుడు ఫోన్‌ నంబర్‌ ఇచ్చారనే అంశాన్ని కోర్టు సీరియస్‌గా తీసుకోకపోవచ్చు అంటున్నారు. మరి విచారణలో ఏం జరుగుతుందో చూడాలి.

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *