Jagan Rajinamalu

Jagan Rajinamalu: జగన్‌ ‘రాజీనామా’ సినిమా ఎలా ఉండబోతోంది?

Jagan Rajinamalu: వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాజకీయ రాగం మార్చారు, కానీ పాటలో స్వరం మాత్రం పాతదే! శాసనసభకు హాజరుకాకుండా, ప్రజల సమస్యలపై పోరాడే బదులు, కుంటి సాకులతో ప్రజలను మభ్యపెట్టే పనిలో పడ్డారు జగన్‌. మొన్నటిదాకా “ప్రతిపక్ష హోదా లేకుంటే సభకు రాను” అని హైకోర్టు మెట్లెక్కిన జగన్‌, ఇప్పుడు మాట మార్చారు. హోదా ఇవ్వకపోయినా పర్లేదు.. కనీసం మైక్‌ అన్నా ఇస్తారా? అని ఆయనే ప్రశ్న వేసుకుని, ఇవ్వరు గాక ఇవ్వరు అంటూ ఆయనే సమాధానం చెప్పుకున్నారు. మైక్‌ ఇస్తాం, సమయం ఇస్తాం.. సభకు రండి ప్లీజ్‌ అంటూ స్పీకర్‌ ఒకపక్క బతిమాలుకుంటున్నారు. సోషల్‌ మీడియాలో, కొన్ని యూట్యూబ్‌ చానళ్లలో డిబేట్లలో మాత్రమే కనిపించే జగన్‌ భక్త వైసీపీ లీడర్లు… జగన్‌కు మైక్‌ ఇవ్వడానికి చంద్రబాబు, కూటమి ప్రభుత్వం గజగజ వణికిపోతుంది అంటూ ఓవరాక్షన్‌ చేస్తున్నారు. ఇక మైక్‌ ఇస్తారో ఇవ్వరో సభకు వెళ్తే కదా తెలిసేది అంటూ జనం మాట్లాడుకుంటున్నారు. అసలు అసెంబ్లీకి వెళ్లకుండానే మైక్‌ ఇవ్వట్లేదని గోల చేయడం ఏమిటి? మైక్‌ కావాంటే మనకే అసెంబ్లీకి వెళ్లాలి కానీ, ఇంట్లో కూర్చుకుంటే మైకు తాడేపల్లికి రాదు కదా అంటూ వైసీపీ నేతలే ఇన్‌సైడ్‌లో సెటైర్లు పేల్చుతున్నారట. జగన్‌ మాత్రం విచిత్రంగా.. వాళ్లు మనకు మైక్‌ ఇవ్వరబ్బా.. మనం రాజీనామాలు చేసి ఎన్నికలకు వెళ్దాం అంటున్నారట తన ఎమ్మెల్యేలు, ఎంపీలతో. ఈ నేపథ్యంలోనే ఈ నెల 24న అందరూ తాడేపల్లిలో తన ముందు హాజరవ్వాలంటూ వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలకు కబురంపారట. జగన్‌ మైకు గోల ఏమో కానీ మా పదవులు ఊడేలా ఉన్నాయని, అసలు జగన్‌తో సమావేశానికి ఈ నెల 24న తాడేపల్లికి వెళ్లాలా వద్దా అని సందిగ్ధంలో పడ్డారట వైసీపీ ప్రజా ప్రతినిధులు.

Also Read: Parakamani Politics: భక్తాగ్రేసరుడు భూమన సమయం ఆసన్నమైందా!

ఇంతకీ రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్తే జరిగేది ఏంటి? ఉన్న 11 ఎమ్మెల్యే సీట్లలో నాలుగో ఐదో ఊడటం కాయం. ఇక ఉన్న నాలుగు ఎంపీ సీట్లు ఊడినా ఆశ్చర్యం లేదు. ఇది జగన్‌కి తెలీదా అంటే బాగా తెలుసు. అదే జగన్‌ రాజకీయానికి, ఇతర రాజకీయ నాయకులకు ఉన్న అతి పెద్ద తేడా. ఉప ఎన్నికల్లో తన ఎమ్మెల్యేలు ఓడటమే జగన్‌కి కావాల్సింది. అక్కడి నుండే సింపతీ గేమ్‌ మొదలవుతుంది. 11 మంది ఎమ్మెల్యేలున్న జగన్‌.. 164 మంది ఎమ్మెల్యేలున్న కూటమి పార్టీలను ఒంటి చేత్తో ఎదుర్కోడానికి సిద్ధపడ్డాడు అంటే… జగన్‌కు ఉన్న గట్స్‌ ఈ దేశంలో ఎవరికీ లేవు అంటూ వైసీపీ సోషల్‌ మీడియా మొదలు పెడుతుంది. అధికారం, డబ్బు, అంగబలం, కేంద్రం సపోర్టు ఉన్న కూటమి… తన ఎమ్మెల్యేలను ఓడిస్తుందని తెలిసినా… దమ్మున్నోడిలా రాజీనామాలు చేయించి ఉప ఎన్నికలకు వెళ్లాడు అంటే… అది జగన్‌కు ఉన్న ధైర్యం, అది ప్రజల పట్ల జగన్‌కు ఉన్న నమ్మకం, ప్రజల్ని నమ్ముకుని రాజకీయాలు చేసే ఏకైక లీడర్‌ జగన్‌.. అంటూ వైసీపీ పెయిడ్‌ అనలిస్టులు డిబేట్లలో భజన చేయడం మొదలు పెడతారు. ప్రజల్ని గుడ్డిగా నమ్మి నష్టపోయిన ఒకే ఒక్కడు అని సొంత మీడియా, పెయిడ్‌ మీడియాలలో రాస్తారు, మాట్లాడతారు. జగన్‌కు కావాల్సింది అది. సింపతీకి సింతపతీ. పబ్లిసిటీకి పబ్లిసిటీ. ఉప ఎన్నికలకు వెళితే జగన్‌కి కలిగే మరో ప్రయోజనం ఏంటంటే… 11 ఉన్నారు కాబట్టి అసెంబ్లీకి రమ్మని అడుగుతున్నారు. అందరూ ఓడి, తాను ఒక్కడినే పులివెందులో గెలిస్తే.. ఇక అసెంబ్లీకి వెళ్దామని సొంత పార్టీలో కానీ, అసెంబ్లీకి రమ్మని ప్రత్యర్థి పార్టీలలో కానీ, ఎవ్వరూ అడగరు. అతిశయోక్తి అనిపించినా జగన్‌ ఆలోచన, ఆయన రాజకీయం ఆ రేంజ్‌ ఉంటుంది మరి.

సెప్టెంబర్ 24న ఎమ్మెల్యేలు, ఎంపీలతో అత్యవసర సమావేశం పెట్టి, రాజీనామాల ముహూర్తం ఖరారు చేసే యోచనలో ఉన్నారట జగన్‌. ఎలాగో అనర్హత వేటు పడనుంది కాబట్టి.. అప్పటి దాకా వెయిట్‌ చేయకుండా ముందే రాజీనామా చేస్తే సెంటిమెంట్‌ అస్త్రంలా వర్కౌట్‌ అవుతుందన్నది ఆయన వ్యూహంగా చెబుతున్నారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *